Weekly Horoscope: ఆర్థిక సమస్యల నుంచి ఆ రాశుల వారికి విముక్తి.. 12 రాశుల వారికి వారఫలాలు

వార ఫలాలు (జూన్ 30 నుంచి జూలై 6, 2024 వరకు): మేష రాశి వారికి ఈ వారం ఆదాయం పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గే అవకాశం ఉండదు. వృషభ రాశి వారికి సర్వత్రా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మిథున రాశి వారు ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Weekly Horoscope: ఆర్థిక సమస్యల నుంచి ఆ రాశుల వారికి విముక్తి.. 12 రాశుల వారికి వారఫలాలు
Weekly Horoscope 30th June 06th July 2024
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Jun 30, 2024 | 5:01 AM

వార ఫలాలు (జూన్ 30 నుంచి జూలై 6, 2024 వరకు): మేష రాశి వారికి ఈ వారం ఆదాయం పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గే అవకాశం ఉండదు. వృషభ రాశి వారికి సర్వత్రా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మిథున రాశి వారు ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

లాభ స్థానంలో శనీశ్వరుడు, ధన స్థానంలో గురువు ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితికి లోటుండదు. ఆదాయం పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గే అవకాశం ఉండదు. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఆర్థికంగా ఇతరులకు సహాయం చేయ గలిగిన స్థితిలో ఉంటారు. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. అనవసర ఖర్చుల్ని వీలైనంతగా తగ్గించుకోవడం మంచిది. వృత్తి జీవితంలో పోటీ ఎక్కువగా ఉన్నా రాబడికి లోటుండదు. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ అవసరం. మంచి పరిచయాలు ఏర్పడతాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. భరణి నక్షత్రం వారికి ఆశించిన శుభవార్తలు అందు తాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఇదే రాశిలో గురువు, లాభస్థానంలో రాహువు ఆర్థిక విషయాల్లో కొండంత అండగా ఉంటాయి. సర్వత్రా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆదాయం సమృద్ధిగా ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. విలాసాల మీద ఎక్కువగా ఖర్చుపెట్టే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లు బాగా తగ్గుముఖం పడతాయి. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభించి ఊరట చెందుతారు. వృత్తి, ఉద్యోగాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు క్రమంగా వృద్ధి చెందు తాయి. ధన స్థానంలో ఉన్న శుక్రుడి వల్ల ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు సత్ఫ లితాలనిస్తాయి. పెళ్లి సంబంధం కుదురుతుంది. కృత్తికా నక్షత్రం వారికి ధన యోగం పడుతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఇదే రాశిలో శుక్రుడు, ధన స్థానంలో రాశ్యధిపతి బుధుడు, లాభ స్థానంలో కుజుడి సంచారం వల్ల మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. ముఖ్యంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. వృత్తి, ఉద్యోగాలలో శుభ వార్తలు వింటారు. పదోన్నతికి, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుం టాయి. కుటుంబంతో కలిసి ఇష్టమైన ఆలయాల్ని సందర్శించడం జరుగుతుంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తల్లితండ్రుల నుంచి సంపద దక్కే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. అనుకోకుండా ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. పునర్వసు నక్షత్రం వారికి అనుకోని విజయాలు లభిస్తాయి. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

దశమ, లాభ స్థానాల్లో కుజ, గురుల సంచారం వల్ల ఆర్థిక స్థిరత్వం, ఉద్యోగ స్థిరత్వం లభిస్తాయి. ఈ రాశిలో బుధ గ్రహ ప్రవేశంతో సాధారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవు తుంది. వృత్తి, వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ రెండు రంగాల్లో అనేక విధాలుగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభి స్తుంది. ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులు, ఉద్యోగులకు కొత్త అవకా శాలు అందుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. పిల్లలు ఆశించిన విజయాలు సాధిస్తారు. బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేయాల్సి వస్తుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. పుష్యమి నక్షత్రం వారికి ధన యోగం పడుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

భాగ్య, దశమ, లాభ స్థానాలు బాగా బలంగా ఉన్నందువల్ల జీవితం అభివృద్ధి బాట పడుతుంది. ఆదాయం పెరగడం, ఆర్థిక సమస్యలు తగ్గడం జరుగుతుంది. దశమ స్థానంలో శుభ గ్రహాల సంచారం వల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా వృద్ధి చెందుతాయి. వృత్తి జీవితంలో కూడా బాగా డిమాండ్ పెరుగు తుంది. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకు ఆశించిన సమా చారం అందుతుంది. ఇష్టమైన పెళ్లి సంబంధం కుదరవచ్చు. కొందరు బంధుమిత్రులకు అండగా నిలబడతారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. కొద్ది పాటి అనారోగ్య సూచనలున్నాయి. పుబ్బా నక్షత్రంవారికి అనుకోని అదృష్టం పడుతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

