Bigg Boss 4 Teugu : ఈ వారం ‘నో’ ఎలిమినేషన్‌.. బిగ్‌బాస్ గ్రాండ్‌ ఫినాలే అప్పుడేనా..!

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 4 విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే షో ప్రారంభం అయ్యి 81 రోజులు పూర్తి అయ్యింది.

Bigg Boss 4 Teugu : ఈ వారం 'నో' ఎలిమినేషన్‌..  బిగ్‌బాస్ గ్రాండ్‌ ఫినాలే అప్పుడేనా..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 26, 2020 | 12:56 PM

Bigg Boss 4 Telugu: తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 4 విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే షో ప్రారంభం అయ్యి 81 రోజులు పూర్తి అయ్యింది. ఈ క్రమంలో ఒక్కొక్కరుగా బయటకు వచ్చేయగా.. ఇప్పుడు హౌజ్‌లో అభిజిత్‌, అఖిల్‌, అవినాష్‌, అరియానా, మోనాల్‌, హారిక, సొహైల్‌లు మిగిలారు. వీరిలో ఈ వారం నామినేషన్‌లలో అవినాష్‌, అరియానా, మోనాల్‌, అఖిల్‌లు ఉండగా.. అవినాష్‌కి ఎవిక్షన్ పాస్ లభించింది. దీంతో రెండు వారాల పాటు అతడు ఎలిమినేషన్ నుంచి సేఫ్‌ అయ్యాడు. (ఆదిపురుష్‌.. ప్రభాస్‌ కోసం స్పెషల్ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌.. ట్రైనింగ్ ప్రారంభించనున్న రెబల్‌స్టార్)

ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ వారం బిగ్‌బాస్‌ 4లో ఎలిమినేషన్ ఉండదని తెలుస్తోంది. అలాగే ఈ వారం రీఎంట్రీ ఉండనున్నట్లు వార్తలు వచ్చినా.. కరోనా నేపథ్యంలో ఆ ఆలోచనను నిర్వాహకులు మానుకున్నట్లు సమాచారం. ఇక రానున్న రెండు వారాల్లో ఇద్దరు ఎలిమినేట్ అవ్వనుండగా.. ఆ తరువాత డిసెంబర్‌ 20న గ్రాండ్ ఫినాలేను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కాగా టాప్‌ 2లో అభిజిత్‌, సొహైల్‌ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. మిగిలిన వారిలో అఖిల్‌, అవినాష్‌, మోనాల్‌లు టాప్‌ 5లో ఉండనున్నట్లు టాక్‌. (‘పుష్ప’ గురించి క్రేజీ న్యూస్‌.. బన్నీకి విలన్‌గా చియాన్ విక్రమ్‌.. త్వరలోనే అధికారిక ప్రకటన..!)