Bigg Boss 4: గంగవ్వ ‘మహానటి’ పర్ఫామెన్స్.. సీక్రెట్ వీడియో రివీల్ చేసిన నాగార్జున
ఈ వారం హౌజ్‌లో మహానటి, మహాకంత్రి, మహానాయకుడు అనే మూడు మెడల్స్‌కి నాగార్జున కంటెస్టెంట్‌లకు ఇచ్చారు
Gangavva Bigg Boss 4: ఈ వారం హౌజ్‌లో మహానటి, మహాకంత్రి, మహానాయకుడు అనే మూడు మెడల్స్‌కి నాగార్జున కంటెస్టెంట్‌లకు ఇచ్చారు. అందులో తన జట్టును గెలిపించిన అభిజిత్‌కి మహానాయకుడు అనే మెడల్‌ని వేశారు. నాగార్జున స్వయంగా అభిజిత్‌ని మహానాయకుడు అంటూ కొనియాడారు. ఇక మహాకంత్రి మెడల్‌ని అవినాష్, అమ్మ రాజశేఖర్‌కి వేశారు. చివరిగా మహానటి మెడల్‌ని నాగార్జున గంగవ్వకు ఇచ్చారు. ఈ మెడల్‌ని ఇచ్చేటప్పుడు అందరికీ ఒక సీక్రెట్ వీడియోను నాగ్ చూపించారు.
అందులో లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఉక్కు హృదయం చేసినప్పుడు గంగవ్వ తెలివిగా అఖిల్‌ను బోల్తా కొట్టించింది. ఇక ఈ వీడియోను చూసిన హౌజ్ సభ్యులు షాక్‌కి గురయ్యారు. ఆ వీడియోలో రూమ్ లోపల అభిజిత్‌తో గంగవ్వ ప్లాన్ చేసి బయటకు వచ్చి అఖిల్ వద్ద ఏమీ తెలీనట్లు నటించింది. దివిని కిడ్నాప్ చేయడంలో గంగవ్వ కీలక పాత్ర పోషించింది. దీంతో నాగార్జున ఆ మెడల్ గంగవ్వకు ఇచ్చారు. మొత్తానికి గంగవ్వ మహానటి పర్ఫామెన్స్ వీక్షకులు కూడా షాక్‌కి గురయ్యారు.
Read More: