నాగార్జునకు జర్నలిస్ట్ శ్వేతారెడ్డి సవాల్: సమంత, అమలను..!
బిగ్‌బాస్-3 రియాల్టీ షో.. మొదలు కాకముందు నుంచి ఎన్ని వివాదాల్లో ఇరుక్కుందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఆ వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. తాజాగా.. ఈ షోపై జర్నలిస్ట్ శ్వేతా రెడ్డి ఘాటు విమర్శలు చేసింది. ఏకంగా టాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు నాగార్జునకే సవాలు విసిరింది. మీ అర్థాంగి అమల.. కనీసం జంతువుల సంరక్షణ కోసం అయినా స్పందిస్తారు. కానీ.. మీరు నోరైనా మెదపడం లేదు. బిగ్‌బాస్-3 షోపై ఇంత మంది అమ్మాయి రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే.. […]
బిగ్‌బాస్-3 రియాల్టీ షో.. మొదలు కాకముందు నుంచి ఎన్ని వివాదాల్లో ఇరుక్కుందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఆ వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. తాజాగా.. ఈ షోపై జర్నలిస్ట్ శ్వేతా రెడ్డి ఘాటు విమర్శలు చేసింది. ఏకంగా టాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు నాగార్జునకే సవాలు విసిరింది. మీ అర్థాంగి అమల.. కనీసం జంతువుల సంరక్షణ కోసం అయినా స్పందిస్తారు. కానీ.. మీరు నోరైనా మెదపడం లేదు.
బిగ్‌బాస్-3 షోపై ఇంత మంది అమ్మాయి రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే.. నాగార్జున ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మన్మథుడు-2 ప్రమోషన్స్ కోసం ఆసక్తి చూపుతున్న నాగార్జున.. మా ఆందోళనపై ఎందుకు మౌనం వహిస్తున్నారని అన్నారు. టాస్క్‌ల పేరిట హౌస్‌లోని కంటెస్టెంట్‌లను మానసికంగా వేధిస్తున్నారని విమర్శించారు. డబ్బుల కోసమేగా.. మీరు ఇంత మౌనం వహిస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు.
కాగా.. దమ్ముంటే మీ కోడలు సమంత, మీ వైఫ్ అమలను బిగ్‌బాస్ హౌస్‌కి పంపించండి.. ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయని ఆరోపించారు. నాగార్జున దొంగలా దాక్కుంటున్నారని.. తప్పు చేయకపోతే.. మా ఆందోళనపై స్పందించాలని డిమాండ్ చేశారు జర్నలిస్ట్ శ్వేతారెడ్డి.