AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hop Oxo Bike: ఎలక్ట్రిక్ బైక్‌లలో రారాజు ఇది.. 150 కి.మీ. రేంజ్.. తిరుగులేని ఫీచర్లు..

సరికొత్త లుక్ తో ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్ లోకి విడుదల అయ్యింది. దీని పేరు హాప్ ఆక్సో బైక్ (hop oxo bike). ఒక్కసారి చార్జింగ్ చేస్తే 150 కిలోమీటర్లు పరుగులు పెడుతుంది. ఫీచర్లు , రేంజ్ పరంగా ఎలక్ట్రిక్ బైక్ లలో కింగ్ లా మారింది. ధర కొంచె ఎక్కువగా కనిపించినా, దీనిలోని ఫీచర్లకు అది తగిన ధరగానే అనిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Hop Oxo Bike: ఎలక్ట్రిక్ బైక్‌లలో రారాజు ఇది.. 150 కి.మీ. రేంజ్.. తిరుగులేని ఫీచర్లు..
Hop Oxo Electric Bike
Madhu
|

Updated on: May 02, 2024 | 12:26 PM

Share

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్ పరుగులు పెడుతోంది. రోజుకో సరికొత్త మోడల్ బండి విడుదల అవుతూ అమ్మకాల జోరును పెంచుతున్నాయి. ఏ వాహనం కొనుగోలు చేయాలో నిర్ణయించుకోవడం వినియోగదారులకు కష్టంగా మారుతోంది. వేగం, స్టైల్, ఫీచర్లు, పికప్, మైలేజీలతో ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయి. సంప్రదాయ పెట్రోల్ ఇంజిన్లకు దీటుగా ఇవి తమ మార్కెట్ను విస్తరించుకుంటున్నాయి. రాబోయే కాలమంతా ఎలక్ట్రిక్ వాహనాలదే అని చెప్పవచ్చు. దాదాపు 20 ఏళ్ల తర్వాత పెట్రోల్ వాహనాలు కనిపించపోయినా ఆశ్చర్య పడనక్కర్లేదు. ఎందుకంటే వాటి వినియోగం అంతలా పెరుగుతోంది. వీటిలో ద్విచక్ర వాహనాల వినియోగం బాగా ఎక్కువైంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే దాదాపు వంద కిలోమీటర్లకు పైగా ప్రయాణించే వీలుండడంతో వీటిని కొనుగోలు చేయడానికి ప్రజలు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా సామాన్య, మధ్య తరగతుల ప్రజలకు అందుబాటులో ధరలో ఉంటున్నాయి.

సరికొత్త బైక్..

ఇప్పుడు సరికొత్త లుక్ తో ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్ లోకి విడుదల అయ్యింది. దీని పేరు హాప్ ఆక్సో బైక్ (hop oxo bike). ఒక్కసారి చార్జింగ్ చేస్తే 150 కిలోమీటర్లు పరుగులు పెడుతుంది. ఫీచర్లు , రేంజ్ పరంగా ఎలక్ట్రిక్ బైక్ లలో కింగ్ లా మారింది. ధర కొంచె ఎక్కువగా కనిపించినా, దీనిలోని ఫీచర్లకు అది తగిన ధరగానే అనిపిస్తుంది.

నిర్వహణ ఖర్చు తక్కువ..

పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల నుంచి వాహన చోదకులను రక్షించడానికి ఈ బైక్ రూపొందించినట్టు భావించవచ్చు. అందమైన లుక్ తో పాటు నిర్వహణ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. అత్యాధునిక ఫీచర్లతో ఆకట్టుకుంటున్న ఈ బైక్ మార్కెట్‌లో తన ప్రత్యేకతను చాటుకుంటుంది. ఎక్కువ మంది కొనడానికి ఇష్టపడుతున్నారు.

ప్రత్యేకతలు ఇవే..

హాప్ ఆక్సో బైక్ లోని ప్రత్యేకతలలోకి వెళితే 4.2 కేడబ్ల్యూ బీఎల్ డీసీ మోటార్ ద్వారా శక్తిని పొందుతుంది. దీని బ్యాటరీని పూర్తిగా చార్జింగ్ చేయడానికి సుమారు 4.45 గంటల సమయం పడుతుంది. ఒక ధర విషయానికి వస్తే హాప్ ఆక్సో బైక్ లు రూ.1.33 లక్షల నుంచి రూ. 1.61 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వరకూ పలుకుతున్నాయి. అలాగే ప్రైమ్, స్టాండర్డ్, ఈఎక్స్ అనే మూడు రకాల వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి.

సాఫీగా ప్రయాణం..

చాలా తక్కువ సమయంలో ఈ బైక్ ను చార్జింగ్ చేసుకోవచ్చు. కేవలం 4.45 గంటలకే పూర్తిస్థాయిలో బ్యాటరీ చార్జింగ్ అవుతుంది. ఇది మీకు ప్రయాణంలో చాలా ఉపయోగంగా ఉంటుంది. 150 కిలోమీటర్ల వరకూ రేంజ్ ఇవ్వడం వల్ల దూర ప్రాంతాలకు ఉత్సాహంగా ప్రయాణం సాగించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..