- Telugu News Photo Gallery Spiritual photos Guru and Kuja planetary position to bring good luck for kids of these zodiac signs news in telugu
Zodiac Signs: గురు, కుజ గ్రహాల పరస్పర వీక్షణ.. ఆ రాశుల వారికి విశేష యోగం
Astrology in Telugu: జ్యోతిషశాస్త్రం ప్రకారం గురు, కుజ గ్రహాలు మంచి స్నేహితులు. ప్రస్తుతం గోచారంలో గురు, కుజ గ్రహాలు పరస్పరం చూసుకుంటుండడం వల్ల కొన్ని శుభ ఫలితాలు కలగడం, శుభ యోగాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. ఇందులో గురు గ్రహం పుత్ర కారక గ్రహం అయినందువల్ల పిల్లలకు సంబంధించి ఆరు రాశులకు విశేష యోగం పట్టే అవకాశం ఉంది. పిల్లలు చదువుల్లో లేదా వృత్తి, ఉద్యోగాల్లో ఘన విజయాలు సాధించడం..
TV9 Telugu Digital Desk | Edited By: Janardhan Veluru
Updated on: Oct 08, 2023 | 9:56 AM

జ్యోతిషశాస్త్రం ప్రకారం గురు, కుజ గ్రహాలు మంచి స్నేహితులు. ప్రస్తుతం గోచారంలో గురు, కుజ గ్రహాలు పరస్పరం చూసుకుంటుండడం వల్ల కొన్ని శుభ ఫలితాలు కలగడం, శుభ యోగాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. ఇందులో గురు గ్రహం పుత్ర కారక గ్రహం అయినందువల్ల పిల్లలకు సంబంధించి ఆరు రాశులకు విశేష యోగం పట్టే అవకాశం ఉంది. పిల్లలు చదువుల్లో లేదా వృత్తి, ఉద్యోగాల్లో ఘన విజయాలు సాధించడం, విదేశాలకు వెళ్లడం, మంచి ఉద్యోగం సంపాదించుకోవడం, పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావడం, వారిలోని నైపుణ్యాలకు, ప్రతిభా పాటవాలకు గుర్తింపు రావడం వంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఇది నవంబర్ 16న కుజుడు రాశి మారే వరకు కొనసాగుతుంది. ఈ ఆరు రాశులుః మేషం, మిథునం, కర్కాటకం, సింహం, ధనుస్సు, కుంభం.

మేషం: ఈ రాశి నాథుడైన కుజుడిని ఈ రాశి నుంచి గురువు వీక్షించడం వల్ల పిల్లలకు సమయం బాగా అనుకూలంగా మారడం జరుగుతుంది. చదువులు, ఉద్యోగాల్లో పురోగతి సాధించే అవకాశం ఉంది. వారిలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. విదేశీ అవకాశాలు అంది వస్తాయి. పిల్లల మీద శ్రద్ధ పెరుగుతుంది. వారి భవిష్యత్తుకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేస్తారు. పిల్లలతో ఏవైనా సమస్యలుంటే సమసిపోతాయి. పిల్లలు అనారోగ్యాల నుంచి కోలుకునే అవకాశం కూడా ఉంది.

మిథునం: ఈ రాశికి లాభ స్థానంలో పుత్రకారకుడు గురువు సంచరిస్తూ ఉండడం, పంచమ స్థానంలో లాభా ధిపతి కుజుడు ఉండడం వల్ల పిల్లలకు సంబంధించిన అంశాలు ప్రాధాన్యం సంతరించుకుంటాయి. పిల్లలు అంచనాలకు మించి పురోగతి సాధిస్తారు. విదేశీ అవకాశాలు మెరుగుపడతాయి. ప్రతిభ, నైపుణ్యాలు వెలుగులోకి వస్తాయి. చదువుల్లోనే కాక, క్రీడలు, కళలు, పోటీ పరీక్షలలో కూడా సత్తా ప్రదర్శించే అవకాశం ఉంది. పిల్లల భవిష్యత్తుకు ప్లాన్ చేయడానికి ఇది అనుకూలమైన సమయం.

కర్కాటకం: ఈ రాశివారికి గురు, కుజుల పరస్పర వీక్షణను ఒక మహాయోగం కింద పరిగణించడం జరుగు తుంది. ఈ రాశివారి పిల్లలకు తప్పకుండా అదృష్ట యోగం పడుతుంది. చదువుల్లోనూ, పోటీ పరీక్షల్లోనూ, ఉద్యోగాల్లోనూ వీరు అజేయంగా ముందుకు సాగిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరు కొత్త నైపుణ్యాలను అలవరచుకునే అవకాశం ఉంది. అనారోగ్యాలకు అవకాశం ఉండదు. విదేశాలకు వెళ్లే సూచనలు కూడా ఉన్నాయి. ఏ సబ్జెక్టయినా తప్పకుండా రాణిస్తారు.

సింహం: ఈ రాశికి పుత్రకారకుడు భాగ్య స్థానంలో ఉండడం, దాన్ని భాగ్య స్థానాధిపతి కుజుడు వీక్షించడం వల్ల పిల్లలకు మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఇంత వరకూ పిల్లలు కలగనివారికి పిల్లలు కలిగే యోగం కూడా ఉంది. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వినే సూచనలున్నాయి. పిల్లల జీవితాల్లో ఆశించిన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పిల్లల్లో ఎవరైనా ఉద్యోగాల్లో ఉన్న పక్షంలో వారికి ప్రమోషన్ లభించే అవకాశం కూడా ఉంది. తమ ప్రతిభను నిరూపించుకుంటారు.

ధనుస్సు: ఈ రాశివారికి పుత్ర కారకుడైన గురువే రాశ్యధిపతి కావడం, పైగా పుత్ర స్థానంలోనే సంచరించడం, దాన్ని లాభ స్థానం నుంచి పుత్ర స్థానాధిపతి కుజుడు వీక్షించడం వల్ల పుత్ర భాగ్యం కలగడం, పిల్లలకు అదృష్టం పట్టడం, పేరు ప్రఖ్యాతులు రావడం, ప్రతిభా నైపుణ్యాలు వెలుగులోకి రావడం వంటివి తప్పకుండా చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి పిల్లలకు ఇష్టమైన ప్రాంతాలకు ప్రమోషన్ మీద బదిలీ అయ్యే అవకాశం కూడా ఉంది. విదేశీ అవకాశాలు అంది వస్తాయి.

కుంభం: ఈ రాశివారికి భాగ్య స్థానంలో కుజుడు ఉండడం, గురువు భాగ్య స్థానాన్ని వీక్షించడం వల్ల సంతా నానికి సంబంధించి అదృష్ట యోగం పట్టే అవకాశం ఉంది. పిల్లలు అంచనాలకు మించి అభివృద్ధి లోకి రావడం, వారికి సంబంధించి శుభవార్తలు వినడం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. పిల్లల్లో ఒకరికి శుభకార్యం జరిగే అవకాశం కూడా ఉంది. పిల్లల్లో ఒకరు పోటీ పరీక్షల్లో ఘన విజయాలు సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారు గుర్తింపు తెచ్చుకుంటారు.





























