AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lucky Zodiac Signs: చంద్రుడికి ఉచ్ఛ స్థితి… ఇక ఈ రాశుల వారి జీవితం నల్లేరు మీద బండి నడకే..!

జూన్ 23, 24 తేదీల్లో చంద్రుడు వృషభ రాశిలో ఉచ్ఛస్థితిలో ఉంటాడు. ఈ సమయంలో మేషం, వృషభం, కర్కాటకం, కన్య, మకరం, మీన రాశుల వారు అదృష్టాన్ని పొందుతారు. ఆర్థిక లాభాలు, ఉద్యోగంలో పదోన్నతులు, కుటుంబ సుఖం వంటి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది. కోరికలు నెరవేరే అవకాశం కూడా ఉంది.

Lucky Zodiac Signs: చంద్రుడికి ఉచ్ఛ స్థితి... ఇక ఈ రాశుల వారి జీవితం నల్లేరు మీద బండి నడకే..!
Lucky Zodiac Signs
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 23, 2025 | 1:17 PM

Share

Telugu Astrology: ఈ నెల(జూన్) 23, 24 తేదీల్లో చంద్రుడు వృషభ రాశిలో ఉచ్ఛపట్టడం జరుగుతోంది. ఈ రెండు రోజుల్లో తీసుకునే నిర్ణయాలు, చేపట్టే ప్రయత్నాలు సమీప భవిష్యత్తులో తప్పకుండా ఆశించిన ఫలితా లనిస్తాయి. అంతేకాక, మనసులోని కోరికలు, ఆశలు చాలావరకు నెరవేరుతాయి. ఐశ్వర్యానికి, ఆరోగ్యానికి, మనఃస్థితికి చంద్రుడు కారకుడైనందువల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మేషం, వృషభం, కర్కాటకం, కన్య, మకర, మీన రాశుల వారికి జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోవడానికి అవకాశం కలుగుతుంది.

  1. మేషం: ఈ రాశికి ధన, కుటుంబ స్థానంలో చంద్రుడు ఉచ్ఛపట్టడం వల్ల ఆదాయం పెరగడానికి మరిన్ని అవకాశాలు కలుగుతాయి. అప్రయత్న ధన లాభానికి కూడా అవకాశం ఉంది. బంధుమిత్రుల నుంచి రావలసిన సొమ్ము తప్పకుండా చేతికి అందుతుంది. తల్లి నుంచి ఆర్థిక లాభం కలుగు తుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు. మాటకు విలువ పెరుగుతుంది. మీ సలహాలు, సూచనల వల్ల అధికారులు లబ్ది పొందుతారు.
  2. వృషభం: ఈ రాశిలో చంద్రుడు ఉచ్ఛస్థితిలో ఉండడం వల్ల ఏ ప్రయత్నం చేపట్టినా లాభిస్తుంది. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. సోదరులు, బంధువుల వివాదాల్లో మీ మధ్యవర్తిత్వం సత్ఫలితాలనిస్తుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. మంచి పరిచయాలు కలుగుతాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. శుభ వార్తలు ఎక్కువగా వింటారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో మీ సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.
  3. కర్కాటకం: రాశ్యధిపతి చంద్రుడు లాభ స్థానంలో ఉచ్ఛపట్టడం వల్ల రాజయోగాలు, ధన యోగాలు కలుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలు బిజీగా సాగిపోతాయి. నిరుద్యోగుల కల సాకారం అవుతుంది. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురు తుంది. సంతాన ప్రాప్తికి సంబంధించి శుభవార్త వింటారు. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలతో సహా అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. రాజపూజ్యాలు బాగా పెరుగుతాయి.
  4. కన్య: ఈ రాశికి లాభాధిపతి అయిన చంద్రుడు భాగ్య స్థానంలో ఉచ్ఛపట్టడం వల్ల తండ్రి వల్ల సంపద వృద్ధి చెందే అవకాశం ఉంది. నిరుద్యోగులకే కాక ఉద్యోగులకు కూడా విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవ కాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాలను పండిస్తాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్య భాగ్యం కలుగుతుంది.
  5. మకరం: ఈ రాశికి పంచమ స్థానంలో సప్తమాధిపతి చంద్రుడు ఉచ్ఛపట్టడం వల్ల ప్రేమ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో మీ సమర్థతకు గుర్తింపు లభించి ఉన్నత స్థానాలకు వెళ్లడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలను లాభాల బాటపట్టిస్తారు. సంతాన యోగం కలుగుతుంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఒక ప్రముఖుడిగా గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
  6. మీనం: ఈ రాశికి పంచమాధిపతి అయిన చంద్రుడు తృతీయ స్థానంలో ఉచ్ఛపట్టడం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. తక్కువ ప్రయత్నంతో ఎక్కువ లాభాలు పొందుతారు. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగు తుంది. ఆస్తి సమస్యలు పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. ప్రయాణాల వల్ల బాగా లాభాలు కలుగుతాయి. సోదరులతో సమస్యలు పరిష్కారమై సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి.