హౌస్‌లో కంటెస్టెంట్ సూసైడ్.. నిజమిదేనా..!
తమిళ బిగ్ బాస్ సీజన్ 3 అంతుచిక్కని ట్విస్టులతో ప్రతిరోజూ ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతోంది. అన్నింటికంటే ముఖ్యంగా లోసలియా – కెవిన్‌ల మధ్య ప్రేమాయణం ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. చివరికి టైటిల్ లోసలియా గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది ఇలా ఉండగా తాజాగా నటి మధుమిత హౌస్‌లో ఆత్మహత్యాయత్నం చేసుకుని సంచలనం సృష్టించింది. దాని వెనుక అసలు రీజన్ ఏంటనేది మాత్రం షో నిర్వాహకులు ఇంతవరకు బయటపెట్టలేదు. కొంతమంది రెమ్యునరేషన్ ఇవ్వలేదని ఆత్మహత్యకు పాల్పడిందంటుంటే.. మరొకొందరు నెగటివ్ […]
తమిళ బిగ్ బాస్ సీజన్ 3 అంతుచిక్కని ట్విస్టులతో ప్రతిరోజూ ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతోంది. అన్నింటికంటే ముఖ్యంగా లోసలియా – కెవిన్‌ల మధ్య ప్రేమాయణం ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. చివరికి టైటిల్ లోసలియా గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది ఇలా ఉండగా తాజాగా నటి మధుమిత హౌస్‌లో ఆత్మహత్యాయత్నం చేసుకుని సంచలనం సృష్టించింది. దాని వెనుక అసలు రీజన్ ఏంటనేది మాత్రం షో నిర్వాహకులు ఇంతవరకు బయటపెట్టలేదు. కొంతమంది రెమ్యునరేషన్ ఇవ్వలేదని ఆత్మహత్యకు పాల్పడిందంటుంటే.. మరొకొందరు నెగటివ్ ప్రచారం చేస్తున్నారు. ఏది ఏమైనా మధుమిత హౌస్ నుంచి ఎలిమినేట్ కావడం ఓ మిస్టరీగా మారింది.
హౌస్‌లో బిగ్ బాస్ ఇచ్చిన ఓ టాస్క్‌లో భాగంగా మగవారు ఆడవారిని వాడుకుంటారు.. అనే అంశంపై గొడవ పెద్దదై.. మిగిలిన కంటెస్టెంట్లతో ఈమె తరుచూ వాగ్వాదానికి దిగిందని.. దాని వల్ల మానసికంగా కృంగిపోయి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. అటు చిన్న విషయానికి ఆమె తీసుకున్న ఈ నిర్ణయం చాలామంది యువతను తప్పుదోవపట్టించే విధంగా ఉండడటంతో ఆమెను ఎలిమినేట్ చేశారని సమాచారం. అయితే ఈ జరిగిన సంఘటనలను ఇప్పటివరకు షో నిర్వాహకులు మాత్రం టెలికాస్ట్ చేయలేదు.