Star Astrology: అనుకూల స్థితిలో కీలక గ్రహాలు.. ఆ నక్షత్రాలవారికి శుభ యోగాలు
ఏ గ్రహం బలంగా ఉంటుందో, ఆ గ్రహానికి సంబంధించిన నక్షత్రాలు కూడా బలపడి, శుభ యోగాలు కలగజేస్తాయి. ప్రస్తుతం శనీశ్వరుడు, గురువు, బుధ గ్రహాలు వరుసగా స్వక్షేత్ర, మిత్ర క్షేత్ర, ఉచ్ఛ క్షేత్రాలలో ఉన్నందువల్ల మొత్తం జాతక చక్రాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఫలితంగా వాటికి సంబంధించిన తొమ్మిది నక్షత్రాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది.
ఏ గ్రహం బలంగా ఉంటుందో, ఆ గ్రహానికి సంబంధించిన నక్షత్రాలు కూడా బలపడి, శుభ యోగాలు కలగజేస్తాయి. ప్రస్తుతం శనీశ్వరుడు, గురువు, బుధ గ్రహాలు వరుసగా స్వక్షేత్ర, మిత్ర క్షేత్ర, ఉచ్ఛ క్షేత్రాలలో ఉన్నందువల్ల మొత్తం జాతక చక్రాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఫలితంగా వాటికి సంబంధించిన తొమ్మిది నక్షత్రాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఇందులో శని నక్షత్రాల వారికి 2025 మార్చి వరకు, గురు నక్షత్రాల వారికి ఏప్రిల్ 25 వరకు, బుధ నక్షత్రాల వారికి నవంబర్ 18 వరకు అన్ని విధాలుగానూ సమయం అనుకూలంగా ఉందని, ఏ పని తలపెట్టినా విజయాలు సాధిస్తారని భావించవచ్చు. ఇందులో శనీశ్వరుడి నక్షత్రాలు పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర కాగా, గురు నక్షత్రాలు పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర, బుధ నక్షత్రాలు ఆశ్లేష, జ్యేష్ట, రేవతి. ప్రస్తుతం వీరికి యోగదాయక సమయం నడుస్తోంది. ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది.
పునర్వసు: గురువుకు చెందిన ఈ నక్షత్రం వారికి ఆర్థిక ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. అదనపు ఆదాయ మార్గాల వల్ల ఆశించిన ప్రయోజనాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో జీతభత్యాలు పెరుగుతాయి. వ్యాపారాలలో రాబడి మెరుగుపడుతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
పుష్యమి: శనీశ్వరుడికి చెందిన ఈ నక్షత్రం వారికి వృత్తి, ఉద్యోగాలలో స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. సేవా రంగంలోని వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఇష్ట మైన ఆలయాలను సందర్శించడం, ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లడం వంటివి జరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి శుభ వార్తలు వింటారు. అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడ తారు.
ఆశ్లేష: బుధుడికి చెందిన ఈ నక్షత్రం వారికి ఇంటా బయటా మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రతిభా పాట వాలు వెలుగులోకి వస్తాయి. వీరి ఆలోచనలకు, సలహాలకు మంచి విలువ ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలతో పాటు వ్యాపారాలలో కూడా బాగా రాణించడం జరుగుతుంది. నిరుద్యోగులకు ఇష్ట మైన ఉద్యోగం లభిస్తుంది. కొన్ని ముఖ్యమైన సమస్యలను, వివాదాలను తెలివితేటలతో పరిష్క రించుకుంటారు. బంధు మిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. వ్యవహారవేత్తగా మారుతారు.
విశాఖ: గురువుకు చెందిన ఈ నక్షత్రం వారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందుతారు. అధికారులు, యజమానులు సైతం ఈ రాశివారి సలహాలు స్వీకరిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారం కావడమే కాకుండా అధికారం చేపట్టే అవకాశం కూడా ఉంటుంది. కుటుంబ పెద్దల జోక్యంతో ఒక ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. సోదర వర్గంతో సఖ్యత ఏర్పడుతుంది.
అనూరాధ: శనీశ్వరుడికి చెందిన ఈ నక్షత్రం వారి శక్తిసామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి. ఇంత వరకూ స్తబ్ధుగా, మందకొడిగా ఉన్న జీవితం ఒక్కసారిగా ఊపందుకుంటుంది. ప్రతి యాక్టివిటీలోనూ వేగం పెరుగుతుంది. సంపాదనను మెరుగుపరుచుకోవడం మీద దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలోనే కాకుండా సామాజికంగా కూడా ఆదరణ, గౌరవ మర్యాదలు ఇనుమడి స్తాయి. వ్యాపారాలు ఆశించిన స్థాయిలో బాగా కలిసి వస్తాయి. వాహన సౌకర్యం కలుగుతుంది.
జ్యేష్ట: బుధుడికి చెందిన ఈ నక్షత్రం వారికి జీవితంలో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. విమర్శించినవారే ప్రశంసించడం, అభినందించడం ప్రారంభిస్తారు. వృత్తి, వ్యాపారాలలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ఆశించిన స్థాయిలో స్థిరత్వం లభిస్తుంది. వ్యక్తిగత ఆర్థిక, ఆరోగ్య సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. ఒకటి రెండు శుభ వార్తలు ఉత్సాహాన్నిస్తాయి. ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలనిస్తాయి. మిత్రుల నుంచి సహాయం అందుతుంది.
పూర్వాభాద్ర: గురువుకు చెందిన ఈ నక్షత్రం వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. అనేక మార్గాలలో ఆదాయం పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో సఫలం అవుతాయి. ఊహించని విధంగా జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. మరింత మంచి ఉద్యోగంలో మారడానికి చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఉత్తరాభాద్ర: శనీశ్వరుడికి చెందిన ఈ నక్షత్రం వారికి కోరుకున్న సంస్థలో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఉద్యోగం మారాలనుకుంటున్నవారు కూడా అనేక ఆఫర్లు అందుకుంటారు. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొద్ది ప్రయత్నంతో అత్యధిక లాభాలు గడించడం జరుగుతుంది. సంతానం లేని వారికి సంతాన యోగం పట్టవచ్చు. పిల్లలు పురోగతి సాధిస్తారు. సతీమణికి కూడా మంచి గుర్తింపు లభిస్తుంది.
రేవతి: బుధ నక్షత్రమైన రేవతి వారికి జీవితం సానుకూల మలుపు తిరుగుతుంది. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. సామాజికంగా కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. సంపన్న కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపా రాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. ఈ నక్షత్రం వారు తమ పనితీరుతో అధికారులను మెప్పిస్తారు.