Weekly Horoscope: ఈ రాశుల వారికి కుటుంబంలో ఒత్తిళ్లు.. ఆర్థిక ఇబ్బందులు.. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు
Weekly Horoscope: ప్రస్తుతమున్న రోజుల్లో రాశిఫలాలను విశ్వసించే వారి చాలా మంది ఉంటారు. రోజు ప్రారంభించే ముందు తమతమ రాశి ఎలా ఉందో చూసుకుని పనులను..
Weekly Horoscope: ప్రస్తుతమున్న రోజుల్లో రాశిఫలాలను విశ్వసించే వారి చాలా మంది ఉంటారు. రోజు ప్రారంభించే ముందు తమతమ రాశి ఎలా ఉందో చూసుకుని పనులను ప్రారంభిస్తుంటారు. ముఖ్యంగా మనం రోజు ప్రారంభించేటపుడు మంచి చెడుల గురించి తెలుసుకుంటే.. ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుస్తుంది. అందుకోసమే జనాలు రాశిఫలాలను చూస్తుంటారు. ఈ నేపథ్యంలో జూన్ 11 నుంచి 17వ తేదీ వరకు వివిధ రాశుల వారి వార ఫలాలు ఇలా ఉన్నాయి.
మేష రాశి:
ఈ రాశివారికి ఈ వారంలో ఉద్యోగంలో శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఒత్తిడిని నుంచి ఉపశమనం పొందుతారు. సహెూద్యోగుల నుంచి సమస్యలు ఎదురవుతాయి. అనారోగ్య సమస్య నుంచి కొంత ఊరట కలిగించే అవకాశం ఉంది. లేనిపోని ఖర్చులు పెరిగిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. కొందరు మిత్రులను నమ్మి నష్టపోతారు. వ్యక్తిగతంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సమస్య సామరస్యంగా పరిష్కారం అవుతుంది. బంధువుల నుంచి సహాయ సహకరాలు అందుతాయి.
వృషభ రాశి:
ఈ రాశివారు ఈ వారంలో తలపెట్టిన పనులు మిత్రుల సహాయ సహకారాలతో పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పిల్లల పురోగతి గురించి మంచి వార్తలు వింటారు. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా అభివృద్ధికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యుల్లో మంచి పేరు సంపాదించుకుంటారు. ఏవైనా పనులు చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. వ్యాపారాలలో రాణిస్తారు.
మిథున రాశి:
అదనపు ఆదాయం కోసం ఈ రాశివారు ఈ వారంలో అధికంగా కష్టపడాల్సి ఉంటుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు మీద పడతాయి. ఇంటా బయటా ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోవడంతో అసంతృప్తిగా ఉంటుంది. కొత్త పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వీరు చేసే పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధువుల ఆరోగ్యం పట్ల కొంత ఆందోళన చెందుతారు. కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది.
కర్కాటక రాశి:
ఉద్యోగంలో అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. అధికార యోగానికి అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం కనిపిస్తోంది. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. సమాజానికి మేలు జరిగే పనులు చేపడతారు. ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. సొంత నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన పనులలో కుటుంబ సభ్యులను కూడా సంప్రదించండి.
సింహ రాశి:
నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఈ వారంలో ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు, స్వయం ఉపాధివారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగంలో కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. మీ ఆర్థిక స్తోమతకు మించి ఇతరులకు సహాయం చేస్తారు. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. అద్దె ఇంట్లో ఉన్నవారు ఇల్లు మారతారు. ప్రస్తుతానికి ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది.
కన్య రాశి:
దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఇరుగుపొరుగుతో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించడం మంచిది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. అనవసర ఖర్చులతో ఇబ్బందులకు గురవుతారు. కుటుంబ సభ్యుల నుంచి బాగా ఒత్తిడి, చికాకులు ఉంటాయి.
తుల రాశి:
కొద్దిగా ఆదాయం పెరగడంతో కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగంలో అకస్మాత్తుగా కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఎవరినీ నమ్మి ఆర్థిక బాధ్యతలు అప్పగించవద్దు. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థికంగా బంధువుల నుంచి సహకారం ఉంటుంది. ఈ రాశివారికి ఈ వారంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. లాయర్లకు, డాక్టర్లకు, చిన్న వ్యాపారులకు శ్రమ ఎక్కువవుతుంది.
వృశ్చిక రాశి:
ఆదనపు ఆదాయం కోసం ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది. విలాస జీవితానికి అలవాటు పడతారు. ఒక శుభకార్యంలో ఇష్టమైన బంధువులను కలుసుకునే అవకాశం ఉంది. కుటుంబంతో సంతోషంగా గడపడానికి ప్రాధాన్యం ఇస్తారు. ఆర్థిక పరిస్థితులు మెరుగు పడతాయి. స్నేహితుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది. వీలైనంతగా రుణ భారం తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు.
ధనస్సు రాశి:
ఉద్యోగాలలో మంచి పురోగతి లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆకస్మిక ధన లాభం ఉంది. వ్యాపారపరంగా మంచి ఆర్థిక ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. జీవితానికి పనికివచ్చే నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మిత్రులతో కొన్ని అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. చిన్న చిన్న సమస్యలకు కూడా ఆందోళన చెందడం మంచిది కాదు.
మకర రాశి:
మీరు ఆశించిన స్థాయిలో పనులు పూర్తవుతాయి. పాజిటివ్‌గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇస్తాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ఉద్యోగంలో మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. బకాయిలు వసూలు అవుతాయి. వ్యాపారంలో బాగా ఒత్తిడి ఉన్నా దాని వల్ల ప్రయోజనం పొందుతారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి ఆశించిన శుభవార్త వింటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
కుంభ రాశి:
ఆర్థిక లావాదేవీల వల్ల ఇబ్బంది పడతారు. ఖర్చులు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించి పెట్టాలి. బంధువుల నుంచి ఓ చెడు వార్త వింటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకు మంచి అవవకాశాలు లభిస్తాయి. ఈ వారంలో ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. గతంలో మీ వల్ల సహాయం పొందినవారు మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకుంటారు. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభిస్తుంది. కుటుంబ సభ్యుల్లో మంచి గౌరవం పొందుతారు.
మీన రాశి:
ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదాయపరంగా వ్యాపారులకు బాగానే ఉంటుంది. పిల్లల వల్ల సంతోషం కలుగుతుంది. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఎవరికైనా ఆర్థికంగా హామీలు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యాపారాలు చేపట్టే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు మంచి కంపెనీలో ఉద్యోగం లభిస్తుంది.