బ్రేకింగ్: ‘బిగ్‌బాస్ తెలుగు 3’ షో టైమింగ్స్ ఛేంజ్.. ఎప్పుడంటే..!

తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3 చాలా రసవత్తరంగా సాగుతోంది. కొట్లాటలు.. తిట్లతో .. ముందుకు దూసుకెళ్తోంది. అలాగే.. అన్ని షోల కంటే టాప్ రేటింగ్‌తో ముందుంది. ఆది నుంచి ఇప్పటివరకూ.. ఫుల్ కాంట్రవర్సియల్ షోగా బిగ్‌బాస్ 3 నిలుస్తుందనే చెప్పవచ్చు. కాగా.. బుల్లితెరపై ప్రేక్షకులను ఎంతగానో అలరించే రియాల్టీ షో.. బిగ్‌బాస్ షో టైమింగ్స్ ఛేంజ్ కాబోతున్నాయి. ఇప్పటికే ముగింపుదశకు చేరుకున్న ఈ షోకి.. మరో వారంలోనే శుభం కార్డ్ పడనుంది. అయితే.. తాజా సమాచారం ప్రకారం.. […]

బ్రేకింగ్: 'బిగ్‌బాస్ తెలుగు 3' షో టైమింగ్స్ ఛేంజ్.. ఎప్పుడంటే..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Oct 25, 2019 | 3:50 PM

తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3 చాలా రసవత్తరంగా సాగుతోంది. కొట్లాటలు.. తిట్లతో .. ముందుకు దూసుకెళ్తోంది. అలాగే.. అన్ని షోల కంటే టాప్ రేటింగ్‌తో ముందుంది. ఆది నుంచి ఇప్పటివరకూ.. ఫుల్ కాంట్రవర్సియల్ షోగా బిగ్‌బాస్ 3 నిలుస్తుందనే చెప్పవచ్చు. కాగా.. బుల్లితెరపై ప్రేక్షకులను ఎంతగానో అలరించే రియాల్టీ షో.. బిగ్‌బాస్ షో టైమింగ్స్ ఛేంజ్ కాబోతున్నాయి. ఇప్పటికే ముగింపుదశకు చేరుకున్న ఈ షోకి.. మరో వారంలోనే శుభం కార్డ్ పడనుంది.

అయితే.. తాజా సమాచారం ప్రకారం.. బిగ్‌బాస్ సీజన్ 3 షో టైమింగ్స్ ఛేంజ్ కాబోతున్నాయి. సాధారణంగా.. సోమవారం నుంచి శుక్రవారం వరకూ.. రోజూ.. రాత్రి 9.30 గంటల నుంచి 10.30 గంటల వరకూ కొనసాగేది. అలాగే.. శని, ఆది వారాలు మాత్రం రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతూ వస్తోంది. అయితే.. ఈ సోమవారం నుంచి శుక్రవారం వరకూ మాత్రం బిగ్‌బాస్ షో.. రాత్రి 10 గంటలకు ప్రసారం కానుండగా.. శని, ఆదివారాలు మాత్రం రాత్రి 9 గంటలకే ప్రసారం కానుంది. కొన్ని సీరియల్స్ షెడ్యూల్ స్లాట్‌లలో మార్పుల కారణంగా.. బిగ్‌బాస్ షో టైమింగ్స్ మార్చడానికి కారణమని తెలుస్తోంది.

కాగా.. ఈ వారం బిగ్‌బాస్‌ 3లో.. వరుణ్ సందేశ్, బాబా మాస్టర్, ఆలీ, శివజ్యోతి, శ్రీముఖి ఎలిమినేషన్‌లో ఉన్నారు. దీంతో.. ఈ సారి ఎలిమినేషన్‌లో టఫ్ ఫైట్ ఉండనుంది. ఇప్పటికే టికెట్ టూ ఫినాలీలో గెలిచి రాహుల్ ఫైనల్‌కు చేరుకున్నాడు.