Marriage Horoscope: కీలక గ్రహాల సానుకూలత.. ఈ రాశుల వారికి పెళ్లి, ప్రేమ ప్రయత్నాలకు అనుకూలం..!
శుభ కార్యాలకు కారకుడైన గురు గ్రహం దాంపత్య జీవితానికి కారకుడైన శుక్రుడికి చెందిన వృషభ రాశిలో ప్రవేశించడం వల్ల పెళ్లి ప్రయత్నాలు, ప్రేమ వ్యవహారాల్లో ఘన విజయాలు సాధించే అవకాశం ఉంది. ఈ నెల 19 నుంచి శుక్రుడు కూడా తన స్వస్థానమైన వృషభ రాశిలో ప్రవేశించి, శుక్రుడితో యుతి చెందుతున్నందు వల్ల పెళ్లి ప్రయత్నాలు సునాయాసంగా నెరవేరే అవకాశం ఉంది.
శుభ కార్యాలకు కారకుడైన గురు గ్రహం దాంపత్య జీవితానికి కారకుడైన శుక్రుడికి చెందిన వృషభ రాశిలో ప్రవేశించడం వల్ల పెళ్లి ప్రయత్నాలు, ప్రేమ వ్యవహారాల్లో ఘన విజయాలు సాధించే అవకాశం ఉంది. ఈ నెల 19 నుంచి శుక్రుడు కూడా తన స్వస్థానమైన వృషభ రాశిలో ప్రవేశించి, శుక్రుడితో యుతి చెందుతున్నందు వల్ల పెళ్లి ప్రయత్నాలు సునాయాసంగా నెరవేరే అవకాశం ఉంది. ఈ రెండు గ్రహాల కలయిక మేషం, వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారికి బాగా అనుకూలంగా ఉండబోతున్నందువల్ల ఈ రాశివారు ప్రేమ వ్యవహారాల్లో ప్రవేశించడం, పెళ్లి ప్రయత్నాలు ఫలించడం తప్పకుండా జరిగే అవకాశముంది.
- మేషం: ఈ రాశివారికి కుటుంబ స్థానంలో గురువు ప్రవేశించడం తప్పకుండా పెళ్లి ప్రయత్నాలను సఫలం చేయడం జరుగుతుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశముంది. ప్రేమ వ్యవహారాల్లో కూడా తప్పకుండా ఘన విజయం సాధించడం జరుగుతుంది. ఈ రాశివారికి బంధు వర్గంలోనే మంచి పెళ్లి సంబంధం కుదిరి, జూలై నాటికి పెళ్లయ్యే సూచనలున్నాయి. ఇప్పటికే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి కూడా సంప్రదాయబద్ధంగా పెళ్లి జరిగే అవకాశముంది.
- వృషభం: ఈ రాశిలో గురు, శుక్రులు కలుస్తున్నందువల్ల పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవు తాయి. పెళ్లి ప్రయత్నాలకు అనేక దిశల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది. విదేశీ సంబం ధాలు కుదరడానికి కూడా అవకాశముంది. ఈ రాశివారు ప్రేమలో పడడం గానీ, ప్రేమ వ్యవహా రాలు పెళ్లికి దారి తీయడం గానీ జరగవచ్చు. సాధారణంగా ఈ రాశివారికి అక్టోబర్ లోపల పెళ్లయ్యే సూచనలున్నాయి. బాగా పరిచయస్థులతో అనుకోకుండా పెళ్లి కుదిరే అవకాశం ఉంది.
- కర్కాటకం: ఈ రాశికి లాభ స్థానంలో గురువు ప్రవేశించడమే ఒక విశేషం కాగా, దాంతో శుక్రుడు కలుస్తుం డడం మరొక విశేషం. సాధారణంగా ఈ రాశివారికి ప్రేమ వ్యవహారమే పెళ్లికి దారి తీసే అవకాశం ఉంది. సన్నిహితులతోనో, పరిచయస్థులతోనో పెళ్లి సంబంధం కుదరడం కూడా జరగవచ్చు. బాగా పలుకుబడిన కుటుంబం లేదా సంపన్న కుటుంబంతో అక్టోబర్ లోపల పెళ్లి కావడం జరు గుతుంది. ఇటువంటి కుటుంబాలకు చెందిన వ్యక్తితోనే ప్రేమలో పడే సూచనలు కూడా ఉన్నాయి.
- కన్య: ఈ రాశికి భాగ్య స్థానంలో గురు, శుక్రులు కలుస్తున్నందువల్ల ఈ రాశివారికి ఇష్టమైన వ్యక్తితో అక్టో బర్-డిసెంబర్ నెలల మధ్య వైభవంగా వివాహం జరిగే అవకాశముంది. సంపన్న వ్యక్తితో ప్రేమలో పడడం గానీ, సంపన్న వ్యక్తితో పెళ్లి సంబంధం కుదరడం గానీ జరుగుతుంది. విదేశీ సంబంధం కుదరడానికి కూడా అవకాశముంది. సాధారణంగా బాగా తెలిసిన సంబంధం కుదిరే అవకాశం ఉంది. సంప్రదాయబద్ధంగా వివాహం జరుగుతుంది. ప్రేమ వ్యవహారం పెళ్లికి దారి తీస్తుంది.
- వృశ్చికం: ఈ రాశికి సప్తమ స్థానంలో రెండు శుభ గ్రహాలు కలుస్తున్నందువల్ల రాశివారికి కొద్ది ప్రయ త్నంతో తప్పకుండా మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రేమ వివాహం అవడానికి కూడా అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన స్థాయిలో విజయం సాధి స్తారు. గురు, శుక్రులిద్దరూ శుభ గ్రహాలే అయినందువల్ల సాధారణంగా సంప్రదాయబద్ధంగానే వివాహం జరిగే అవకాశముంది. జూలై ప్రాంతంలో అతి వైభవంగా వివాహం జరిగే సూచనలున్నాయి.
- మకరం: ఈ రాశికి పంచమ స్థానంలో గురు, శుక్రుల సంచారం జరగబోతున్నందువల్ల నవంబర్ నెల లోపు తప్పకుండా వివాహం జరిగే అవకాశముంది. పెళ్లి ప్రయత్నాలు సునాయాసంగా సఫలం అవు తాయి. ఇదివరకు వెనక్కు వెళ్లిన విదేశీ సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంది. సాధారణంగా బయటి వ్యక్తులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాల్లో కూడా విజయాలు సాధిం చడం, అవి సానుకూలంగా సాగిపోవడం జరుగుతుంది. సంప్రదాయబద్ధమైన వివాహం జరగ వచ్చు.