బిగ్ బాస్: లవ్ బర్డ్స్‌కు నాగ్ షాక్.. పునర్నవి ఎలిమినేటేడ్?
అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 చివరికి వచ్చేసరికి ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక వీకెండ్ వచ్చేసింది. ఆడియన్స్ ఎదురుచూసే ఎలిమినేషన్స్ పార్ట్ ఎప్పటికప్పుడు టెలికాస్ట్ కాకముందే ముందు రోజు సోషల్ మీడియాలో లీకవుతూ వస్తున్నాయి. ఇక ఈ వారం ఎవరు హౌస్ నుంచి బయటికి వస్తారన్నది కూడా ఇప్పటికే జనాలకు అనధికారికంగా తెలిసిపోయింది. బిగ్ బాస్ సీజన్ 3 ప్రస్తుతం 11 వారాలు పూర్తి చేసుకోబోతోంది. ఈ వారం ఎలిమినేషన్స్‌లో […]
అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 చివరికి వచ్చేసరికి ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక వీకెండ్ వచ్చేసింది. ఆడియన్స్ ఎదురుచూసే ఎలిమినేషన్స్ పార్ట్ ఎప్పటికప్పుడు టెలికాస్ట్ కాకముందే ముందు రోజు సోషల్ మీడియాలో లీకవుతూ వస్తున్నాయి. ఇక ఈ వారం ఎవరు హౌస్ నుంచి బయటికి వస్తారన్నది కూడా ఇప్పటికే జనాలకు అనధికారికంగా తెలిసిపోయింది.
బిగ్ బాస్ సీజన్ 3 ప్రస్తుతం 11 వారాలు పూర్తి చేసుకోబోతోంది. ఈ వారం ఎలిమినేషన్స్‌లో వరుణ్ సందేశ్, రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి భూపాలం, మహేష్ విట్టా ఉన్నారు. ఇక వీరిలో రాహుల్ సేఫ్ జోన్‌లోకి వచ్చేశాడని నిన్నటి ఎపిసోడ్‌లో నాగ్ చెప్పేశారు. అంతేకాకుండా రాహుల్‌కి సెకండ్ హయ్యెస్ట్ ఓటింగ్ నమోదు కావడం విశేషం.
మరోవైపు ఎప్పటిలానే వరుణ్ సందేశ్ ఓటింగ్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా.. మహేష్ విట్టా.. ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన అన్ని టాస్కుల్లోనూ బాగా ఆడి సేఫ్ జోన్‌లోకి వచ్చేశాడు. తన అగ్రెసివ్ యాటిట్యూడ్, క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకున్న పునర్నవి భూపాలం ఇవాళ హౌస్ నుంచి బయటికి రానుంది. ఇప్పటికే ఈ విషయం అనధికారికంగా బయటికి వచ్చేసింది. కాగా, కొద్ది గంటల్లో దీనిపై క్లారిటీ రావడం తథ్యం.