Bigg Boss 4: ఆ ఇద్దరి సీక్రెట్‌లను మెచ్చని అఖిల్‌.. లెటర్లు క్రాష్‌

బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో భాగంగా తమ సీక్రెట్‌లను కంటెస్టెంట్‌లు బయటపెట్టిన విషయం తెలిసిందే. వారు చెప్పే సీక్రెట్‌లను సీక్రెట్‌ రూమ్‌లో ఉండి వింటున్న అఖిల్‌.. నచ్చిన వారికి లెటర్లను పంపాడు

Bigg Boss 4: ఆ ఇద్దరి సీక్రెట్‌లను మెచ్చని అఖిల్‌.. లెటర్లు క్రాష్‌
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 13, 2020 | 9:18 AM

Contestants revels their secrets: బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో భాగంగా తమ సీక్రెట్‌లను కంటెస్టెంట్‌లు బయటపెట్టిన విషయం తెలిసిందే. వారు చెప్పే సీక్రెట్‌లను సీక్రెట్‌ రూమ్‌లో ఉండి వింటున్న అఖిల్‌.. నచ్చిన వారికి లెటర్లను పంపాడు. ఈ క్రమంలో అవినాష్‌.. తాను 80వేలు పోగొట్టుకున్న విషయాన్ని చెప్పాడు. సినిమా పిచ్చితో నాన్నను అడిగితే ఆయన అప్పు చేసి మరీ తెచ్చి తన చేతిలో పెట్టారని, కానీ అది ఒక నిర్మాత చేతిలో పెట్టి, మోసపోయానని అన్నాడు. ఇప్పటికీ ఈ విషయం తన తల్లిదండ్రులకు తెలీదని చెప్పాడు. అయితే ఈ విషయం తనకు ముందే చెప్పాడంటూ అవినాష్‌ లేఖను అఖిల్‌ చించేశాడు. (కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 997 కొత్త కేసులు.. నలుగురు మృతి.. కోలుకున్న 1,222 మంది)

ఇక అరియానా తను ఎదుర్కొన్న యాక్సిడెంట్ గురించి చెప్పగా.. ఇది సీక్రెట్ కాదంటూ ఆమె లెటర్‌ని కూడా అఖిల్ చించేశాడు. అయితే అవినాష్‌‌ చిరిగిన తమ లెటర్‌లను ఒక చోట చేర్చి చదివే ప్రయత్నం చేశారు. ఇక అఖిల్ చర్యపై వీక్షకుల్లో భిన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. (Bigg Boss 4: ఆరేళ్లుగా చెప్పాలనుకుంటున్నా, ఆ సీక్రెట్‌ ఇప్పుడు చెబుతున్నా.. అమ్మ సారీ)