ఉద్యోగులను ఆఫీసులకు రప్పించేందుకు కొత్త మార్గం.. ‘ఆఫీస్‌ పికాకింగ్’ పేరుతో

అదే 'ఆఫీస్‌ పికాకింగ్‌' ఇటీవల ఈ పదం ఎక్కువగా వినిపిస్తోంది. ఇంతకీ ఆఫీస్‌ పికాకింగ్ అంటే ఏంటి.? అసలు దీని ఉద్దేశం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కరోనా మహమ్మారి తర్వాత చాలా వరకు కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే. అప్పటి వరకు ఈ విధానాన్ని అమలు చేయని సంస్థలు సైతం అనివార్యంగా అమలు చేసే పరిస్థితి వచ్చింది...

ఉద్యోగులను ఆఫీసులకు రప్పించేందుకు కొత్త మార్గం.. 'ఆఫీస్‌ పికాకింగ్' పేరుతో
Office Peacocking
Follow us

|

Updated on: May 02, 2024 | 11:25 AM

కార్పొరేట్‌ ప్రపంచంలో రోజుకో కొత్త ట్రెండ్ మారుతుంది. రకరకాల పేర్లతో ట్రెండింగ్‌ అవుతుంటాయి. మొన్నటి మొన్న డ్రై ప్రమోషన్‌ చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక మాంద్య పరిస్థితుల నేపథ్యంలో ఈ డ్రై ప్రమోషన్‌ను కొన్ని కంపెనీలు అమలు చేశాయి. డ్రై ప్రమోషన్‌లో ఉద్యోగి పొజిషిన్‌ మారుతుంది కానీ, ఎలాంటి జీతం పెరగదు. అయితే ఇప్పుడు కార్పొరేట్‌ వరల్డ్‌లో మరో కొత్త పదం ట్రెండ్‌ అవుతోంది.

అదే ‘ఆఫీస్‌ పికాకింగ్‌’ ఇటీవల ఈ పదం ఎక్కువగా వినిపిస్తోంది. ఇంతకీ ఆఫీస్‌ పికాకింగ్ అంటే ఏంటి.? అసలు దీని ఉద్దేశం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కరోనా మహమ్మారి తర్వాత చాలా వరకు కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే. అప్పటి వరకు ఈ విధానాన్ని అమలు చేయని సంస్థలు సైతం అనివార్యంగా అమలు చేసే పరిస్థితి వచ్చింది. అయితే కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టింది, మళ్లీ పాత రోజులు వచ్చేశాయ్‌.

దీంతో కంపెనీలు ఉద్యోగులను కచ్చితంగా ఆఫీసులకు రావాలని చెబుతున్నాయి. అయితే ఇప్పటికే కొంత మంది ఉద్యోగులు దీనికి విముకంగా ఉంటున్నారు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానానికి అలవాటు పడ్డవారు ఆఫీసులకు వెళ్లడానికి ఇష్టపడడం లేదు. దీంతో ఉద్యోగులను ఆఫీసులకు రప్పించడం కోసం కంపెనీలు ఈ ఆఫీస్‌ పికాకింగ్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఉద్యోగులను రప్పించేందుకు కార్యాలయాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాయి. ఆఫీస్‌ను అందంగా అలంకరించడం, కిచెన్లు, ఆకట్టుకునే సోఫాలు, ఫర్నిచర్‌ను, లైటింగ్‌ను ఏర్పాటుచేస్తున్నాయి.

దీనినే ఆఫీస్‌ పికాకింగ్‌గా చెబుతున్నారు. కోవిడ్‌ పూర్తిగా తగ్గిపోయిన నాలుగేళ్లు గడుస్తోన్న ఇప్పటికీ ఉద్యోగులు కంపెనీలకు వెళ్లడానికి ఇష్టం చూపకపోవడంతోనే కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. మరి ఈ విధానంతోనైనా ఉద్యోగులు మళ్లీ పూర్తి స్థాయిలో ఆఫీసుల బాటపడుతారో లేదో చూడాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
ఒక్క స్థానం కోసం 2 జట్ల మధ్య పోరు.. లెక్కలన్నీ తారుమారు..
ఒక్క స్థానం కోసం 2 జట్ల మధ్య పోరు.. లెక్కలన్నీ తారుమారు..
రోజూ అదే టిఫిన్‌ బోర్‌ కొడుతోందా.? అటుకలతో ఇలా చేయండి, రుచి అమోఘం
రోజూ అదే టిఫిన్‌ బోర్‌ కొడుతోందా.? అటుకలతో ఇలా చేయండి, రుచి అమోఘం
చేతికి కట్టుతోనే కేన్స్‌లో మెరిసిన ఐశ్వర్య రాయ్.. ఫ్యాన్స్ ఫిదా
చేతికి కట్టుతోనే కేన్స్‌లో మెరిసిన ఐశ్వర్య రాయ్.. ఫ్యాన్స్ ఫిదా
తెలుగు రాష్ట్రాలకు కుండబోతే.. వచ్చే 5 రోజులు భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాలకు కుండబోతే.. వచ్చే 5 రోజులు భారీ వర్షాలు..
నాటకీయంగా మల్కాజిగిరి కార్పొరేటర్‌ శ్రవణ్‌ అరెస్టు.. కారణం ఇదే
నాటకీయంగా మల్కాజిగిరి కార్పొరేటర్‌ శ్రవణ్‌ అరెస్టు.. కారణం ఇదే
మారిన టీమిండియా షెడ్యూల్.. ఒకే ఒక్క వార్మప్ మ్యాచ్..
మారిన టీమిండియా షెడ్యూల్.. ఒకే ఒక్క వార్మప్ మ్యాచ్..
ఐశ్వర్య నువ్వు సూపర్.. చేతికి గాయమైన లెక్క చేయకుండా..
ఐశ్వర్య నువ్వు సూపర్.. చేతికి గాయమైన లెక్క చేయకుండా..
సమ్మర్‌లో వైజాగ్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నారా.? మీకోసమే..
సమ్మర్‌లో వైజాగ్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నారా.? మీకోసమే..
ముంబైతో పోరుకు లక్నో రెడీ.. రోహిత్‌పైనే చూపులన్నీ..
ముంబైతో పోరుకు లక్నో రెడీ.. రోహిత్‌పైనే చూపులన్నీ..
తెలంగాణ మోడల్‌ స్కూళ్లలో ఇంటర్‌ 2024 ప్రవేశాలు
తెలంగాణ మోడల్‌ స్కూళ్లలో ఇంటర్‌ 2024 ప్రవేశాలు