Horoscope Today: ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో వారికి శుభవార్తలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Today Horoscope: మార్చి 11, 2025 నాటి తెలుగు రాశిఫలాల్లో మేషం నుండి మీనం వరకు అన్ని రాశుల వారికి ఉద్యోగం, ఆర్థికం, ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధాలపై దినఫలాలు ఇవ్వబడ్డాయి. మేష రాశి వారికి ఉద్యోగంలో అనుకూల వాతావరణం, వృషభ రాశి నిరుద్యోగులకు మంచి అవకాశాలు, మిథున రాశి వారికి అధికార యోగం కలిగే అవకాశముంది. మిగిలిన రాశులకు వారి వారి జీవితంలో విభిన్న అంశాలపై సూచనలు ఉన్నాయి.

దిన ఫలాలు (మార్చి 11, 2025): మేష రాశి వారికి ఉద్యోగంలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృషభ రాశికి చెందిన నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. కుటుంబ పరిస్థితులు హ్యాపీగా సాగిపోతాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది.ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అనుకోకుండా ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. పిల్లలు కొద్ది శ్రమతో విజయాలు సాధిస్తారు. గృహ, వాహన ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. ఉద్యోగంలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కోరుకున్న వ్యక్తితో అనుకోకుండా పెళ్లి నిశ్చయం అవుతుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ప్రతి విషయంలోనూ కొద్దిగా వ్యయ ప్రయాసలు, శ్రమ తప్పకపోవచ్చు. షేర్లు, స్పెక్యులేషన్ల మీద పెట్టుబడులకు సమ యం అనుకూలంగా ఉంది. ఆర్థిక లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. కుటుంబ పరిస్థితులు హ్యాపీగా సాగిపోతాయి. అనారోగ్య సూచనలున్నాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వృత్తి జీవితంలో బాగా డిమాండ్ పెరిగి, తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాలు కొద్దిగా అభివృద్ధి బాటపడతాయి. ఇంటా బయటా ఆదరణ, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. వ్యాపారాలు కొద్దిపాటి లాభాలతో పురోగమిస్తాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉండవచ్చు. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. కుటుంబ జీవితం సాఫీగా, సానుకూలంగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమై ఊరట లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలలో సానుకూల స్పందన ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా, ఆశాజనకంగా ఉంటుంది. ఆదాయానికి లోటుండదు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో జీతభత్యాల విషయంలో అనుకూలత పెరుగుతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ వృద్ధి చెందుతుంది. వ్యాపారాలు సజావుగా, లాభదాయకంగా సాగిపోతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కొందరు బంధువుల నుంచి శుభ వార్తలు అందుతాయి. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో సానుకూలత కనిపిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన గుర్తింపుతో ఆదరాభిమానాలు లభిస్తాయి. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో తప్పకుండా కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఇష్టమైన మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో రావలసిన డబ్బును రాబట్టుకుంటారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభ వార్తలు వింటారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపా రాలు నిలకడగా సాగిపోతాయి. అనారోగ్యం నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. కుటుంబ ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. కొద్ది ప్రయత్నంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి మంచి ఆఫర్ వస్తుంది. పెళ్లి ప్రయత్నాల విషయంలో శుభవార్తలు వింటారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా పని భారం ఉండే అవకాశం ఉంది. అధికారులు అదనపు బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. తలపెట్టిన వ్యవహారాలు, పనులు, సకాలంలో, సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆహార, విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికంగా సంతృప్తికరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగ,, పెళ్లి ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది. రావలసిన సొమ్మును రాబట్టుకుంటారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి, లాభాలు బాగా పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్ని సవ్యంగా చక్కబెడతారు. ఆదాయానికి లోటుండకపోవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. అనారోగ్యం నుంచి చాలావరకు బయటపడతారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. కుటుంబ జీవితం సాఫీగా, సానుకూలంగా సాగిపోతుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా, ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. వ్యాపారంలో పెట్టుబడులకు లాభాలు అందుతాయి. తలపెట్టిన ముఖ్యమైన పనుల్లో తప్పకుండా కార్యసిద్ధి కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో సరదాగా గడుపుతారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినా, ఆశించిన ప్రతిఫలం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలు పూర్తవుతాయి. కొందరు బంధుమిత్రులతో మాట పట్టింపులు వచ్చే సూచనలున్నాయి. ప్రయాణాల్లోనూ, ఆహార, విహారాల్లోనూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. ఇష్టమైనవారితో పెళ్లి నిశ్చయం అవుతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, ఉద్యోగాల్లో లక్ష్యాలు, బాధ్యతలు కొద్దిగా పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలకు ఇబ్బందేమీ ఉండదు. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. కొందరు మిత్రులతో అపార్థాలు తలెత్తే సూచనలున్నాయి. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితికి ఢోకా ఉండదు. వృథా ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. నిరుద్యోగులు తమకు అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశముంది.