Bigg Boss-4: ఆరేళ్లుగా చెప్పాలనుకుంటున్నా, ఆ సీక్రెట్ ఇప్పుడు చెబుతున్నా.. అమ్మ సారీ
బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో భాగంగా ఒక్కొక్కరి సీక్రెట్‌లు బయటపడ్డాయి. ఈ సందర్భంగా హారిక ఓ విషయాన్ని బయటపెట్టింది.
Harika secret Love: బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో భాగంగా ఒక్కొక్కరి సీక్రెట్‌లు బయటపడ్డాయి. ఈ సందర్భంగా హారిక ఓ విషయాన్ని బయటపెట్టింది. నేను తెరిచిన పుస్తకాన్నే. కానీ మా అమ్మ దగ్గర దాచింది ఇదొక్కటే. ఆరేళ్లుగా చెప్పాలనుకుంటున్నా. కానీ ఇప్పుడు చెబుతున్నా. మమ్మీ నువ్వు టెన్షన్ పడకు. నన్ను కొట్టడానికి, తిట్టడానికి నా ముందు లేవుగా అందుకే చెబుతున్నా. (Bigg Boss 4: నేను చచ్చిపోయి ఏడాది అయ్యుండేది.. భయంకర యాక్సిడెంట్‌ని గుర్తు చేసుకున్న అరియానా)
నన్ను ఎప్పుడు అందరికీ ఎగ్జాంపుల్‌గా చెబుతుంటావు కదా. హారిని చూసి నేర్చుకోండిరా. లవ్‌లు, రిలేషన్‌ల జోలీకి వెళ్లదు అని చెబుతుంటావు. కానీ నేను నాలుగున్నరేళ్లు రిలేషన్‌లో ఉన్నా. వదిలేసి కూడా రెండేళ్లు అవుతుంది. అతడు నా మీద ఎక్కువ కేరింగ్ చూపించేసరికి అలా జరిగిపోయింది. కానీ తరువాత బ్రేకప్ అయింది. ఇప్పుడు నేను నార్మల్‌గా ఉన్నా అని చెప్పుకొచ్చింది. ఇప్పుడు నేను నార్మల్‌గా ఉన్నా అని చెప్పుకొచ్చింది. ఇక ఈ సీక్రెట్ నచ్చడంలో అఖిల్, హారికకు లెటర్ పంపాడు. దాన్ని చదువుతూ తెగ ఏడ్చేసింది హారిక. (Bigg Boss 4: పేరెంట్స్‌కి మరో షాకింగ్ న్యూస్ చెప్పిన లాస్య.. సారీ అంటూ భావోద్వేగం)