బిగ్ బాస్ ఓటింగ్: చివరి స్థానంలో అలీ.. టాప్ ప్లేస్‌లో ఉన్నది ఎవరంటే?

బిగ్ బాస్ సీజన్ 3 ఫైనల్‌కు చేరింది. మరి కొన్ని గంటల్లో టైటిల్ విజేత ఎవరన్నది తెలియనుంది. అయితే ఈలోపే సోషల్ మీడియాలో అనధికారికంగా విన్నర్ ఎవరనేది ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రతి వారం ఎలిమినేషన్స్ లీక్ మాదిరిగానే.. ఒక్క రోజు ముందుగానే టైటిల్ విజేత సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అని నెట్టింట్లో వైరల్ అవుతోంది. అటు నిన్నటితో ఓటింగ్ ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. స్టార్ మా నిర్వహించిన అధికారిక ఓటింగ్ పక్కన పెడితే.. పలు […]

బిగ్ బాస్ ఓటింగ్: చివరి స్థానంలో అలీ.. టాప్ ప్లేస్‌లో ఉన్నది ఎవరంటే?
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 03, 2019 | 2:56 AM

బిగ్ బాస్ సీజన్ 3 ఫైనల్‌కు చేరింది. మరి కొన్ని గంటల్లో టైటిల్ విజేత ఎవరన్నది తెలియనుంది. అయితే ఈలోపే సోషల్ మీడియాలో అనధికారికంగా విన్నర్ ఎవరనేది ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రతి వారం ఎలిమినేషన్స్ లీక్ మాదిరిగానే.. ఒక్క రోజు ముందుగానే టైటిల్ విజేత సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అని నెట్టింట్లో వైరల్ అవుతోంది. అటు నిన్నటితో ఓటింగ్ ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. స్టార్ మా నిర్వహించిన అధికారిక ఓటింగ్ పక్కన పెడితే.. పలు వెబ్‌సైట్లు నిర్వహించిన ఓటింగ్ బట్టి చూస్తే కంటెస్టెంట్ల టాప్ 5 లిస్ట్ ఇలా ఉంది.

మొదటి స్థానం: రాహుల్ సిప్లిగంజ్

రెండో స్థానం: శ్రీముఖి

మూడో స్థానం: వరుణ్ సందేశ్ 

నాలుగో స్థానం: బాబా భాస్కర్ 

ఐదో స్థానం: అలీ రెజా

ఇక ఈ లిస్ట్‌ను ప్రేక్షకులు ముందు నుంచి ఊహించారని చెప్పొచ్చు. మొదటి నుంచి ఎంటర్టైన్మెంట్‌తో హౌస్‌లో జోష్ పెంచిన బాబా భాస్కర్, బెస్ట్ పెరఫార్మెర్ అలీ రెజాకు నిరాశే మిగిలిందని చెప్పాలి.