Chandra Mangala Yoga: చంద్ర మంగళ యోగంతో భిక్షగాళ్లు కోటీశ్వరులవుతారు.. ఆ రాశుల వారికి విచిత్ర ధన యోగం పక్కా..

చంద్ర మంగళ యోగం పట్టినవారు డబ్బు ఎక్కడ ఎలా దాస్తారో ఎవరూ చెప్పలేరు. నేల మాళిగల్లో, గోడల్లో, పైపుల్లో దాచుకోవడం, యాచకుడి దుప్పటి కింద కోట్ల రూపాయలు లభ్యం కావడం వంటివి సాధారణంగా ఈ చంద్ర మంగళ యోగం వల్లే జరుగుతుంటాయి. ఈ నెల 19, 20, 21 తేదీల్లో కన్యా రాశిలో కుజ, చంద్రులు కలిసి ఉండడాన్ని పురస్కరించుకుని ఏ రాశివారికి ఈ విచిత్ర ధన యోగం పట్టబోతోందో పరిశీలిద్దాం..

Chandra Mangala Yoga: చంద్ర మంగళ యోగంతో భిక్షగాళ్లు కోటీశ్వరులవుతారు.. ఆ రాశుల వారికి విచిత్ర ధన యోగం పక్కా..
Chandra Mangal Yoga
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 15, 2023 | 9:40 PM

జ్యోతిష శాస్త్రంలో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినంత వరకూ చంద్ర మంగళ యోగానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. జాతక చక్రంలో లేదా గ్రహసంచారంలో కుజ (మంగళుడు), చంద్రులు కలిసినప్పుడు లేదా పరస్పరం వీక్షించుకున్నప్పుడు లేదా ఒకరికొకరు 1, 4, 7, 10 స్థానాలలో ఉన్నప్పుడు ఈ చంద్ర మంగళ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కలిగిన జాతకులకు ఆర్థిక వ్యవహారాలే జీవితంలో ప్రధానం అయిపోతాయి. ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించడం, ఆ డబ్బును సురక్షితంగా దాచుకోవడం, మదుపు చేయడం వీరికి అన్నిటికన్నా ముఖ్యం అవుతాయి. చంద్ర మంగళ యోగం పట్టినవారు డబ్బు ఎక్కడ ఎలా దాస్తారో ఎవరూ చెప్పలేరు. నేల మాళిగల్లో, గోడల్లో, పైపుల్లో దాచుకోవడం, యాచకుడి దుప్పటి కింద కోట్ల రూపాయలు లభ్యం కావడం వంటివి సాధారణంగా ఈ చంద్ర మంగళ యోగం వల్లే జరుగుతుంటాయి. ఈ నెల 19, 20, 21 తేదీల్లో కన్యా రాశిలో కుజ, చంద్రులు కలిసి ఉండడాన్ని పురస్కరించుకుని ఏ రాశివారికి ఈ విచిత్ర ధన యోగం పట్టబోతోందో పరిశీలిద్దాం..

