Bigg Boss 4: అఖిల్‌, సొహైల్‌లను ఓరేంజ్‌లో ఆడుకున్న దెయ్యం జలజ.. వీడియో చూస్తే పొట్టచెక్కలే

బిగ్‌బాస్‌ హౌజ్‌లో దెయ్యం జలజ హడావిడి రెండో రోజు కొనసాగింది. గురువారం నాటి ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులకు 12వ అంతస్తు సినిమా చూపిస్తూ.. మధ్య మధ్యలో మూవీని ఆపి, ఒక్కో ఇంటి సభ్యుడిని కన్ఫెషన్ రూమ్‌కి పిలిచి,

Bigg Boss 4: అఖిల్‌, సొహైల్‌లను ఓరేంజ్‌లో ఆడుకున్న దెయ్యం జలజ.. వీడియో చూస్తే పొట్టచెక్కలే
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 27, 2020 | 7:14 AM

Akhil Sohel video: బిగ్‌బాస్‌ హౌజ్‌లో దెయ్యం జలజ హడావిడి రెండో రోజు కొనసాగింది. గురువారం నాటి ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులకు 12వ అంతస్తు సినిమా చూపిస్తూ.. మధ్య మధ్యలో మూవీని ఆపి, ఒక్కో ఇంటి సభ్యుడిని కన్ఫెషన్ రూమ్‌కి పిలిచి, అక్కడ ఉన్న స్పూన్‌ని వెతికి తీసుకురావాలని టాస్క్‌ ఇచ్చింది. ఈ టాస్క్‌లో భాగంగా అఖిల్‌, సొహైల్‌లను కన్ఫెషన్‌ రూమ్‌లోకి పిలిచింది. ఇక ఎప్పటిలాగే కథ వేరే ఉంటుంది అంటూ బిల్డప్‌ కొడుతూ అఖిల్‌తో కలిసి సొహైల్‌ కన్ఫెషన్ రూమ్‌కి వెళ్లాడు.

ఇక అక్కడకు వెళ్లాక మాత్రం వారిద్దరు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. పైకి గంభీరంగా ఉంటునే.. సొహైల్‌ మాత్రం గజ గజ వణికిపోయాడు. అందరి కంటే ఎక్కువ సేపు జలజ వీరిద్దరిని ఆటపట్టించింది. ఇక లోపల వీళ్ల అరుపులను బయటి నుంచి వింటోన్న మోనాల్‌.. ‘కథ వేరే ఉంటుందా.. కథ వేరే ఉంటుందా’?? అంటూ డ్యాన్స్‌ చేసింది. మరోవైపు హారిక కూడా అరేయ్ ఏమైందిరా సొహైల్.. పీకుతా పొడుస్తా అన్నావు అంటూ గాలి తీసేసింది. మొత్తానికి భయపడుతూనే అఖిల్‌, సొహైల్‌లు స్పూన్‌లు తీసుకొచ్చారు. బయటకు వచ్చాక మాత్రం ఏం జరగనట్లు ధైర్యంగా నటించారు. ఆ తరువాత కెమెరా ముందుకు వెళ్లి.. ‌”గజ్జుమనిపించిడ్రు. బై మిస్టేక్‌ కూడా ఈ వీడియోలు ఎక్కడా వేయకండి బిగ్‌బాస్‌. మా ఇజ్జత్‌ పోతది. చూడడానికి కండలు తిరిగి ఉన్నాం. కానీ భయంతో వణికిపోయాం” అంటూ రిక్వెస్ట్ చేశాడు. మొత్తానికి వీరిద్దరి వీడియో ఎపిసోడ్‌కి హైలెట్‌గా మారింది.