వచ్చే ఏడాది మొదట్లో వ్యాక్సిన్.. మొదట వారికే ప్రాధాన్యం: హర్షవర్ధన్

వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలోగా కోవిడ్‌–19కి వ్యాక్సిన్‌ వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు.

వచ్చే ఏడాది మొదట్లో వ్యాక్సిన్.. మొదట వారికే ప్రాధాన్యం: హర్షవర్ధన్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 14, 2020 | 9:58 AM

Minister Harsh Vardhan: వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలోగా కోవిడ్‌–19కి వ్యాక్సిన్‌ వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. ఆదివారం సోషల్ మీడియాలో ‘సండే సంవాద్’ కార్యక్రమంలో తన ఫాలోవర్లతో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన ఆయన.. వ్యాక్సిన్‌ భద్రతపై ఎవరికీ సందేహాలు, ఆందోళనలు లేకుండా, తానే మొదటి డోసు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ ప్రయోగాలకు డీసీజీఐ అనుమతులు ఇచ్చాకే సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ భారత్‌లో ప్రయోగాలు ప్రారంభమయ్యాయని ఆయన వెల్లడించారు.

ఇక కరోనా వైరస్ వస్తే అత్యవసరమైన వారికే ముందుగా ఇస్తామని హర్షవర్ధన్ వివరించారు. సీనియర్ సిటిజన్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు తొలి ప్రాధాన్యత ఇస్తామని., ఆర్థికంగా వారికి టీకా కొనుగోలో చేసే శక్తి లేకపోయినా వారికే ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటుందని వివరించారు. వ్యాక్సిన్‌ భద్రత, నాణ్యత, ధర, ఉత్పత్తి, సరఫరా ఇలా అన్ని విషయాల్లోనూ ఇప్పటికే విస్తృత స్థాయిలో చర్చలు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. ఇక మార్కెట్‌లోని రెమిడెసిమర్ వంటి మందుల విషయంలో అక్రమ దందా జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిపై చర్యలు తీసుకునేలా ఔషధ నియంత్రణ మండలికి సూచించినట్లు మంత్రి వివరించారు.

Read More:

బిగ్ బాస్ 4 : అనుకున్నట్లుగానే సూర్యకిరణ్ ఔట్

డ్రగ్స్​ కేసు : రకుల్​కు బాసటగా సమంత​