AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big News Big Debate: బస్తీమే సవాల్‌ అంటున్న పార్టీల్లో విజేతలెవరు? చంద్రబాబుకు సవాల్‌కు YCP సమాధానమేంటి?

ఏపీలో ఎన్నికలు ఏవైనా సవాళ్లు ఓ రేంజిలో ఉంటాయి. ఇప్పుడు జరుగుతున్న లోకల్‌ బాడీస్‌లోనూ పార్టీల మధ్య డైలాగ్‌ వార్‌ మొదలైంది...

Big News Big Debate: బస్తీమే సవాల్‌ అంటున్న పార్టీల్లో విజేతలెవరు? చంద్రబాబుకు సవాల్‌కు YCP సమాధానమేంటి?
Big News Big Debate
Ravi Kiran
| Edited By: |

Updated on: Nov 06, 2021 | 1:35 PM

Share

ఏపీలో ఎన్నికలు ఏవైనా సవాళ్లు ఓ రేంజిలో ఉంటాయి. ఇప్పుడు జరుగుతున్న లోకల్‌ బాడీస్‌లోనూ పార్టీల మధ్య డైలాగ్‌ వార్‌ మొదలైంది. గెలుపోటముల సంగతి పక్కనపెడితే నామినేషన్ల దగ్గరే పార్టీల యుద్ధం పతాకస్థాయికి చేరింది. అటు సీమలో.. ఇటు పల్నాడులో నేతల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. అభ్యర్ధులను భయపెట్టి లోకల్‌గా గెలవడం కాదు.. దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేసి వస్తే తేల్చుకుందామంటూ చంద్రబాబు సవాల్‌ చేస్తే.. మతి తప్పిన మాటలంటూ వైసీపీ పంచ్‌లిచ్చింది.

APలో మిగిలిపోయిన పంచాయితీ, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి, మున్సిపాలిటీ, కార్పొరేషన్ స్థానాల్లో ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 14న రాష్ట్ర వ్యాప్తంగా 69 పంచాయితీలకు, 533 వార్డులకు పోలింగ్ ఉంటుంది. 15న నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు 12 మున్సిపాలిటీలకు, 16న 187 ఎం‌పి‌టి‌సి, 16 జెడ్‌పి‌టి‌సిలకు ఎన్నికలు జరుగనున్నాయి.

తిరుగులేని విజయాలతో దూసుకెళుతున్న YCP ఈసారి కూడా క్లీన్‌స్వీప్ చేస్తామంటోంది. గతంలో తాడిపత్రి మినహా అన్ని మున్సిపాలిటీలను సొంతం చేసుకున్న వైసీపీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో రంగంలో దిగుతున్నాయి. అయితే ఫోకస్‌ అంతా కుప్పం మున్సిపాలిటీపైనే ఉంది. పంచాయితీ, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో వన్ సైడ్ విజయాలు సాధించిన వైసీపీ.. కుప్పం మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకుని చంద్రబాబుకు చెక్ పెట్టాలనుకుంటోంది. ఇందుకోసం మంత్రి పెద్దిరెడ్డి రంగంలో దిగారు. చంద్రబాబు అడ్డాలో నేతల మధ్య డైలాగులు పేలుతున్నాయి.

అటు లోకల్‌ పోల్‌లో అక్రమాలు జరుగుతున్నాయని.. నామినేషన్లు వేయకుండా టీడీపీ అభ్యర్ధులను అడ్డుకున్నారని రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు టీడీపీ బాస్‌ చంద్రబాబు. లోకల్‌ ఎన్నికల్లో అభ్యర్ధులను బెదిరించడం కాదని.. అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వచ్చే దమ్ముందా అంటూ సవాల్‌ విసిరారు ప్రతిపక్ష నేత.

పోటీ చేసే ధైర్యం లేకే చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని కౌంటర్‌ ఎటాక్‌ ఇచ్చారు వైసీపీ మంత్రులు. నిజంగా తాము భయపెట్టి ఉంటే టీడీపీ అభ్యర్థులు నామినేషన్‌ వేసే వారా అని ప్రశ్నించారు మంత్రి అనిల్‌. ఒకసారి బహిష్కరిస్తామంటారు.. మరోసారి పోటీలో ఉంటామంటారు. ముందు తన విధానం ఏంటో చంద్రబాబు క్లారిటీ ఇవ్వాలన్నారు మంత్రి బొత్స.

మిగతా ప్రాంతాల్లోనూ వ్యూహాలు, ప్రతివ్యూహాలతో పొలిటికల్‌ జోష్‌ కనిపించినా.. సీమలోని కుప్పం, ఇటు పల్నాడులోని దాచేపల్లి, గురజాల మున్సిపాలిటీల్లో మాత్రం హైటెన్షన్‌ నెలకొంది. మరి స్వీప్‌ చేయాలన్న లక్ష్యాన్ని వైసీపీ చేరుకుంటుందా? ప్రభుత్వ వ్యతిరేకత ఉందంటున్న టీడీపీ నిరూపిస్తుందా లేదా చూడాలి.

(బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్)

ఇదే అంశంపై టీవీ9 స్టూడియోలో బిగ్‌ డిబేట్‌ జరిగింది… పూర్తి సమాచారం కోసం కింద వీడియో చూడండి.

Read Also: ఉపకారం మరువని ఉడత… వీడియో చూస్తే మైమరచిపోతారు

డ్రైవర్‌ సీటుకి వెనుకవైపు ఉన్న సందేశం చూసి ఆశ్చర్య పోయిన ప్యాసింజర్.. ఇంతకీ ఆ సందేశం ఏంటో తెలుసా..?? వీడియో

ఫోన్‌లో ఆడుతూ రూ.61 వేలకి ఆర్డర్‌ చేసిన చిన్నారి… పెట్టిన ఆర్డర్ చూసి షాక్ అయిన తల్లిదండ్రులు.. వీడియో

ప్రతి ఒక్కరు విమానంలో తినే సదా అవకాశం… ఎయిర్‌క్రాఫ్ట్‌ రెస్టారెంట్‌.. ఎక్కడ ఉన్నదో తెలుసా..??