Post office: రిస్క్‌ లేని ఇన్వెస్టిమెంట్‌.. 5ఏళ్లలో రూ. 2.5 లక్షల వరకు ఆదాయం

ఎలాంటి రిస్క్‌ లేకుండా మీ డబ్బులను ఆదా చేసుకోవడమే కాకుండా రిటర్న్స్‌ కూడా పొందే అవకాశాన్ని పోస్టాఫీస్‌ అందిస్లోంది. ఇందులో భాగంగానే పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ పథకాన్ని అందిస్తోంది. ఇంతకీ ఈ స్కీమ్‌ ప్రత్యేకత ఏంటి.? ఇందులో ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత బెనిఫిట్‌ పొందొచ్చు లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వ సంస్థ పోస్టాఫీస్‌ అందిస్తున్న...

Post office: రిస్క్‌ లేని ఇన్వెస్టిమెంట్‌.. 5ఏళ్లలో రూ. 2.5 లక్షల వరకు ఆదాయం
Post Office
Follow us
Narender Vaitla

|

Updated on: May 17, 2024 | 11:53 AM

సంపాదించే దాంట్లో ఎంతో కొంత పొదుపు చేయాలని చాలా మంది ఆలోచిస్తుంటారు. ఇందుకోసం ఒక్కొక్కరు ఒక్క మార్గాన్ని అన్వేషిస్తుంటారు. అయితే మనలో చాలా మంది త్వరగా డబ్బులు డబుల్ కావాలనే ఉద్దేశంతో మ్యూచువ్‌ ఫండ్స్‌, స్టాక్‌ మార్కెట్స్‌ వంటి వాటిలో పెట్టుబడి పెడుతుంఆరు. అయితే ఇది ముమ్మాటికీ రిస్క్‌తో కూడుకున్న విషయం. పోనీ డబ్బులను మరో చోట పెట్టుబడిగా పెడతామంటే నష్టాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఎలాంటి రిస్క్‌ లేకుండా మంచి రిటర్న్స్‌ పొందేలా పోస్టాఫీస్‌ పలు పథకాలను అందిస్తోన్న విషయం తెలిసిందే.

ఎలాంటి రిస్క్‌ లేకుండా మీ డబ్బులను ఆదా చేసుకోవడమే కాకుండా రిటర్న్స్‌ కూడా పొందే అవకాశాన్ని పోస్టాఫీస్‌ అందిస్లోంది. ఇందులో భాగంగానే పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ పథకాన్ని అందిస్తోంది. ఇంతకీ ఈ స్కీమ్‌ ప్రత్యేకత ఏంటి.? ఇందులో ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత బెనిఫిట్‌ పొందొచ్చు లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వ సంస్థ పోస్టాఫీస్‌ అందిస్తున్న పథకం కావడంతో రిస్క్‌ అనే మాటకు ఆస్కారమే ఉండదు.

ఇక ప్రస్తుతం ఈ పథకానికి ఏడాది డిపాజిట్‌పై 6.9 శాతం వడ్డీ రేటు ఉంది. రెండేళ్ల పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ అకౌంట్‌పై 7 శాతం వడ్డీ రేటు అమల్లో ఉంది. మూడేళ్ల టైమ్ డిపాజిట్‌పై కూడా ఒకే వడ్డీ రేటు అందిస్తోంది. అలాగే ఐదేళ్ల పోస్టాఫీస్ టైం డిపాజిట్ అకౌంట్‌పై మాత్రం గరిష్టంగా 7.50 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. ఇందులో మీకు నచ్చిన టెన్యూర్‌ను ఎన్నుకొని రూ. 1000 నుంచి పెట్టుబడి పెట్టొచ్చు. గరిష్ట పెట్టుబడి అంటూ ఏమి లేదు.

ఉదాహరణకు మీరు ఐదేళ్ల కాల వ్యవధికి గాను రూ. లక్ష పెట్టుబడిగా పెట్టారనుకుందాం. దీనికి మీకు 7.50 శాతం వడ్డీ లభిస్తుంది. దీంతో మీకు ఐదేళ్లకు మొత్తం రూ. 44,995 వడ్డీ లభిస్తుంది. మెచ్యూరిటీ సమయానికి రూ. 1,44,995 పొందొచ్చు. ఒకవేళ రూ. 2 లక్షలు పెట్టుబడి పెడితే.. మీ చేతికి రూ. 2,89,990 వస్తుంది. అలాగే రూ. 5 లక్షలు డిపాజిట్‌ చేస్తే మెచ్యూరిటీ సమయానికి రూ. 7,24,974 పొందొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..