FD calculator: రూ. లక్ష ఎఫ్‌డీ చేస్తే మెచ్యూరిటీకి ఎంత వస్తుంది? ఇదిగో ఇలా సింపుల్‌గా లెక్కించండి..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కాలిక్యులేటర్ అనేది ఫిక్స్‌డ్ డిపాజిట్ల విధానాన్ని ఉపయోగించి ఎంత సంపాదించవచ్చనే విషయాన్ని తెలియజేసే సాధనం. సాధారణంగా మార్కెట్లో అనేక రకాల పెట్టుబడి మార్గాలు ఉన్నాయి. కానీ దేశంలోని ఎక్కువ మంది ఫిక్స్‌డ్ డిపాజిట్లలోనే పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతారు. ఎఫ్‌డీ అనేది మీ మూలధనాన్ని భద్రపరచడంతో పాటు వడ్డీ కూడా అందజేస్తుంది.

FD calculator: రూ. లక్ష ఎఫ్‌డీ చేస్తే మెచ్యూరిటీకి ఎంత వస్తుంది? ఇదిగో ఇలా సింపుల్‌గా లెక్కించండి..
Fd Scheme
Follow us

|

Updated on: May 02, 2024 | 1:57 PM

పెట్టుబడి పథకాలన్నింటిలోనూ ప్రజలకు ఎక్కువ నమ్మకమైనవి ఫిక్స్‌డ్ డిపాజిట్లు(ఎఫ్‌డీలు) . వీటిలో పెట్టుబడులు పెట్టడానికి చాలామంది ఆసక్తి చూపుతారు. బ్యాంకులలో వివిధ ఎఫ్‌డీ పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో పెట్టుబడి పెడితే నిర్ణీత సమయానికి వడ్డీతో కలిపి మొత్తాన్ని అందజేస్తాయి. సాధారణ ఖాతాదారులతో పోల్చితే సీనియర్ సిటిజన్లకు వడ్డీరేటు ఎక్కువగా ఇస్తాయి. ఎఫ్‌డీలలో పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ తర్వాత ఎంత మొత్తం లభిస్తుంది అనేది ముందుగానే తెలుసుకునే వీలుంటుంది. ఎందుకంటే దీనిపై వడ్డీ రేటు స్థిరంగా ఉంటుంది. అయితే దానిని లెక్కపెట్టడానికి ఫిక్స్‌డ్ డిపాజిట్ కాలిక్యులేటర్ ఉపయోగపడుతుంది. ఇది మెచ్యూరిటీ మొత్తాన్ని ఆటోమేటిక్‌గా లెక్కిస్తుంది. మీరు చేసిన డిపాజిట్, దాని కాలవ్యవధి, వడ్డీ రేటు ఆధారంగా మెచ్యురిటీ తర్వాత మీరు అందుకునే సొమ్మును తెలియజేస్తుంది.

ఎఫ్‌డీ కాలిక్యులేటర్..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కాలిక్యులేటర్ అనేది ఫిక్స్‌డ్ డిపాజిట్ల విధానాన్ని ఉపయోగించి ఎంత సంపాదించవచ్చనే విషయాన్ని తెలియజేసే సాధనం. సాధారణంగా మార్కెట్లో అనేక రకాల పెట్టుబడి మార్గాలు ఉన్నాయి. కానీ దేశంలోని ఎక్కువ మంది ఫిక్స్‌డ్ డిపాజిట్లలోనే పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతారు. ఎఫ్‌డీ అనేది మీ మూలధనాన్ని భద్రపరచడంతో పాటు వడ్డీ కూడా అందజేస్తుంది. దీనిలో రిస్క్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. వివిధ బ్యాంకులు అందజేస్తున్న ఎఫ్ డీలను పరిశీలించి, అత్యధిక రాబడినిచ్చే దానిని ఎంపిక చేసుకోవడం ఉత్తమం.

ఎఫ్ డీ కాలిక్యులేటర్‌లోని ముఖ్యంగా మూడు భాగాలు ఉంటాయి. వాటి ఆధారంగా మెచ్యురిటీ మొత్తాన్ని లెక్కగట్టడం సులభంగా ఉంటుంది.

ప్రధాన మొత్తం.. ఇది మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టే పెట్టుబడి. మీరు పొందే రాబడి కూడా దీనిపై ఆధారపడి ఉంటుంది.

కాల వ్యవధి.. ఇది మీ డబ్బును పెట్టుబడిగా ఉంచే కాలం. ఎఫ్ డీ కాలవ్యవధి ఏడు రోజుల నుంచి పదేళ్ల వరకూ ఉంటుంది.

వడ్డీ రేటు.. ప్రతి బ్యాంకు వేర్వేరు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీని అందజేస్తాయి. కాబట్టి ఎఫ్ డీపై వచ్చే వడ్డీరేటు ఆ బ్యాంకుపై ఆధారపడి ఉంటుంది.

లెక్కగట్టే విధానం..

మీరు రూ.లక్షను ఎఫ్‌డీలో పెట్టుబడి పెట్టారనుకుందాం. దానిపై ఆరుశాతం వడ్డీని బ్యాంకు ప్రకటించింది. ఆ వడ్డీ ప్రతి త్రైమాసికానికి ప్రధాన మొత్తానికి కలుపుతారు.

A = P (1 + r/n) ^ nt ఇక్కడ A అనేది వడ్డీతో సహా n సంవత్సరాల తర్వాత సేకరించబడిన మొత్తం. P అనేది ప్రధాన మొత్తం, r అనేది వార్షిక వడ్డీ రేటు (దశాంశం), n అనేది సంవత్సరానికి ఎన్నిసార్లు వడ్డీ సమ్మేళనం చేయబడుతుందో మరియు t అనేది సంవత్సరాలలో డబ్బు పెట్టుబడి పెట్టబడిన లేదా రుణం తీసుకున్న సమయం. పై సూత్రాన్ని ఉపయోగించి రెండేళ్ల ముగింపులో మీ మెచ్యూరిటీ మొత్తం సుమారుగా రూ. 1,12,368 అవుతుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ కాలిక్యులేటర్లు ఆన్‌లైన్‌లో సులభంగా అందుబాటులో ఉంటాయి. వాటిని చాలా సులభంగా ఉపయోగించవచ్చు.

రాబడిని అంచనా వేసే సాధనం..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కాలిక్యులేటర్ అనేది పెట్టుబడులపై రాబడిని అంచనా వేయడానికి ఒక గొప్ప సాధనం. వివిధ ఎఫ్ డీ పథకాలను, వాటి వడ్డీ రేట్లు, కాల వ్యవధి ఆధారంగా వచ్చే రాబడిని లెక్క కట్టడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎఫ్ డీలో పెట్టుబడి పెట్టాలనుకుంటే వివిధ బ్యాంకులు అందిస్తున్న వడ్డీరేట్లను పోల్చుకోవడం చాలా అవసరం. ఇవి మీ మూలధనాన్ని పెంచుకోవడానికి సురక్షితమైన, తక్కువ రిస్క్ ఉన్న మార్గాలు. ఏది ఏమైనా ఇతర ఆర్థిక సాధనాల వలే కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ప్రతి పెట్టుబడిదారుడు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు పాజిటివ్, నెగటివ్ రెండింటినీ క్షుణ్ణంగా విశ్లేషించాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..