AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lucky Zodiac Signs: మూడు వక్ర గ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి మహర్దశలు పట్టబోతున్నాయ్..!

Telugu Astrology 2025: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్చి 22 నుండి ఏప్రిల్ 7 వరకు మీన రాశిలో ఏకంగా మూడు గ్రహాలు శుక్రుడు, బుధుడు, రాహువు వక్రించి సంచరింపబోతున్నాయి. దీని ప్రభావంతో కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధనలాభం, ఉద్యోగంలో ఉన్నతి, వైవాహిక జీవితంలో సుఖం, ఆరోగ్య పురోగతి వంటి అనుకూల ఫలితాలు కలుగుతాయి. కొన్ని రాశుల వారికి విదేశీ అవకాశాలు కూడా లభించే అవకాశం ఉంది.

Lucky Zodiac Signs: మూడు వక్ర గ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి మహర్దశలు పట్టబోతున్నాయ్..!
Telugu Astrology 2025
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 10, 2025 | 9:45 PM

Share

జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహ సంచారంలో సూర్యుడికి దూరంగా జరిగిన గ్రహాలు వక్రిస్తాయి. గ్రహాలు వక్రించడమంటే అవి వేగంగా, మరింత చురుకుగా పనిచేయడం. సాధారణంగా వక్ర గ్రహాల వల్ల జీవితంలో ఆకస్మిక మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. హఠాత్తుగా జీవితాలు మారిపోవడం, ఈ నెల 22 నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు మీన రాశిలో ఏకంగా మూడు వక్ర గ్రహాలు సంచారం చేయడం జరుగుతోంది. ఉచ్ఛ స్థితిలో ఉన్న శుక్రుడితో పాటు బుధ గ్రహం కూడా వక్రించడం జరుగుతోంది. సహజ వక్ర గ్రహమైన రాహువు ఇప్పటికే మీన రాశిలో సంచారం చేస్తున్నాడు. దీనివల్ల వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, మీన రాశుల వారి జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి.

  1. వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో రాశ్యధిపతి శుక్రుడితో పాటు మూడు గ్రహాలు వక్రిస్తున్నందువల్ల ఆకస్మిక ధన లాభాలకు అవకాశం ఉంది. ఆకస్మిక అధికార లాభానికి, ఆస్తి లాభానికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల ప్రోద్బలంతో ఉన్నత పదవులను చేపడతారు. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని స్థాయిలో యాక్టివిటీ పెరుగుతుంది. నిరుద్యోగులకు అరుదైన విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. సంతాన యోగానికి కూడా అవకాశం ఉంది.
  2. మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో రాశ్యధిపతి బుధుడితో పాటు శుక్ర, రాహువుల వక్ర గతి వల్ల ఉద్యో గంలో సీనియర్లను కాదని ఉన్నత పదవులు పొందే అవకాశం ఉంది. మరింత మంచి ఉద్యోగం లోకి మారడానికి మార్గం సుగమం అవుతుంది. నిరుద్యోగులు విదేశాల్లో ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. కీర్తి ప్రతిష్ఠలు, పలుకుబడి వృద్ది చెందుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది.
  3. కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో రాశ్యధిపతి బుధుడితో పాటు మూడు వక్ర గ్రహాల వక్ర గతి వల్ల వైవాహిక జీవితంలోని సమస్యలన్నీ ఒక్కసారిగా సమసిపోయి, సఖ్యత, సాన్నిహిత్యం పెంపొందుతాయి. ఉన్నత స్థాయి కుటుంబంతో ప్రేమలో పడడం, పెళ్లి కావడం వంటివి జరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న నిరుద్యోగుల కల నెరవేరుతుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది.
  4. తుల: ఈ రాశికి ఆరవ స్థానంలో రాశ్యధిపతి శుక్రుడు వక్రించడంతో పాటు బుధ, రాహువులు కూడా కలవడం వల్ల రాజయోగాలు కలుగుతాయి. ఉద్యోగ జీవితంలో ఊహించని విధంగా అధికార లాభం కలుగుతుంది. పెద్దల జోక్యంతో ఆస్తి సమస్యలు పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో స్తబ్ధత తొలగిపోయి యాక్టివిటీ పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి.
  5. మకరం: ఈ రాశికి తృతీయ స్థానంలో మూడు వక్ర గ్రహాలు సంచారం చేయడం ఈ రాశివారికి అనేక విధాలుగా అదృష్టాన్ని కలగజేస్తుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. సామాజికంగా కూడా స్థితిగతులు, హోదాల్లో మార్పు వస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. కీర్తి ప్రతిష్ఠలు వృద్ధి చెందుతాయి.
  6. మీనం: ఈ రాశిలో మూడు వక్ర గ్రహాల సంచారం వల్ల జీవనశైలి పూర్తిగా మారిపోతుంది. సగటు వ్యక్తి సైతం ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆదాయ మార్గాలు బాగా విస్తరిస్తాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. నిరుద్యోగులకు అరుదైన ఆఫర్లు అందుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. మంచి పరిచయాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో భాగంగా విదేశీ ప్రయాణాలుంటాయి.