  1. మేషం: ఈ రాశివారికి కుజుడు రాశ్యధిపతి కావడం వల్ల వీరికి ఈ యోగం పూర్తి స్థాయిలో పట్టే అవకాశం ఉంది. గతంలో చేసిన మదుపుల వల్ల, పెట్టిన పెట్టుబడుల వల్ల బాగా డబ్బు కలిసి వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా ఈ రాశివారు తమ ఆస్తిపాస్తుల గురించి, తమ బ్యాంక్ బ్యాలెన్స్ గురించి మూడో కంటికి తెలియనివ్వకపోవచ్చు. స్థిరాస్తుల క్రయ విక్రయాల ద్వారా అంటే రియల్ ఎస్టేట్ ద్వారా కూడా విశేషంగా డబ్బు సంపాదించే అవకాశం ఉంది.
  2. వృషభం: సాధారణంగా డబ్బు మీద ప్రీతి అధికంగా ఉండే ఈ రాశివారికి పంచమ స్థానంలో అంటే ఆలోచనా స్థానంలో ఈ చంద్ర మంగళ యోగం ఏర్పడుతుండడం వల్ల, వారి ఆలోచనలన్నీ డబ్బు సంపాదన చుట్టూనే పరిభ్రమించే అవకాశం ఉంటుంది. వడ్డీ వ్యాపారాలు, షేర్లు, మదుపులు, స్పెక్యులేషన్, రియల్ ఎస్టేట్, పైరవీలు వగైరాలలో సంపాదన ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంటుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా అది ధన సంపాదనకు సంబంధించినదే అయి ఉంటుంది.
  3. మిథునం: ఈ రాశివారికి సాధారణంగా స్థిరాస్తుల క్రయ విక్రయాల వల్ల సంపాదన పెరగడం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అదృష్టం కలిసి వస్తుంది. సొంత ఇంటి విలువ, ఆస్తుల విలువ పెరిగే అవకాశం ఉంది. డబ్బు సంపాదనకు సంబంధించిన ఆరాటం పెరుగుతుంది. పైరవీలు, అవినీతి వంటివి కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. డబ్బు సంపాదనకు సంబంధించి ఏ అవకాశాన్నీ వదిలిపెట్టే అవకాశం ఉండదు. సంపాదనను స్థలాలు, పొలాలపైనే పెట్టుబడి పెట్టడం జరుగు తుంది.
  4. కర్కాటకం: ఈ యోగం కారణంగా ఈ రాశివారిలో అకస్మాత్తుగా ధన దాహం పెరిగిపోతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుదల కోసం సరికొత్త ప్రయత్నాలు చేపట్టే అవకాశం ఉంది. తోబుట్టువులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అయి సంపద పెరిగే సూచనలున్నాయి. ఈ రాశినాథుడైన చంద్రుడితోనే కుజుడు యుతి చెందుతున్నందువల్ల తప్పకుండా ధన సంపాదన మీదకు దృష్టి మళ్లడం, అవసరమైతే అవినీతి, అక్రమ కార్యకలాపాలకు పాల్పడడానికి కూడా వెనుకాడకపోవచ్చు.
  5. ఇవి కూడా చదవండి
  6. సింహం: ఈ రాశికి ధన స్థానంలోనే ఈ యోగం చోటు చేసుకుంటున్నందువల్ల డబ్బు సంపాదించి కూడ బెట్టడానికి అవకాశం ఉంది. తప్పకుండా బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. అనేక మార్గాల్లో డబ్బు సంపాదించడం, మదుపు చేయడం లేదా పెట్టుబడులు పెట్టడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఇంట్లోనే డబ్బు దాచడానికి కూడా అవకాశం ఉంది. డబ్బు సంపాదనకు సంబంధించినంత వరకు రహస్య కార్యకలాపాలు పెరిగే సూచనలు, రహస్య ఒప్పందాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.
  7. కన్య: ఈ రాశిలోనే చంద్ర మంగళ యోగం ఏర్పడుతున్నందువల్ల ఏదో విధంగా డబ్బు సంపాదించాలనే తాపత్రయం బాగా పెరుగుతుంది. రహస్యంగా సంపాదించడం, రహస్యంగా దాచుకోవడం అన్నది ప్రధాన ధ్యేయంగా మారుతుంది. లాభం లేనిదే, ఉపయోగం లేనిదే ఏ పనీ చేయని మనస్తత్వం ఏర్పడుతుంది. సాధారణంగా సంపదను స్థిరాస్తుల రూపంలో మార్చుకునే అవకాశం ఉంటుంది. జూదాలు, స్పెక్యులేషన్, వడ్డీ వ్యాపారం వంటి మార్గాలపై దృష్టి మళ్లుతుంది.
  8. తుల: ఈ రాశికి వ్యయ స్థానంలో ఈ యోగం ఏర్పడుతున్నందువల్ల ఇదివరకు సంపాదించిన ధనాన్నే రహస్యంగా ఉంచడం, మూడో కంటికి తెలియకుండా దాచడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల కారణంగా సంపాదించిన డబ్బును దాచేసే సూచనలున్నాయి. అంటే బ్లాక్ మనీకి అవకాశం ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు సఫలం అయి, తద్వారా వచ్చిన డబ్బును రహస్యంగా మదుపు చేయడం, వడ్డీలకు తిప్పడం, దాచుకోవడం వంటివి తప్పకుండా జరిగే అవకాశముంది.
  9. వృశ్చికం: ఈ రాశికి అధిపతి అయిన కుజుడితో లాభ స్థానంలో చంద్ర మంగళ యోగం ఏర్పడుతున్నందు వల్ల ఈ రాశివారి ధన సంపాదన తప్పకుండా ఆశించిన స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. అనేక విధాలుగా, అనేక మార్గాల ద్వారా ధన సంపాదనకు వీలుంది. ముఖ్యంగా స్థిరాస్తుల క్రయ విక్ర యాల ద్వారా సంపద పెరిగే అవకాశం ఉంటుంది. ఈ రంగంలో ఉన్నవారికి విపరీతంగా డిమాండ్ పెరిగే సూచనలున్నాయి. స్నేహాల ద్వారా, కుటుంబ సభ్యుల ద్వారా డబ్బు గడించడం జరుగుతుంది.
  10. ధనుస్సు: సహజంగా యాంబిషన్ ఎక్కువగా ఉండే ఈ రాశివారు ధన సంపాదనకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభిస్తారు. వృత్తి, వ్యాపారాల పరంగా కొత్త వ్యూహాలు, కొత్త ప్రయత్నాలు చేపట్టి, సంపాదన పెంచుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలలో అవినీతికి, అక్రమాలకు పాల్పడే అవకాశం కూడా ఉంది. ఒక పద్ధతి, ప్రణాళిక ప్రకారం డబ్బును మదుపు చేయడం, విలువైన వస్తువులు కొనుక్కోవడం, బినామీ పేర్లతో డబ్బు దాచడం వంటివి జరిగే అవకాశం ఉంది.
  11. మకరం: ఈ రాశివారికి భాగ్య స్థానంలో చంద్ర మంగళ యోగం చోటు చేసుకోవడం వల్ల భూ సంబంధమైన వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు, ఆస్తి విలువ పెరుగుదల వంటి కారణాలపై ధన సంపాదన పెరిగే అవకాశం ఉంది. అక్రమ వ్యాపారాలు, బ్లాక్ మనీ వ్యవహారాలు ఉండే అవకాశం కూడా ఉంది. వడ్డీ వ్యాపారం, చిట్ ల మీద పెట్టుబడులు పెట్టడానికి కూడా వీలుంది. ఈ రాశికి చెందిన రాజకీయ నాయకులకు, రియల్ ఎస్టేట్, లిక్కర్ వ్యాపారాలు అపర కుబేరులు కావచ్చు.
  12. కుంభం: చంద్ర మంగళ యోగం వల్ల ఈ రాశి వారికి ప్రత్యేకంగా కలిసి వచ్చేదేమీ ఉండకపోవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొద్దిపాటి సంపాదన పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వృత్తి, వ్యాపారాల్లో సంపాదన పెరిగే సూచనలున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల పరంగా భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడే అవకాశాలు తక్కువ. అయితే, డబ్బు దాచుకునే అవకాశాలు, రహస్యంగా మదుపు చేసే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం కూడా తక్కువే.
  13. మీనం: ఈ రాశికి సప్తమ స్థానంలో చంద్ర మంగళ యోగం ఏర్పడుతున్నందువల్ల ఈ యోగం పూర్తి స్థాయిలో వర్తించే అవకాశం ఉంది. డబ్బు సంపాదనకు కొత్త ప్రయత్నాలు, కొత్త ఆలోచనలకు వీలుంది. వృత్తి, వ్యాపారాల్లో అవినీతికి లేదా అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది. జీవిత భాగ స్వామి ద్వారా ధన సంపాదన పెరగడానికి, దాన్ని మదుపు చేసి సంపద పెంచుకోవడానికి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. రహస్యంగా డబ్బు సంపాదించి దాచుకునే సూచనలున్నాయి.

Note: ఇక్కడ సమకూర్చిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుందని గమనించగలరు. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!