02 May 2024
వామ్మో.. కృతిశెట్టి అన్ని కోట్ల ఆస్తులు సంపాదించిందా ?..
Rajitha Chanti
Pic credit - Instagram
ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కృతిశెట్టి. ఈ సినిమా విడుదలకు ముందే ఈ బ్యూటీ ఓ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.
ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తెలుగులో కృతికి ఆఫర్స్ క్యూ కట్టాయి. తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగర్రాజు చిత్రాల్లో నటించింది.
కానీ ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ నటించిన చిత్రాలన్ని డిజాస్టర్స్ కావడంతో ఆఫర్స్ తగ్గిపోయాయి. ఇప్పుడు కృతి చేతిలో రెండు సినిమాలే ఉన్నాయి.
తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తున్న కృతి ఒక్కో సినిమాకు దాదాపు రూ. 40 నుంచి రూ. 50 లక్షల వరకు పారితోషికం తీసుకుంటుందట.
నివేదికల ప్రకారం.. కృతి తండ్రి బెంగళూరులో ప్రముఖ వ్యాపారవేత్త. ఇప్పటివరకు కృతిశెట్టి రూ. 30 కోట్ల ఆస్తి సంపాదించిందని సమాచారం.
అలాగే సొంతంగా ఇళ్లు, ఖరీదైన కార్లు ఉన్నాయని టాక్ వినిపిస్తుంది. నిజానికి కృతి చిన్న వయసులోనే పలు వాణిజ్య ప్రకటనల్లో నటించింది.
ప్రస్తుతం తెలుగు, తమిళంలో ఒక్కో చిత్రంలో నటిస్తుంది. అలాగే మలయాళంలోనూ ఓ పాన్ ఇండియా ప్రాజెక్టులో నటిస్తుంది ఉప్పెన బ్యూటీ.
తెలుగులో శర్వానంద్ నటిస్తు్న్న మనం సినిమాలో నటిస్తుంది. ఇందులో ఒక బాబు తల్లిగా కనిపించనుంది కృతి. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కానుంది.
ఇక్కడ క్లిక్ చేయండి.