పండుగ తర్వాత కూడా తగ్గని చికెన్ ధరలు.. మళ్లీ షాక్..
పండుగ తర్వాత కూడా తగ్గని చికెన్ ధరలు.. మళ్లీ షాక్..
లాస్ట్ మ్యాచ్‌లో జీరోకే ఔట్.. ఖాతా తెరవని ప్లేయర్‌కు సూర్య ఛాన్స్
లాస్ట్ మ్యాచ్‌లో జీరోకే ఔట్.. ఖాతా తెరవని ప్లేయర్‌కు సూర్య ఛాన్స్
పసిడితో పోటీ పడుతున్న పచ్చ మిర్చి.. వీటికి ఎందుకంత డిమాండ్!
పసిడితో పోటీ పడుతున్న పచ్చ మిర్చి.. వీటికి ఎందుకంత డిమాండ్!
వక్కలకు ఇంతుందా..? సరిగా వాడితే ఈ సమస్యలన్నీ పరార్‌!
వక్కలకు ఇంతుందా..? సరిగా వాడితే ఈ సమస్యలన్నీ పరార్‌!
తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు.. మహిళలకు హోమ్ బిజినెస్ ఐడియాస్
తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు.. మహిళలకు హోమ్ బిజినెస్ ఐడియాస్
Team India: ఒకే ఫ్రేమ్‌లో భారత క్రికెట్ దిగ్గజాలు..!
Team India: ఒకే ఫ్రేమ్‌లో భారత క్రికెట్ దిగ్గజాలు..!
చనిపోయిన తర్వాత మీతో వచ్చేవి ఇవే.. నీడలా వెంటాడే ఆ మూడు రహస్యాలు
చనిపోయిన తర్వాత మీతో వచ్చేవి ఇవే.. నీడలా వెంటాడే ఆ మూడు రహస్యాలు
ఏకంగా 37 సిక్స్‌లు.. మనిషివా, సిక్సర్ మెషినివా భయ్యా..!
ఏకంగా 37 సిక్స్‌లు.. మనిషివా, సిక్సర్ మెషినివా భయ్యా..!
ఒక్క తెల్ల వెంట్రుక పీకితే జుట్టంతా తెల్లగా అవుతుందా.. అపోహలు..
ఒక్క తెల్ల వెంట్రుక పీకితే జుట్టంతా తెల్లగా అవుతుందా.. అపోహలు..
ఇన్‌స్టంట్ లోన్ యాప్స్‌లో డబ్బులు తీసుకునేవారికి అలర్ట్..
ఇన్‌స్టంట్ లోన్ యాప్స్‌లో డబ్బులు తీసుకునేవారికి అలర్ట్..
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి