వితిక దొంగచాటు ‘యవ్వారం’.. పునర్నవిపై శ్రీముఖి కోపం!
అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ తెలుగు’ సీజన్ 3 రోజురోజుకి ఆసక్తికరంగా మారుతోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తున్న ప్రోమోస్ నెట్టింట చర్చకు దారితీస్తున్నాయి. ఇక లేటెస్ట్‌గా వచ్చిన ప్రోమో వైరల్‌గా మారింది. పునర్నవి లేని సమయంలో వితిక.. ఆమె గురించి తప్పుగా మాట్లాడడం, ఆ వీడియోను బిగ్ బాస్ పునర్నవికి చూపించడం జరిగింది. అది చూసి పునర్నవి కోపంతో ఊగిపోయింది. అటు శ్రీముఖిని కూడా కన్‌ఫెషన్ రూంకు పిలిచి.. పునర్నవి, రాహుల్ […]
అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ తెలుగు’ సీజన్ 3 రోజురోజుకి ఆసక్తికరంగా మారుతోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తున్న ప్రోమోస్ నెట్టింట చర్చకు దారితీస్తున్నాయి. ఇక లేటెస్ట్‌గా వచ్చిన ప్రోమో వైరల్‌గా మారింది. పునర్నవి లేని సమయంలో వితిక.. ఆమె గురించి తప్పుగా మాట్లాడడం, ఆ వీడియోను బిగ్ బాస్ పునర్నవికి చూపించడం జరిగింది. అది చూసి పునర్నవి కోపంతో ఊగిపోయింది.
అటు శ్రీముఖిని కూడా కన్‌ఫెషన్ రూంకు పిలిచి.. పునర్నవి, రాహుల్ ఆమె గురించి ఏమి మాట్లాడుకున్నారో చూపిస్తాడు బిగ్ బాస్. దానికి శ్రీముఖి కూడా తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. ఇదంతా చూస్తుంటే ఈ వారం అయ్యేలోపే హౌస్‌లో మరిన్ని గొడవలు జరిగేలా కనిపిస్తోంది. అటు సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు ఈ ప్రోమోపై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఆ ప్రోమోపై ఓ లుక్కేయండి.
#Punarnavi & #Sreemukhi ki Behind the camera scenes chupinchina Bigg Bosss!!! ?#BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/TAbAA42bt1
— STAR MAA (@StarMaa) August 23, 2019