బిగ్ బాస్ 4 : అనుకున్నట్లుగానే సూర్యకిరణ్ ఔట్
బిగ్ బాస్ తెలుగులో నాలుగో సీజన్ లోని కొన్ని అంశాలను వీక్షకులు ముందుగానే ఊహిస్తున్నారు. మొదటి వారాంతంలో హౌస్ నుంచి డైరెక్టర్ సూర్యకిరణ్ ఎలిమినేట్ అవుతారని చాలామంది జోస్యం చెప్పారు.
బిగ్ బాస్ తెలుగులో నాలుగో సీజన్ లోని కొన్ని అంశాలను వీక్షకులు ముందుగానే ఊహిస్తున్నారు. మొదటి వారాంతంలో హౌస్ నుంచి డైరెక్టర్ సూర్యకిరణ్ ఎలిమినేట్ అవుతారని చాలామంది జోస్యం చెప్పారు. అదే జరిగింది. ఆదివారం నాగార్జున హౌస్ లో అందర్నీ పలకరించి..ఈ వీక్ లో జరిగిన వివిధ విషయాలపై చర్చించారు. ఇక ఈవారం నామినేట్ అయిన ఏడుగురిలో గంగవ్వ, అభిజిత్, సుజాత, ఇప్పటికే సేఫ్ జోన్ లో ఉన్నారని నాగార్జున శనివారం తెలిపారు. ఇక మిగిలినది దివి, అఖిల్, సూర్యకిరణ్, మహబూబ్ నలుగురు డేంజర్ జోన్ లో ఉన్నారు. వీరిలో సూర్యకిరణ్ తొలి ఎలిమినేషన్ ఎదుర్కొన్నాడు. దీంతో సూర్యకిరణ్ బ్యాగు సర్దేసుకొని బయటకు వచ్చేశాడు. ఇక బయటకు వచ్చాక సూర్యకిరణ్ తన హౌస్ మేట్స్ కారెక్టర్లను వివిధ రకాలు జంతువులతో పోల్చాడు. నోయల్ ను నక్క అని, లాస్యను గాడిదతో పోల్చడం చర్చనియాంశమైంది. ఈరోజుల్లో, బస్టాప్ సినిమాల ఫేమ్ సాయి కుమార్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్ లోకి అడుగుపెట్టాడు.
Also Read :