AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: వారికి వ్యక్తిగత సమస్యపరిష్కారం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

మార్చి 13, 2025 నాటి 12 రాశుల దినఫలాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. మేషం నుండి మీనం వరకు ప్రతి రాశికి ఉద్యోగం, ఆర్థికం, కుటుంబం, ఆరోగ్యంపై ముఖ్యమైన అంశాలు వివరించబడ్డాయి. కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఉండగా, మరికొన్నింటికి కొద్దిగా జాగ్రత్త అవసరం. ప్రతి రాశి వారికీ దినఫలాలు ఎలా ఉన్నాయో ఇక్కడ చదవండి..

Horoscope Today: వారికి వ్యక్తిగత సమస్యపరిష్కారం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Horoscope Today 13th March 2025
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 13, 2025 | 5:01 AM

Share

దిన ఫలాలు (మార్చి 13, 2025): మేష రాశి వారికి ఉద్యోగ జీవితం చాలావరకు హ్యాపీగా సాగిపోతుంది. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. వృషభ రాశ వారికి ముఖ్యమైన వ్యవహారాలు, పనులన్నీ సరైన సమయానికి పూర్తవుతాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. మిథున రాశికి చెందిన వారికి వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి అన్ని విధాలా మెరుగ్గా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగ జీవితం చాలావరకు హ్యాపీగా సాగిపోతుంది. కొన్ని ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తించాల్సిన అవసరం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనల వల్ల లాభాలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. కొందరు బంధువుల ద్వారా ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంది. వ్యక్తిగత సమస్య పరిష్కారమవుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో సహచరులతో కొన్ని బాధ్యతలు పంచుకోవలసి రావడం వల్ల పనిభారం కొద్దిగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా పురోగతి సాధిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులన్నీ సరైన సమయానికి పూర్తవుతాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. ఇతరుల తగాదాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు మీ మాటకు, చేతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు కలుగుతాయి. అదనపు ఆదాయానికి అవకాశం ఉంటుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి అన్ని విధాలా మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ప్రయాణాల వల్ల ఆశించిన లాభాలు కలుగుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, వ్యాపారాల్లో లాభాలు, రాబడి బాగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల నమ్మ కాన్ని చూరగొంటారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో కొంత వరకూ సఫలం అవుతారు. ముఖ్యమైన వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. ఆరోగ్యానికి లోటుండదు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. కొందరు సన్నిహితుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వ్యక్తి గత సమస్యల నుంచి బయటపడడం మీద శ్రద్ధ పెడతారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నమ్మ కాన్ని చూరగొంటారు. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది. బంధువుల వివాదాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. కొద్దిగా అనారోగ్యం ఇబ్బంది పెట్టే సూచనలున్నాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. సాధ్యం కాని లక్ష్యాలు ఇబ్బంది పెడతాయి. కొద్దిగా ఓర్పుగా వ్యవహరించడం మంచిది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. ఆదా యం బాగా వృద్ధి చెందుతుంది కానీ, కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. హోదా పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. ఆదాయం బాగా పెరిగే అవకాశముంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువుల వల్ల కొద్దిగా ఇబ్బందులుంటాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగ జీవితంలో బాగా ఒత్తిడి ఉంటుంది. అధికారులు ఒక పట్టాన సంతృప్తి చెందరు. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. సన్నిహిత మిత్రుల నుంచి ఆశించిన సహాయ సహ కారాలు అందుతాయి. సొంత పనులన్నీ సవ్యంగా పూర్తవుతాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. ఆరోగ్యం మీద మరింతగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రయాణాలు లాభిస్తాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో అధికార యోగం కలిగే అవకాశం ఉంది. అధికారులు బాధ్యతల్లో మార్పులు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా సంతృప్తికరంగా పురోగమిస్తాయి. కొద్ది ప్రయత్నంతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆదాయంలో అంచనాలకు మించిన వృద్ధి ఉంటుంది. నిరుద్యోగులకు అనుకోకుండా ఉద్యోగం లభిస్తుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి జీవితం నిలకడగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. నిరుద్యోగులకు ఒకటి రెండు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. కొందరు సన్నిహితుల సహాయంతో కీలకమైన వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించుకుంటారు. మంచి పరిచయాలు కలుగుతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో పని భారం కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. వృత్తి జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. బంధువులతో ఒక శుభ కార్యంలో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడ తాయి. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఖర్చులను తగ్గించుకుంటారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా, సామరస్యంగా సాగిపోతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగ బాధ్యతల్లో ఆశించిన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభ సాటిగా సాగిపోతాయి. వృత్తి జీవితంలో ఏమాత్రం తీరిక ఉండకపోవచ్చు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగి పోతాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
Iron Ring: శని అనుగ్రహం.. ఇనుప ఉంగరం ధరిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
Iron Ring: శని అనుగ్రహం.. ఇనుప ఉంగరం ధరిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
ఈ మోడల్‌ హోండా బైక్‌ల రీకాల్‌.. వైరింగ్‌లో లోపం..
ఈ మోడల్‌ హోండా బైక్‌ల రీకాల్‌.. వైరింగ్‌లో లోపం..
పేర్లు నచ్చలేదని ఇంత దారుణమా..?
పేర్లు నచ్చలేదని ఇంత దారుణమా..?
మీకో సవాల్.. ఈ చిత్రంలోని దాగి ఉన్న 3ముఖాలను గుర్తిస్తే మీరే తోపు
మీకో సవాల్.. ఈ చిత్రంలోని దాగి ఉన్న 3ముఖాలను గుర్తిస్తే మీరే తోపు
పెళ్లిలో ఇచ్చిన మాట ప్రకారం..95ఏళ్ల భర్తకు అంత్యక్రియలు.. అంతలోనే
పెళ్లిలో ఇచ్చిన మాట ప్రకారం..95ఏళ్ల భర్తకు అంత్యక్రియలు.. అంతలోనే
నెలకు రూ.లక్ష జీతంతో.. సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
నెలకు రూ.లక్ష జీతంతో.. సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
సెల్‌ఫోన్ వాడటంలో ఈ తప్పు చేస్తున్నారా? డేంజర్ జోన్‌లో మీ హెల్త్!
సెల్‌ఫోన్ వాడటంలో ఈ తప్పు చేస్తున్నారా? డేంజర్ జోన్‌లో మీ హెల్త్!
దేశంలో పెద్ద మార్పులు తెచ్చిన సాధారణ బడ్జెట్‌లు ఇవే..!
దేశంలో పెద్ద మార్పులు తెచ్చిన సాధారణ బడ్జెట్‌లు ఇవే..!
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి