Hero electric bicycle: ఆరోగ్యం.. సౌకర్యం.. రెండూ ఒకేసారి.. ఈ-సైకిల్‌తో సాధ్యం.. హీరో నుంచి కొత్త మోడల్..

కొత్త హీరో ఎలక్ట్రిక్ సైకిల్ లో అనేక ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. చిన్న డిజిటల్ ఇన్సూరెన్స్ కంట్రోల్, రియల్ టైమ్ స్పీడోమీటర్, యూఎస్బీ చార్జింగ్ బోర్డ్ తో ఆకర్షణీయంగా ఉంది. ఈ సైకిల్ డబుల్ డిస్క్ బ్రేక్ సస్పెన్షన్‌ను కలిగి ఉంది. సర్దుబాటు చేయగల సీటులో టెలిస్కోప్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. ఎలక్ట్రిక్ సైకిల్‌లో బ్యాటరీ ప్యాక్ అధిక సామర్థ్యంతో ఉంటుంది.

Hero electric bicycle: ఆరోగ్యం.. సౌకర్యం.. రెండూ ఒకేసారి.. ఈ-సైకిల్‌తో సాధ్యం.. హీరో నుంచి కొత్త మోడల్..
Hero Electric Bicycle
Follow us

|

Updated on: May 02, 2024 | 1:06 PM

ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల శకం నడుస్తోంది. అనేక రకాల ఫీచర్లు, కొత్త హంగులతో కార్లు, మోటారు సైకిళ్లు మార్కెట్ లోకి విడుదలవుతున్నాయి. వీటికి పెరుగుతున్న ప్రజాదరణతో మరిన్ని కొత్త మోడళ్లను కంపెనీలు విడుదల చేస్తున్నాయి. పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరల నుంచి ఉపశమనంగా ఈ వాహనాల వాడకం పెరిగింది. పర్యావరణంపై పెరిగిన శ్రద్ధ, ప్రభుత్వ సబ్సిడీలు కూడా మరో కారణంగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ సైకిళ్ల కూడా మార్కెట్ లో సందడి చేస్తున్నాయి.

హీరో ఎలక్ట్రిక్ సైకిల్..

గతంలో విడుదలైన హీరో సైకిల్ ఎంత సంచలనం రేపిందో చెప్పనక్కర్లేదు. ప్రజలందరికీ అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్ గా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు అదే కంపెనీ నుంచి ఎలక్ట్రిక్ సైకిల్ విడుదలవుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త టెక్నాలజీతో ముందుకు వస్తుంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే దాదాపు 75 కిలోమీటర్లు సులభంగా ప్రయాణం చేయడానికి వీలుండేలా ఈ సైకిల్ ను రూపొందించారు.. దీని ధర, ఇతర ప్రత్యేకతలను తెలుసుకుందాం.

ఆకట్టుకునే ఫీచర్లు..

కొత్త హీరో ఎలక్ట్రిక్ సైకిల్ లో అనేక ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. చిన్న డిజిటల్ ఇన్సూరెన్స్ కంట్రోల్, రియల్ టైమ్ స్పీడోమీటర్, యూఎస్బీ చార్జింగ్ బోర్డ్ తో ఆకర్షణీయంగా ఉంది. ఈ సైకిల్ డబుల్ డిస్క్ బ్రేక్ సస్పెన్షన్‌ను కలిగి ఉంది. సర్దుబాటు చేయగల సీటులో టెలిస్కోప్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. ఎలక్ట్రిక్ సైకిల్‌లో బ్యాటరీ ప్యాక్ ఉపయోగించారు. దీనిలో 5.8 లిథియం ఆన్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. దీన్ని పూర్తిగా చార్జింగ్ చేస్తే దాదాపు 75 కిలోమీటర్ల వరకు సులభంగా ప్రయాణించవచ్చు. ఈ సైకిల్ ను చార్జింగ్ చేయడానికి సుమారు 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. గంటకు 45 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందిస్తుంది. దీనిలో కంపెనీ శక్తివంతమైన 300 వాట్ బ్రా మోటార్‌ను ఉపయోగించింది. దీనిని పనితీరు చాలా సమర్థవంతంగా ఉంటుంది.

ధర ఎంతంటే..

ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ సైకిల్ రూ.35 వేలకు అందుబాటులో ఉంది. అయితే దీనిని పొందడానికి కొంతకాలం వేచి ఉండాలి. ఈ ఏడాది జూలై లో దీనిని లాంచ్ చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తుంది.

మంచి ఎంపిక..

మీరు ఎలక్ట్రిక్ సైకిల్ కోనుగోలు చేయడానికి ఆసక్తిగా ఉంటే హీరో సైకిల్ మంచి ఎంపికగా ఉంటుంది. విశ్వసనీయమైన బ్రాండ్, స్లైలిష్ లుక్, ఇతర ప్రత్యేక ఫీచర్లు దీనికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చాయి. ముఖ్యంగా యువతను ఆకట్టుకునేలా మంచి డిజైన్ తో రూపొందించారు. కార్లు, మోటారు సైకిళ్లు వెళ్లలేని చిన్ని చిన్న వీధులలో కూడా ఈ సైకిల్ పై దూసుకుపోవచ్చు. నేడు మనకు ప్రధాన సమస్యగా మారుతున్న ట్రాఫిక్ జామ్ ల నుంచి కూడా తప్పించుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..