Big News Big Debate: అంతకుమించి విజయంపై బీజేపీ ఫోకస్.. ‘కమల దళం’ వ్యూహంపై బిగ్‌ న్యూస్ బిగ్ డిబేట్..

Shiva Prajapati

Shiva Prajapati | Edited By: Ravi Kiran

Updated on: Jan 23, 2023 | 7:01 PM

2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు కౌంట్‌డౌన్ స్టార్ట్‌ అయ్యింది. అంతకంటే ముందు 9 రాష్ట్రాలకు ఎన్నికలు కూడా ఉన్నాయి. అధికారంలో ఉన్న బీజేపీకి రానున్న ఏడాది అత్యంత కీలకమైన సమయం.

Big News Big Debate: అంతకుమించి విజయంపై బీజేపీ ఫోకస్.. ‘కమల దళం’ వ్యూహంపై బిగ్‌ న్యూస్ బిగ్ డిబేట్..
Big News Big Debate

2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు కౌంట్‌డౌన్ స్టార్ట్‌ అయ్యింది. అంతకంటే ముందు 9 రాష్ట్రాలకు ఎన్నికలు కూడా ఉన్నాయి. అధికారంలో ఉన్న బీజేపీకి రానున్న ఏడాది అత్యంత కీలకమైన సమయం. మెజార్టీ రాష్ట్రాలు కైవసం చేసుకోవడంతో పాటు కేంద్రంలో హ్యట్రిక్‌ కొట్టాలనుకుంటున్న కాషాయం పార్టీ ఎప్పుడూ లేని విధంగా సరికొత్తగా తన స్వరాన్ని సవరించుకుంటోంది. ఇందులో భాగంగా మైనార్టీలకు దగ్గరయ్యేందుకు రకరకాల కార్యక్రమాలతో వస్తోంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన జాతీయ కార్యవర్గంలో మైనార్టీ జపం చేసిన పార్టీ ఇక మీదట మైనార్టీ కాలనీల్లోనే ఉండనున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

భారీ లక్ష్యమే పెట్టుకున్న బీజేపీ అందకనుగుణంగా వ్యూహాలు కూడా మొదలుపెట్టింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కేడర్‌కు దిశానిర్దేశం చేసిన అగ్రనాయకత్వం సమాజంలోని అన్ని వర్గాలవారికీ దగ్గరవ్వాలని సూచించింది. ముస్లిం మైనార్టీలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని పార్టీ శ్రేణులకు ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఓటు వేస్తారా లేదా సంబంధం లేకుండా ప్రత్యేక కార్యక్రమాలతో వారికి దగ్గర కావాలన్నది పార్టీ ఉద్దేశం. మొదట్నుంచి బీజేపీకి వ్యతిరేకంగా ఉంటారన్న ప్రచారం నేపథ్యంలో ముస్లింలు మద్దతిస్తే 2019 కంటే పెద్ద విజయం సొంతమవుతుందన్నది భావిస్తోంది పార్టీ.

అంతేకాదు ఇంతకాలం బీజేపీ ఎక్కడెక్కడైతే బలహీనంగా ఉందో అక్కడ దృష్టి సారించాలని నిర్ణయించారు. పస్మండ ముస్లింలు, బోహ్రా తెగకు చెందిన వాళ్లతో పాటు కీలక ముస్లిం నేతలతో చర్చా వేదికలు పెట్టాలని మంత్రులకు ఆదేశించారు. యూనివర్సిటీలు, చర్చీలకు వెళ్లి వారితో మమేకం కావాలని సూచించారు. ఇక మీదట సినిమాలపై అనవసరపు వివాదాలు చేయొద్దంటోంది నాయకత్వం. దీంతో పఠాన్‌ సినిమాకు అడ్డంకులు సృష్టిస్తామన్నవారే ఇప్పుడు మద్దతు ఇస్తామనడం ఆసక్తిగా మారింది. అయితే ఎంఐఎం మాత్రం బీజేపీ వ్యూహాలపై అనుమానం వ్యక్తం చేస్తోంది. బీబీసీ డాక్యమెంటరీ నిషేధించారు.. గాడ్సే సినిమాకు ఎలా మద్దతిస్తారని ఇదేనా విధానం అంటూ ప్రశ్నిస్తోంది.

మొత్తానికి 2024లో వచ్చే ఎన్నికలకు అన్ని పార్టీలు తమ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ భారత్ జోడో యాత్రలో బిజీగా ఉంది. ప్రతిపక్ష పార్టీలు మళ్లీ కలుస్తున్నాయి. కేసీఆర్‌, కేజ్రీవాల్‌ వంటి నేతలు యాక్టీవ్‌ అయి జాతీయ రాజకీయాలపై ఫోకస్‌ పెట్టారు. ప్రధానిరేసులో ఉన్నారన్న నితీష్ కుమార్ కూడా మిషన్ 2024కి రెడీ అవుతున్నారు. మల్టీ యాంగిల్‌ ఫైట్లో ఎవరు ఏ వ్యూహాలతో జనం మనసు గెలుచుకుంటారో చూడాలి.

ఇదే అంశంపై టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినికాంత్ బిగ్ న్యూస్ బిగ్ డిబేట్‌లో చర్చించారు. వీడియోను కింద చూడొచ్చు..

ఇవి కూడా చదవండి

మరిన్ని బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu