నల్లేరు.. మొక్క కాదు.. నయం కాని రోగాలకు సంజీవని!

Jyothi Gadda

02 May 2024

పూర్వకాలంలో నల్లేరు చిగుళ్లను వంటల్లో ఎక్కువగా ఉపయోగించేవారు. అయితే రాను రాను దీని వాడకం చాలా తగ్గిపోయింది. దీని ప్రయోజనాలు తెలిసి ఇప్పుడిప్పుడే మళ్లీ దీన్ని తినేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు.

తీగ జాతికి చెందిన నల్లేరు మొక్కను వజ్రవల్లి, అస్థి సంహారక అని  కూడా పిలుస్తుంటారు. నల్లేరు తీగ వల్లన కలిగే లాభాలు తెలిస్తే.. అసలు వదలిపెట్టరు. గ్రామాల్లో ఉండే వారికి ఈ మొక్కపై అవగాహన ఎక్కువ.

నల్లేరు ఎక్కడైనా సరే చాలా తేలికగా పెరిగిపోయే మొక్క. చిన్న ముక్క పడేస్తే చాలు.. అదే చిలవలు, పలవలై పెద్ద పొదలా తయారవుతుంది. అంత తేలికగా పెరిగిపోయే మొక్క కాబట్టే దీన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోరు.

నల్లేరులో కాల్షియం, విటమిన్‌ సీ, సెలీనియం, క్రోమియం, విటమిన్‌ బీ, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ లక్షణాలు పుష్కలంగా అంటాయి. అలాగే దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. 

మహిళల్లో మెనోపాజ్‌ తర్వాత ముఖ్యంగా వచ్చే సమస్య ఎముకలు బోలుగా మారడం. ఇది క్రమంగా తింటూ ఉండటం వల్ల ఆ సమస్య రాకుండా ఉంటుంది. మహిళలే కాదు.. ఎముకల సమస్యలు, మోకాళ్ల నొప్పులకు మంచిది.

నల్లేరు కాడల్ని శభ్రం చేసి వంటల్లో వేసుకుని తింటే మంచిదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. దీంతో నడుము నొప్పి, కీళ్ల నొప్పులు తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. విరిగిన ఎముకలు సులభంగా అతుక్కుంటాయి.

నల్లేరు తీగ ఎముకలు గుల్ల బారడం, విరగడం లాంటి సమస్యలకు చక్కని ఔషధం. ఎముకల దృఢత్వాన్ని పెంచడమే కాకుండా, వాటికి శక్తి నిస్తుంది. నల్లేరు తీగ రసంతో రక్తహీనత సమస్యను పరిష్కరిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

నల్లేరులోని పీచు  ఫైల్స్ సమస్యను తగ్గిస్తుంది. నల్లేరు రసంలో నెయ్యి, పంచదార కలిపి తాగితే పీరియడ్స్ సంబంధించిన సమస్యలు తొలిగిపోతాయట.  ఏన్ని లాభాలు ఉన్నప్పటికి ఆయుర్వేద నిపుణులను, వైద్యులను సంప్రదించి వాడటం ఉత్తమం.