Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఏ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే

Horoscope Today (October 2nd 2021): జాతకాలు, రాశిఫలాల ఆధారంగా చేసేవారు.. జాతకాలను విశ్వసించేవారు చాలామంది ఉన్నారు.  అంతేకాదు తాము పనిని మొదలుపెట్టే ముందు..

Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఏ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే
Horoscope Today
Follow us
Surya Kala

|

Updated on: Oct 02, 2021 | 7:11 AM

Horoscope Today (October 2nd 2021): జాతకాలు, రాశిఫలాల ఆధారంగా చేసేవారు.. జాతకాలను విశ్వసించేవారు చాలామంది ఉన్నారు.  అంతేకాదు తాము పనిని మొదలుపెట్టే ముందు కొంతమంది తమ దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (అక్టోబర్ 2వ తేదీ ) శనివారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో.. తెలుసుకుందాం..!

మేష రాశి: ఈ రాశివారు ఈరోజు కుటుంబ సభ్యులతో సంతోషముగా గడుపుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారులతో పర్యటనలు చేయాల్సి ఉంటుంది.

వృషభ రాశి: ఈ రాశివారికి ఈరోజు ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. దైవ దర్శనం చేసుకుంటారు.

మిధున రాశి: ఈరాశివారికి ఈరోజు ఆధాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగలు శుభవార్త వింటారు. స్త్రీలు అధిక ఖర్చులు చేస్తారు. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది.

కర్కాటక రాశి: ఈ రాశివావారు ఈరోజు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. రాజకీయ ప్రముఖములతో కలుసుకునే అవకాశం ఉంది. బంధు, మిత్రులతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూలత లోపిస్తుంది.

సింహ రాశి: ఈరాశివారు ఈరోజు టార్గెట్లను అతికష్టంమీద ఆలస్యముగానైనా పూర్తి చేస్తారు. ఈ రాశిలో స్త్రీలు ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఆరోగ్యపమైన సమస్యలు తలెత్తుతాయి. అధికంగా ధన వ్యయం చేస్తారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు  మానసికంగా ఆందోళన చెందుతారు. పుణ్యక్షేత్రాల దర్శనం మేలు చేస్తుంది. అధిక ధన వ్యయం చేస్తారు. వస్త్ర, వ్యాపారులు ఇబ్బందులను ఎదుర్కొంటారు. బంధు మిత్రులతో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది.. కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

తులా రాశి: ఈ రాశివారు ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషముగా గడుపుతారు. ఆర్ధికంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటారు. విద్యార్థులు ప్రేమ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.

వృశ్చిక రాశి: ఈ రాశివారు ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటారు. కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. సహనం అన్ని విధాలా మేలు చేస్తుంది. నూతన పనులకు ఆటంకాలు ఏర్పడతాయి. వాయిదా వేసుకోవడం మంచిది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారాభివృద్ధికి కొత్త ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు.

ధనుస్సు రాశి: ఈరోజు ఈ రాశి ప్రముఖులతో పరిచయాలను పెంచుకుంటారు. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషముగా గడుపుతారు. కొత్తవాహనాలు కొనుగోలు చేస్తారు. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. శత్రువులు మిత్రులుగా మారి సహకారం అందిస్తారు.

మకర రాశి: ఈరోజు ఈ రాశి వారు అప్పులను తీరుస్తారు. వ్యాపారవృద్ధి చేస్తారు. బంధువుల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. పట్టుదలతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ఆకస్మిక ధన లాభం పొందుతారు.

కుంభ రాశి: ఈరాశి వారు ఈరోజు పారిశ్రామిక రంగంలో ఉన్నవారికి లాభదాయకంగా సాగుతుంది. ప్ర‌యాణాలెక్కువ చేస్తారు. అనారోగ్య బారిన పడే అవకాశం ఉంది

మీన రాశి: ఈ రాశివారు ఈరోజు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. స్థిరాస్తి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక వ్యయం అవుతుంది. శారీరక శ్రమ పడతారు. , అనారోగ్యానికి గురవుతారు.

Also Read: శత్రువైనా సరే కష్టంలో ఉన్నానంటూ మనదగ్గరకు వస్తే.. సాయం చేయాలంటున్న భీష్ముడు

Gandhi Jayanti: పోరాటానికి అహింస, సత్యగ్రహమే చాలని కొత్త యిజాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన గాంధీజీ

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..