Bigg Boss 4: వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన సాయి కుమార్

బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో మొదటి ఎలిమినేషన్ జరిగింది. అందరూ ఊహించినట్లుగానే ఈ వారం దర్శకుడు సూర్యకిరణ్‌ హౌజ్ నుంచి బయటకు వచ్చారు

Bigg Boss 4: వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన సాయి కుమార్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 14, 2020 | 8:10 AM

Bigg Boss 4 Telugu: బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో మొదటి ఎలిమినేషన్ జరిగింది. అందరూ ఊహించినట్లుగానే ఈ వారం దర్శకుడు సూర్యకిరణ్‌ హౌజ్ నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా సూర్య కిరణ్ ఎలిమినేషన్‌కి తానే కారణం అంటూ మోనాల్ బోరున ఏడ్చేసింది. ఆ తరువాత స్టేజ్ మీదికి వచ్చిన సూర్యకిరణ్‌కి నాగార్జున సరదా టాస్క్ ఇచ్చారు. హౌజ్‌లో ఉన్న ఒక్కొక్కరిని ఒక్కో జంతువుతో పోల్చమని చెప్పారు. ఇక కుక్క, కోతి, గాడిద, నక్క వంటి జంతువులను కూడా ఇచ్చి వాటిలోని పాజిటివ్‌ని చెప్పి ఎవరినీ నొప్పించకుండా అద్భుతంగా విశ్లేషించారు సూర్యకిరణ్. ఆ తరువాత వైల్డ్ కార్డు ఎంట్రీతో ఈ రోజుల్లో, బస్టాప్ ఫేమ్‌ సాయి కుమార్ ఎంట్రీ ఇచ్చారు.

ఇక మొదట్లోనే సాయి కుమార్ ఎక్కువగా మాట్లాడేశారు. అంతేకాదు ఈ షోకు రావడం వలన నాగార్జునతో పరిచయం అవుతుందని, దాని ద్వారా తన వద్ద ఉన్న కథను చెప్పొచ్చని వివరించారు. బిగ్‌బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చిన తరువాత నాగార్జునకు స్క్రిప్ట్ చెప్పాలని ఆశగా ఉందని చెప్పుకొచ్చారు. అయితే మొదటి ఐదు రోజులుగా కాస్త సోసోగానే సాగిన ఈ సీజన్.. వీకెండ్‌లో కాస్త వినోదంగా నడిచింది. ఇక వైల్డ్ కార్డు ఎంట్రీతో ఇప్పటినుంచైనా వినోదంగా బిగ్‌బాస్ మారుతుందేమో చూడాలి.

Read More:

గుడ్‌న్యూస్‌.. తగ్గిన మాస్క్, పీపీఈ కిట్‌ల ధరలు

వచ్చే ఏడాది మొదట్లో వ్యాక్సిన్.. మొదట వారికే ప్రాధాన్యం: హర్షవర్ధన్