Shukra Gochar: ఆ రాశులకు శుక్ర భాగ్యం.. అత్యంత శుభ యోగాలు పట్టబోతున్నాయ్..!
Venus Transit: జూన్ 26న శుక్రుడు తన స్వక్షేత్రమైన వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ సంచారం మేషం, వృషభం, కర్కాటకం, కన్య, మకరం, కుంభ రాశులకు అనుకూలంగా ఉంటుంది. ధనలాభం, ఉద్యోగంలో పురోగతి, దాంపత్య సుఖం, ఆరోగ్యం మెరుగుదల వంటి అంశాలను ఈ రాశులవారు ఆశించవచ్చు. శుక్ర గ్రహం రాశి మార్పుతో ఈ రాశుల వారికి ఎలాంటి అనుకూల ఫలితాలు ఉండబోతున్నాయో ఇక్కడ ఇవ్వడం జరిగింది.

Shukra Gochar, Venus Transit
ముఖ్యమైన గ్రహాలు రాశులు మారినప్పుడల్లా జ్యోతిష్య ఫలితాలు మారుతుంటాయి. శుభ గ్రహాలు రాశులు మారడం వల్ల కొన్ని రాశులకు తప్పకుండా అనుకూల ఫలితాలుంటాయి. ఈ నెల 26వ తేదీన శుక్ర గ్రహం తన స్వక్షేత్రమైన వృషభ రాశిలోకి మారి, అక్కడే జూలై 26 వరకూ కొనసాగుతుంది. భోగభాగ్యాలకు, విలాస జీవితానికి, ప్రేమ వ్యవహారాలకు, పెళ్లిళ్లకు, దాంపత్య జీవితానికి కారకుడైన శుక్రుడి తన స్వక్షేత్రంలోకి మారితే శుభ యోగాలు కలుగుతాయి. ముఖ్యంగా జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ప్రస్తుతం శుక్రుడు వృషభంలోకి మారడం వల్ల మేషం, వృషభం, కర్కాటకం, కన్య, మకర, కుంభ రాశులకు అత్యంత శుభ ఫలితాలనివ్వడం జరుగుతుంది.
- మేషం: ఈ రాశికి ధన స్థానంలోకి శుక్రుడు ప్రవేశించడం వల్ల ఈ రాశివారికి తప్పకుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఏ రంగానికి చెందిన వారైనప్పటికీ ఈ రాశివావిరి ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆస్తి సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది.
- వృషభం: రాశ్యధిపతి శుక్రుడు తన స్వక్షేత్రంలో ప్రవేశించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లోనే కాక, సామాజికంగా కూడా ఉన్నత స్థితి లభిస్తుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఆత్మవిశ్వాసం ఇను మడిస్తుంది. జనాకర్షణ పెరుగుతుంది. అనేక విధాలుగా సంపద కలిసి వస్తుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభిస్తుంది. సమాజంలో ఒక ప్రముఖుడుగా గుర్తింపు లభిస్తుంది. వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గుతాయి.
- కర్కాటకం: ఈ రాశికి లాభ స్థానంలో శుక్రుడు ప్రవేశించడం వల్ల ఊహించని విధంగా సిరిసంపదలు పెరుగుతాయి. విలాస జీవితం అలవడుతుంది. జీవనశైలి పూర్తిగా మారిపోతుంది. సంపన్న వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి ఖాయం కావడం గానీ జరుగుతుంది. ఆస్తులు కొనడం, ఆస్తులు పెరగడం, గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడడం వంటివి జరుగుతాయి. దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతుంది. శుభ కార్యాలు జరగడానికి అవకాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.
- కన్య: ఈ రాశివారికి భాగ్య స్థానంలో శుక్ర సంచారం వల్ల మనసులోని ముఖ్యమైన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో ఊహించని విజయం సాధిస్తారు. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. విలాస జీవితం గడుపుతారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. కొన్ని కీలకమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి.
- మకరం: ఈ రాశికి పంచమ కోణంలో శుక్రుడు ప్రవేశించడం వల్ల ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. నెల రోజుల పాటు వీరి ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు లాభాల పంట పండిస్తాయి. సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత స్థాయికి వెళ్లే అవకాశం ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. సంతాన యోగం కలుగుతుంది.
- కుంభం: ఈ రాశికి చతుర్థ స్థానంలో శుక్రుడు ప్రవేశించడం వల్ల ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి కలిసి వస్తుంది. కొద్ది ప్రయత్నంతో సొంత ఇల్లు అమరుతుంది. వాహన యోగం పట్టే అవకాశం కూడా ఉంది. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. మాతృ సౌఖ్యం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక సామాజికంగా కూడా హోదా పెరుగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి.



