Lucky Zodiac Signs: ఆరు గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి అదృష్టం, ఆకస్మిక ధన లాభం..!
మీన రాశిలో ఆరు గ్రహాల కూటమి (షష్ట గ్రహ కూటమి) ఏర్పడుతుంది. ఈ కూటమి వృషభం, మిథునం, కర్కాటకం, తుల, మకర, కుంభ రాశుల వారికి ఇది అత్యంత శుభప్రదం. ఆర్థిక లాభాలు, ఉద్యోగ అవకాశాలు, ఆరోగ్య పురోగతి వంటి అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయడం మరింత శుభప్రదమని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

Lucky Zodiac Signs
ఈ నెల 29, 30 తేదీల్లో మీన రాశిలో ఆరు గ్రహాలు కలవడం వల్ల ‘షష్ట గ్రహ కూటమి’ ఏర్పడు తోంది. ఈ కూటమి వల్ల కొన్ని రాశుల వారి మీద ఆ తర్వాత ఏడాది చివరి వరకూ సానుకూల ప్రభావం కనిపిస్తుంది. ఒకే రాశిలో అత్యధిక సంఖ్యలో గ్రహాలు చేరడం వల్ల ఆ రాశికి అత్యధిక ప్రాధాన్యం ఏర్పడుతుంది. అయితే, ఆ రెండు రోజుల్లో నవ గ్రహాలకు ప్రదక్షిణలు చేయడం వల్ల మరింతగా సానుకూల ఫలితాలు అనుభవానికి వచ్చే అవకాశం ఉంది. వృషభం, మిథునం, కర్కాటకం, తుల, మకర, కుంభ రాశుల వారికి ఈ శని, రవి, శుక్ర, బుధ, రాహువు, చంద్రుల కూటమి వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
- వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో ఈ ఆరు గ్రహాలు కలవడం వల్ల అనేక విధాలుగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. అనారోగ్యానికి తగ్గ చికిత్స లభిస్తుంది. రావలసిన సొమ్ముతో పాటు బాకీలు, బకాయిలు కూడా వసూలవుతాయి. ఉద్యోగానికి సంబంధించి అనేక అవకాశాలు అందుతాయి. ప్రముఖులతో పరిచయాలు బాగా విస్తరిస్తాయి. ఉద్యోగులకు ఉన్నత పదవులు లభిస్తాయి. ఆస్తి సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి.
- మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో ఆరు గ్రహాల యుతి జరుగుతున్నందువల్ల మీరు పని చేస్తున్న సంస్థకు కొత్త ప్రాజెక్టులు అందే అవకాశం ఉంది. మీకు బాధ్యతలు, లక్ష్యాలు బాగా పెరుగుతాయి. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభిస్తుంది. మరింత పెద్ద సంస్థలోకి ఉద్యోగం మారడానికి అవకాశం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో విపరీతంగా యాక్టివిటీ పెరుగుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ప్రముఖులతో కలిసి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
- కర్కాటకం: ఈ రాశికి భాగ్య స్థానంలో ఆరు గ్రహాలు కలవడం విశేషమే. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందడంతో పాటు, ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. విదేశీ సంపాదన అనుభవించే యోగం కూడా పడుతుంది. విదేశీయానానికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. నిరుద్యోగులకు విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ముఖ్యమైన శుభవార్తలు వింటారు.
- తుల: ఈ రాశికి ఆరవ స్థానంలో ఆరు గ్రహాలు చేరడం వల్ల విపరీత రాజయోగం కలుగుతుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు, ఆహ్వానాలు అందుతాయి. అపార ధన లాభం కలుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీల వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆర్థిక సమస్యలు దాదాపు పూర్తిగా సమసిపోతాయి. ఉద్యోగంలో అందలాలు ఎక్కుతారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి.
- మకరం: ఈ రాశికి తృతీయ స్థానంలో ఆరు గ్రహాలు యుతి చెందడం వల్ల ఆదాయపరంగా, ఉద్యోగపరంగా శీఘ్ర పురోగతి ఉంటుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. రావలసిన సొమ్మును, బాకీలను పట్టుదలగా రాబట్టుకుంటారు. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల బాగా లాభాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా ఇతర దేశాలకు వెళ్లే అవకాశం ఉంది. అనారోగ్యాలకు సరైన చికిత్స లభిస్తుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు.
- కుంభం: ఈ రాశికి ధన స్థానంలో గ్రహాలు ఎక్కువగా కలుస్తున్నందువల్ల అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఆస్తిపాస్తులు కొనే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు పెంపొందుతాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అందే అవకాశం ఉంది.