రాశ్యధిపతి బుధుడు లాభ స్థానంలో ప్రవేశించినందువల్ల, శుక్ర, రవులు దశమ స్థానంలో ఉన్నం దువల్ల ఉద్యోగపరంగా శుభ వార్తలు వినే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో సమయం బాగా అనుకూలంగా ఉంది. వృత్తి జీవితంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఉద్యోగం రావడానికి, ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు కలిసి వస్తాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక అవసరాలు తీరిపోతాయి. వివాహ ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభి స్తుంది. వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్ర త్తగా ఉండడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉత్తరా నక్షత్రం వారికి ఆకస్మిక ధన లాభం ఉంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

సప్తమ స్థానంలో కుజుడు, భాగ్య స్థానంలో శుక్ర, రవుల కారణంగా యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. విదేశాల నుంచి ఆఫర్లు, అవకాశాలు అందుతాయి. కలలో కూడా ఊహించని శుభవార్తలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. ఆర్థిక లావాదేవీల జోలికి పోవద్దు. ప్రస్తుతానికి వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ జీవితంలో ప్రశాంత పరిస్థి తులు నెలకొంటాయి. పిల్లలకు సంబంధించి ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఆధ్యా త్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. విశాఖ నక్షత్రం వారు పదోన్నతి పొందుతారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

సప్తమ స్థానంలో గురువు, లాభ స్థానంలో కేతువు కారణంగా అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, అష్టమ స్థానంలో శుక్ర, రవుల వల్ల అనవసర ఖర్చులు, విలాసాలపై ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. కష్టార్జితంలో ఎక్కువ భాగం ఏదో విధంగా వృథా అవు తుంది. కొందరు మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఉద్యోగ జీవితంలో ప్రతిభకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి బంధువుల నుంచి ఆశించిన శుభ వార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలకు కూడా సానుకూల స్పందన లభిస్తుంది. కుటుంబ సభ్యుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఇతరుల విషయాల్లో తలదూర్చ వద్దు. అనూరాధ వారికి ఆశించిన శుభవార్త అందు తుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

తృతీయ స్థానంలో శనీశ్వరుడు, పంచమ స్థానంలో కుజుడు, సప్తమ స్థానంలో శుక్రుడు ప్రస్తుతం బాగా అనుకూలంగా ఉన్నాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధిస్తారు. హోదా పరంగా, ఆదాయపరంగా తప్పకుండా చెప్పుకోదగ్గ పురోగతి ఉంటుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. ఉద్యోగ జీవితంలో అధికారులకు మీమీద నమ్మకం బాగా పెరుగుతుంది. వృత్తి జీవితంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. రాబడి పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగు తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. పూర్వాషాఢ నక్షత్రం వారికి ధన యోగం పడుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

రాశినాథుడైన శని ధన స్థానంలో, ధన కారకుడు గురువు పంచమ స్థానంలో ఉన్నందువల్ల ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. కుటుంబంలో కూడా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. బంధువుల నుంచి, దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో హోదాతో పాటు జీతభత్యాలు కూడా బాగా పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలు అంచనాలకు మించి లాభాలు గడి స్తాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఇష్టమైన ప్రదేశాలను సందర్శిస్తారు. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ధన లాభం పట్టే అవకాశం ఉంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

తృతీయ స్థానంలో కుజుడు, చతుర్థ స్థానంలో గురువు, పంచమంలో శుక్రుడు సంచారం చేస్తున్నకారణంగా సానుకూలతలు ఎక్కువగా ఉంటాయి. ఆశించిన శుభవార్తలు వింటారు. అయితే, రాశ్యధిపతి శని వక్రించడం వల్ల ఆదాయం పెరగడానికి ఆటంకాలు కలుగుతాయి. రావ లసిన డబ్బు ఒక పట్టాన చేతికి అందదు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు అతిగా ఆధారపడడం వల్ల పని భారం పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. వృత్తి జీవితంలో ఉన్న వారికి యాక్టివిటీ పెరగడంతో పాటు రాబడి వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు కొద్దిగా ఆశాభంగం తప్పకపోవచ్చు. ఆరోగ్యానికి ఏ విధంగానూ లోటు ఉండదు. పూర్వాభాద్ర నక్షత్రం వారికి ఆకస్మిక ధన లాభం ఉంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ధన స్థానంలో ఉన్న ధనాధిపతి కుజుడి వల్ల ఆదాయానికి లోటుండదు. చతుర్థ స్థానంలో ఉన్న శుక్రుడి వల్ల విలాసాల మీద, కుటుంబం మీద ఖర్చు పెరుగుతుంది. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. అనుకోకుండా చిన్నపాటి ధన యోగం పట్టే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం, పని ఒత్తిడి ఎక్కువగానే ఉన్నప్పటికీ ఆదరాభిమానాలకు లోటుండదు. వ్యాపారంలో లాభాలు నిలకడగా సాగుతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుం టాయి. ఆర్థిక ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలతలు కనిపిస్తాయి. పిల్లలు విజయాలు సాధిస్తారు. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి మంచి అదృష్టం పడుతుంది.