AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weekly Horoscope: వార ఫలాలు.. ఈ రాశివారికి తొందరపాటు నిర్ణయాలు పనికి రావు.. జాగ్రత్తగా ఉండాలి

Weekly Horoscope: జీవితంలో కొన్ని సందర్భాల్లో మనం ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో జీవితం ఎంతో ప్రమాదంలో పడిపోతుంది..

Weekly Horoscope: వార ఫలాలు.. ఈ రాశివారికి తొందరపాటు నిర్ణయాలు పనికి రావు.. జాగ్రత్తగా ఉండాలి
Weekly Horoscopes
Subhash Goud
|

Updated on: Oct 03, 2021 | 5:42 AM

Share

Weekly Horoscope: జీవితంలో కొన్ని సందర్భాల్లో మనం ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో జీవితం ఎంతో ప్రమాదంలో పడిపోతుంది. అందుకే ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించి ఆతీసుకోవడం మంచిది. చేపట్టే ప్రతీ కార్యంలోనూ ఆచితూచి, సమయానుకూలంగా అడుగులు వేయాలి. అందుకే తమ భవిష్యత్తు గురించి తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. తమ జీవితంలో ఏం జరుగబోతుందో ముందుగానే తెలుసుకునేందుకు రాశి ఫలాలను అనుసరిస్తారు. అయితే.. ఈ వారంలో ముఖ్యంగా కొన్ని రాశుల వారికి పరిస్థితులు అనుకూలంగా ఉంటే.. మరికొన్ని రాశుల వారికి అనుకూలంగా లేవు. అక్టోబర్‌ 3 నుంచి 9వ తేదీ వరకు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి:

ఈ రాశివారికి ఈ వారం మంచి ఫలితాలు ఉంటాయి. అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగరీత్యా మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారాలు పెరుగుతాయి. ఆర్థికంగా పుంజుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి.

వృషభ రాశి:

ముఖ్యమైన పనులలో ఈ రాశివారు విజయం సాధిస్తారు. తొందరపాటు నిర్ణయాలు ఏ మాత్రం పనికి రాదని గుర్తించుకోవాలి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండటం ఎంతో మంచిది. ఖర్చులు పెరుగుతాయి. కొన్ని విషయాలలో అచితూచీ అడుగులు వేయాలి.

మిథున రాశి:

ఈ రాశివారికి ఈ వారంలో మనో బలంతో విజయం సాధిస్తారు. ఆత్మవిశ్వాసంలో చేసే పనులు విజయవంతం అవుతాయి. ఇతరుల విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉంటాయి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. పెద్దల నుంచి సహాయం అందుకుంటారు.

కర్కాటక రాశి:

ఈ రాశివారు ఈ వారంలో మంచి జరుగుతుంది. ఆశించిన ఫలితాలు వస్తాయి. వ్యాపారాలు ముందుకు సాగుతాయి. ఏదైన పని చేపట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయాలి. సాహసంతో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో తోడ్పడతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు మంచి జరుగుతుంది.

సింహ రాశి:

ఈరాశివారు శుభ ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాలు పెరుగుతాయి. ఉద్యోగంలో శ్రద్ద పెట్టాలి. లేనిపోని అపోహాలు తొలగుతాయి. శుభవార్తలు వింటారు. దూర ప్రయణాలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు నిలకడగా ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశలు లభించే అవకాశం ఉంది.

కన్య రాశి:

ఉద్యోగంలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు ముందుకు సాగుతాయి. తోటి వారి సహకారం ఎంతో అవసరం. తీసుకున్న సొంత నిర్ణయాలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఎంతగానో ఎదురు చూస్తున్న పని ముందుకు సాగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

తుల రాశి:

ఆర్థిక ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. అందుకే ఖర్చు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించడం మంచిది. దూర ప్రయాణాల నుంచి శుభవార్తలు వింటారు. అనుకున్న పనులు చేయగలుగుతారు. వ్యాపారాలలో మంచి లాభాలు వస్తాయి.

వృశ్చిక రాశి:

ఈ రాశివారికి ఈ వారంలో మంచి ఫలితాలు ఉంటాయి. కోరుకున్న జీవితం లభిస్తుంది. తోటి వారి సహాయ సహకారాలు అందుకుంటారు. ఆటంకాలు తొలగిపోయి సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి.

ధనుస్సు రాశి:

ఉద్యోగంలో పెద్ద ప్రశంసలు పొందుతారు. నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభిస్తారు. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. కొందరు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే వారితో తక్కువగా మాట్లాడటం మంచిది.

మకర రాశి:

ఖర్చులు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైన కార్యాల్లో తెలియకుండానే ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఓర్పు ఎంతో అవసరం. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల సలహాలతో కొంత మేలు జరుగుతుంది.

కుంభ రాశి:

పట్టుదలతో ముందుకు వెళితే అనుకున్నది సాధిస్తారు. దేనికీ వెనుకడుగు వేయకూడదు. అనుకున్న ఫలితాలు వస్తాయి. ఉద్యోగంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే జాగ్రత్తగా వ్యవహరించాలి. మిత్రుల సహకారం చాలా అవసరం. ప్రతి విషయంలో చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

మీన రాశి:

ఈ రాశివారు ఆపద నుంచి బయట పడతారు. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి. అధికారుల నుంచి తగిన గుర్తింపు వస్తుంది. వ్యాపార విషయాలలో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి.

ఇవీ కూడా చదవండి:

Shivling Temple: దేశంలో అతిపెద్ద శివలింగ ఆలయం.. 26 ఏళ్లుగా జరుగుతున్న పనులు.. ఎక్కడో తెలుసా..?

Indira Ekadashi: కోరిన కోర్కెలను తీర్చే ఇందిర ఏకాదశి.. వ్రత నియమాలు.. విశిష్టత ఏమిటంటే..