మెగా పవర్ స్టార్ కు జోడీగా కొత్త అందం .. హీరోయిన్ వేటలో కొరటాల శివ
మెగాస్టార్ చిరంజీవీ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఆచార్యా అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో మెగాస్టార్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తుంది...
మెగాస్టార్ చిరంజీవీ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘ఆచార్యా’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో మెగాస్టార్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో అందాల చందమామ కాజల్ మరోసారి మెగాస్టార్ తో జతకట్టనుంది. ఇదిలా ఉంటే చిరంజీవితోపాటుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో నటించబోతున్నాడు. సినిమాలో కీలక పాత్రలో చరణ్ కనిపించనున్నాడు.
అయితే చరణ్ సరసన కూడా ఓ హీరోయిన్ కనిపించనుందట. చరణ్ పక్కన నటించే హీరోయిన్ అంటూ చాలా పేర్లు వినిపించాయి. మిల్కీ బ్యూటీ తమన్నా నటించనుందని వార్తలు వచ్చాయి. ఆతర్వాత చరణ్ తో ‘వినయ విధేయ రామ’ సినిమాలో నటించిన కియారా అద్వానీ నటిస్తుందని ప్రచారం జరిగింది. రకుల్ , రష్మిక ఇలా మూడు నాలుగు పేర్లు కూడా వినిపించాయి. అయితే తాజాగా చరణ్ సరసన కొత్త భామను తీసుకోవాలి చూస్తున్నారట దర్శకనిర్మాతలు. వచ్చే వారం హీరోయిన్ ను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇటీవలే ప్రారంభమైన షూటింగ్ లో చిరు – చరణ్ కి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించాలని కొరటాల ప్లాన్ చేస్తున్నారట. ఇందుకోసం ఇప్పటికే ‘ఆర్.ఆర్.ఆర్’ డైరెక్టర్ రాజమౌళి అనుమతి కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.
అమిత్ షా హైదరాబాద్ పర్యటన లైవ్ అప్‌డేట్స్ కోసం దిగువ లింక్ క్లిక్ చెయ్యండి :