AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big News Big Debate: జనసేనపై మనసు పారేసుకుంటున్న తమ్ముళ్లు.. ఏపీలో ఎన్నికల మూడ్‌ వచ్చేసిందా.?

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు. శాశ్వత శత్రువులు ఉండరు. ఇదే సిద్ధాంతం టీడీపీ చాలాకాలంగా పాటిస్తోంది. లెఫ్ట్‌, రైట్‌‌ వింగ్‌ పార్టీలతో కలిసి గతంలో స్నేహ గీతాలు పాడిన తెలుగుదేశం... ఆ తర్వాత విబేధించి మరీ వాటిని పక్కనపెట్టింది.

Big News Big Debate: జనసేనపై మనసు పారేసుకుంటున్న తమ్ముళ్లు.. ఏపీలో ఎన్నికల మూడ్‌ వచ్చేసిందా.?
Big News Big Debate
Ram Naramaneni
|

Updated on: Jan 07, 2022 | 9:21 PM

Share

జనసేనపై మనసు పారేసుకుంటున్న తమ్ముళ్లు లవ్‌ ట్రాక్‌కు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ రెడీ అయిందా? BJP – జనసేన బంధం సంగతేంటి.? ఏపీలో ఎన్నికల మూడ్‌ వచ్చేసిందా.?

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు. శాశ్వత శత్రువులు ఉండరు. ఇదే సిద్ధాంతం టీడీపీ చాలాకాలంగా పాటిస్తోంది. లెఫ్ట్‌, రైట్‌‌ వింగ్‌ పార్టీలతో కలిసి గతంలో స్నేహ గీతాలు పాడిన తెలుగుదేశం… ఆ తర్వాత విబేధించి మరీ వాటిని పక్కనపెట్టింది. రాష్ట్ర విభజన సమయంలోనూ బీజేపీ-జనసేనతో కలిసి అధికారంలోకి వచ్చిన సైకిల్‌ పార్టీ ఆ తర్వాత ఆ పార్టీలను బ్యాక్‌ సీట్‌ నుంచి దించేసింది. 2019లో సింగిల్‌గానే సవారీ చేయబోయి బొక్క బొర్లా పడింది. ఫలితంగా మళ్లీ మిత్రుల అవసరం తమ్ముళ్లకు కనిపిస్తోంది. చంద్రబాబు చిత్తూరు టూరులో చేసిన కామెంట్లు, కేడర్‌ కోరస్‌లు ఏపీ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి.

ఓ తమ్ముడు జనసేనతో ప్రేమకోరుకుంటున్నాడు. చిన్నస్థాయి కార్యకర్తే కాదు రాష్ట్రస్థాయి నాయకుడిది అదే పాట. ఆల్రెడి జనసేనతో పెళ్లి అయిపోయింది.. కొత్తగా ప్రేమేంటీ.. ఉన్న బంధం బలపడాలన్నదే తమ ఉద్దేశమని కుండబద్దలు కొట్టేశారు.

కేడర్‌ నుంచి లీడర్స్‌ వరకు కొత్త బంధాలపై ఆశలు పెట్టుకున్నారు టీడీపీ శ్రేణులు. అధినేత కూడా వారి మనసును అర్థం చేసుకున్నారో ఏమో వాళ్ల ఆలోచనలను ఎండార్స్‌ చేస్తూ కొత్త బంధాలపై సంకేతాలు పంపుతున్నారు. ప్రేమ రెండువైపులా ఉండాలంటూ జనసేనకు స్నేహహస్తం అందిస్తున్నారు చంద్రబాబు. పొత్తులు పెట్టుకోవడం వల్ల గెలిచిన సందర్భాలున్నాయి. ఓడిన అనుభవాలున్నాయంటూనే అవసరాన్ని బట్టి పొలిటికల్‌ అలయెన్స్‌ ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు.

గత కొంతకాలంగా తమకు, టీడీపీ మధ్య రహస్య బంధం ఉందని జరుగుతున్న ప్రచారానికి చంద్రబాబే స్పష్టత ఇచ్చారన్నారు జనసేన నాయకులు. టీడీపీతో తమకు ఎలాంటి స్నేహం లేదని.. సొంతంగా అధికారంలోకి రావాలన్నదే పవన్‌ లక్ష్యమంటున్నారు.

ఇప్పటికే నాలుగైదు సార్లు కలిసి కాపురం చేసి విడిపోయిన బీజేపీ నాయకులు కూడా చంద్రబాబు వ్యాఖ్యలను లైట్‌ తీసుకుంటోంది. సొంత మామ నుంచి నిన్నమొన్నటిదాకా తమను ప్రేమించిన చంద్రబాబు పచ్చి అవకాశవాది అంటోంది కాషాయం.

తన రాజకీయ అవసరాల కోసం లెఫ్ట్‌, రైట్‌ తేడా లేకుండా వాడుకుని వదిలేయడం చంద్రబాబుకు వెన్నెతో పెట్టిన విద్యే అంటూ ఘాటుగానే విమర్శలు గుప్పించారు ఏపీ మంత్రి కొడాలి నాని.

ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్లకు పైగానే సమయం ఉంది. అయినా పార్టీలు అప్పుడే ఎలక్షన్‌ మూడ్‌లోకి తీసుకెళుతున్నాయి. టీడీపీ ఇప్పటికే నియోజకవర్గాల వారీ రివ్యూలు మొదలుపెట్టింది. పొత్తులపైనా చర్చ జనాల్లో తీసుకొచ్చింది. అటు జనసేన త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామంటోంది. బీజేపీ జనాగ్రహ సభలో బెజవాడలో శంఖారావం పూరించింది. అధికార పార్టీ వైసీపీ కూడా పార్టీ పరంగా జనాల్లోకి వస్తామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఇవన్నీ చూస్తూంటే కోయిల ముందే కూసిందన్నట్టుగా పార్టీలు వ్యవహరిస్తున్నాయంటున్నారు విశ్లేషకులు. — బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్

ఈ అంశంపై టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ డిబేట్ నిర్వహించారు. ఆ వీడియో దిగువన చూడండి

Also Read: తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం.. దక్షిణ భార‌త‌దేశంలో తొలిసారి

ఏపీలో స్కూళ్లకు, జానియర్ కాలేజీలకు సంక్రాంతి సెలవులు ఇవే.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే..?