Money Astrology: మేష రాశిలో బుధ, శుక్రుల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షమే..! అందులో మీ రాశి కూడా ఉందా..

ఈ నెల 12వ తేదీ నుంచి దాదాపు మూడు వారాల పాటు మేష రాశిలో బుధ, శుక్ర, రవులు కలిసే ఉంటాయి. ఈ మూడు గ్రహాల కాంబినేషన్ వల్ల, ముఖ్యంగా బుధ, శుక్రుల యుతి వల్ల ధన యోగాలకు, భాగ్య యోగాలకు ఎక్కువగా అవకాశముంటుంది. ఆ రాశుల వారి మీద దాదాపు కనక వర్షం కురిసే అవకాశముంది. ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది.

Money Astrology: మేష రాశిలో బుధ, శుక్రుల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షమే..! అందులో మీ రాశి కూడా ఉందా..
Money Horoscope
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: May 11, 2024 | 4:51 PM

ఈ నెల 12వ తేదీ నుంచి దాదాపు మూడు వారాల పాటు మేష రాశిలో బుధ, శుక్ర, రవులు కలిసే ఉంటాయి. ఈ మూడు గ్రహాల కాంబినేషన్ వల్ల, ముఖ్యంగా బుధ, శుక్రుల యుతి వల్ల ధన యోగాలకు, భాగ్య యోగాలకు ఎక్కువగా అవకాశముంటుంది. మేషం, మిథునం, కర్కాటకం, సింహం, తుల, మకర రాశుల వారి మీద దాదాపు కనక వర్షం కురిసే అవకాశముంది. ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశ ముంది. అనేక కోణాల నుంచి, అనేక మార్గాల నుంచి ఆదాయం పెరుగుతుంది.

  1. మేషం: ఇదే రాశిలో బుధ, శుక్ర, రవులు కలుస్తున్నందువల్ల జీవితం చాలావరకు ఆశాజనకంగా సాగిపోతుంది. కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు, ఆర్థిక సమస్యలకు సత్వరం పరిష్కారం లభిస్తుంది. ముఖ్యంగా ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. ఆర్థిక పరిస్థితులు బాగా మెరు గుపడతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. అనేక విధాలుగా కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అనేక లాభాలు పొందుతారు.
  2. మిథునం: ఈ రాశివారికి రాశ్యధిపతి బుధుడు తన నీచ స్థానం నుంచి బయటపడి మేషరాశిలో ప్రవేశించ డంతో పాటు అక్కడ రవి, శుక్రుల్ని కలవడం వల్ల అనేక విధాలుగా ఆర్థిక ప్రయోజనాలు చేకూరు తాయి. ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశముంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలను విస్తరించే అవకాశం కూడా ఉంది. లాభదాయక పరిచయాలు కలుగుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. సుఖ సంతోషాల్లో మునిగి తేలుతారు.
  3. కర్కాటకం: ఈ రాశివారికి దశమ స్థానంలో శుక్ర, బుధ, రవుల కాంబినేషన్ ఏర్పడుతున్నందువల్ల, అనేక విధాలుగా ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులతో పాటు జీతభత్యాలు పెరగ డానికి బాగా అవకాశముంది. వ్యాపారులకు పెట్టుబడులకు మించి లాభాలు అందడం జరుగు తుంది. ప్రేమ జీవితంలోనూ, వైవాహిక జీవితంలోనూ ఎటువంటి సమస్యలున్నా సానుకూలంగా పరిష్కారమవుతాయి. జీవితంలో అనేక సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి.
  4. సింహం: ఈ రాశికి భాగ్య స్థానంలో బుధ, శుక్ర గ్రహాలు కలవడం, వాటితో రాశ్యధిపతి రవి కూడా యుతి చెందడం వల్ల ఊహించని అదృష్టాలు కలుగుతాయి. అనేక విధాలుగా సంపద పెరుగుతుంది. ఆస్తి కలిసి వస్తుంది లేదా ఆస్తి విలువ పెరుగుతుంది. జీవితంలో హోదా, స్థాయి పెరుగుతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ కు లోటుండదు. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. సామాజికంగా కూడా ప్రాధాన్యం పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి.
  5. తుల: ఈ రాశికి సప్తమంలో ఈ రెండు శుభ గ్రహాలతో రవి కూడా కలిసి ఉండడం వల్ల ప్రభుత్వమూలక ధన లాభం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారి కోరిక నెరవేరుతుంది. వ్యక్తి గత సమస్యల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆస్తి విలువ వృద్ధి చెందుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. ప్రేమ, వైవాహిక జీవితాల్లో భాగ్య, ధన యోగాలు పడతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో దూసుకుపోతారు.
  6. మకరం: ఈ రాశివారికి చతుర్థ స్థానంలో ఈ గ్రహాల యుతి జరుగుతున్నందువల్ల గృహ, వాహన సౌక ర్యాలు ఏర్పడడానికి బాగా అవకాశముంది. తప్పకుండా వాహన యోగం పడుతుంది. భారీగా వస్త్రాభరణాలు కొనడం జరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభా పాటవాలు మరింతగా వెలుగులోకి వస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. పిల్లలు ఆశించిన పురోగతి సాధిస్తారు. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు.

కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..