- Telugu News Photo Gallery Do you know what the horoscope of those born on the 2nd will be like after marriage?
2వ తేదీన జన్మించిన వారికి పెళ్లి తర్వాత జాతకం ఎలా ఉంటుందో తెలుసా?
సంఖ్యాశాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి పుట్టిన తేదీ సంఖ్యను బట్టి ఆ వ్యక్తి స్వభావం చెప్పవచ్చు. అంతే కాకుండా ఆ వ్యక్తి పుట్టిన తేదీ ప్రకారం తన కెరీర్ ఎలా ఉంటుంది. విద్య, ఉద్యోగం గురించే కాకుండా, ఆ వ్యక్తి వైవాహిక జీవితం గురించి కూడా తెలుసుకోవచ్చు అని చెప్తుంటారు సంఖ్యాశాస్త్ర నిపుణులు. కాగా, ఇప్పుడు మనం సంఖ్యాశాస్త్రం ప్రకారం, 2వ తేదీన జన్మించిన వ్యక్తి వైవాహిక జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
Updated on: Jun 12, 2025 | 2:06 PM

సంఖ్యాశాస్త్రం ప్రకారం రెండో తేదదీన జన్మించిన వారి వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుందంట. వీరు సకల సుకాలు అనుభవిస్తారని చెబుతున్నారు నిపుణులు. అంతే కాకుండా రెండో తేదీన జన్మించిన వారు ప్రేమ వివాహం చేసుకుంటే వారి బంధం మరింత బలంగా ఉంటుందంట. ఎన్ని గొడవలు, సమస్యలు వచ్చినా వీరి మధ్య ప్రేమ ఎక్కువగా ఉంటుందంట. ఎంత మంది వచ్చినా వీరి బంధాన్ని విడదీయలేరంట.

ముఖ్యంగా రెండో తేదీన జన్మించి స్త్రీలను పెళ్లి చేసుకోవడం చాలా అదృష్టం అంటున్నారు సంఖ్యాశాస్త్ర నిపుణులు. ఎందుకంటే ఈ తేదీలో జన్మించిన స్త్రీలు చాలా ఆత్మవిశ్వాసంతో పని చేస్తారంట. అంతే కాకుండా,భాగస్వామి సహాయంతో ఉన్నత శిఖరాలు చేరుకుంటారంట. ఏ పని తలపెట్టినా దాన్ని పూర్తిచేసేవరకు ఊరుకోరంట. అనుకున్నది అనుకున్నట్లుగా పూర్తి చేస్తారంట. ధైర్యంగా ముందుకు వెళ్తారంట.

అంతే కాకుండా ఈ తేదీలో పుట్టిన స్త్రీలు తన భాగస్వామిని కూడా చాలా బాగా చూసుకుంటారంట. కష్టసమయంలో తోడుగా ఉండి, తనకు చేదోడు వాదోడుగా నిలుస్తారంట. అలాగే వీరు చాలా ఆనందంగా గడపడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారని చెబుతున్నారు సంఖ్యశాస్త్ర నిపుణులు.

అయితే రెండో తేదీన జన్మించిన వ్యక్తులు 25 ఏళ్ల లోపు వివాహం చేసుకుంటే వీరి బంధం మరింత బాగుంటుందంట. అంతే కాకుండా వీరు పెళ్లి తర్వాత చాలా వరకు ఆర్థిక సమస్యలతో సతమతం అయినప్పటికీ తమ కష్టంతో సమస్యలను పరిష్కరించుకొని పైకి ఎదుగుతారంట. అయితే రెండో తేదీన జన్మించిన వ్యక్తులు 3,5,8 తేదీల్లో జన్మించిన వారి వివాహం చేసుకుంటే మరింత కలిసి వస్తుందని చెబుతున్నారు సంఖ్యాశాస్త్ర నిపుణులు.