వెన్నిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సత్తా చాటిన మరాఠీ చిత్రం

వెన్నిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మఠారీ చిత్రం సత్తా చాటింది. చైతన్య తమ్హానే దర్శకత్వం వహించిన ది డిసిపుల్‌ చిత్రానికి రెండు అవార్డులు లభించాయి

వెన్నిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సత్తా చాటిన మరాఠీ చిత్రం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 14, 2020 | 9:00 AM

The Disciple movie: వెన్నిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మఠారీ చిత్రం సత్తా చాటింది. చైతన్య తమ్హానే దర్శకత్వం వహించిన ది డిసిపుల్‌ చిత్రానికి రెండు అవార్డులు లభించాయి. బెస్ట్‌ స్క్రీన్‌ప్లే, ఎఫ్‌పీఆర్‌ఈఎస్‌సీఐ క్రిటిక్స్ విభాగంలో ఈ మూవీకి అవార్డులు లభించాయి. ఓ యువ సంగీత కళాకారుడు చేసే సంగీత ప్రయాణం కథాంశంతో చైతన్య ఈ సినిమాను తెరకెక్కించారు.

ఇక ఈ అవార్డులు రావడంపై చైతన్య మాట్లాడుతూ.. ”ఈ సినిమా కథను రాసేందుకు నేను చాలా శ్రమ తీసుకోవాల్సి వచ్చింది. ఈ అవార్డు రావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. అలాగే ఇకపై మరింత కష్టపడేందుకు ప్రోత్సహాన్ని ఇచ్చింది. నా సినిమా కోసం పనిచేసిన మ్యూజిషియన్లు, రీసెర్చర్లు, రచయితలు అందరికీ ఈ అవార్డును అంకితం చేస్తున్నా” అని తెలిపారు. కాగా 2014లో ఈ దర్శకుడు కోర్టు అనే చిత్రాన్ని తెరకెక్కించగా.. ఆ మూవీకి ఉత్తమ చిత్రంగా అవార్డు లభించింది. అలాగే చైతన్య ద లయన్ ఆఫ్‌ ది ఫ్యూచర్ అవార్డును సొంతం చేసుకున్నారు. మరోవైపు ది డిసిపుల్‌కి రెండు అవార్డులు వచ్చినందుకు గానూ పలువురు ప్రముఖులు చైతన్యకు అభినందనలు తెలుపుతున్నారు.

Read More:

ఇవాల్టి నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్న హరీష్ రావు

Bigg Boss 4: వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన సాయి కుమార్