Horoscope Today: వారికి ఆర్థికంగా ఢోకా ఉండదు.. 12 రాశుల వారికి రాశిఫలాలు
దినఫలాలు (అక్టోబర్ 9, 2027): మేషరాశి వారికి రోజంతా సానుకూలంగా సాగిపోతుంది. ఏ పని తలపెట్టినా సంతృప్తికరంగా పూర్తవుతుంది. వృషభ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు లాభదాయకంగా పూర్తవుతాయి. మిథున రాశి వారికి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
దినఫలాలు (అక్టోబర్ 9, 2027): మేషరాశి వారికి రోజంతా సానుకూలంగా సాగిపోతుంది. ఏ పని తలపెట్టినా సంతృప్తికరంగా పూర్తవుతుంది. వృషభ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు లాభదాయకంగా పూర్తవుతాయి. మిథున రాశి వారికి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
రోజంతా సానుకూలంగా సాగిపోతుంది. ఏ పని తలపెట్టినా సంతృప్తికరంగా పూర్తవుతుంది. చిన్న చిన్న సమస్యల విషయంలో అతి ఆలోచించడం, ఆందోళన చెందడం మంచిది కాదు. గురు బలం బాగా ఉన్నందువల్ల ఎటువంటి సమస్య తలెత్తినా అది పరిష్కారం అవుతుంది. వృత్తి, ఉద్యోగంలో మీ మాట చెల్లుబాటు అవుతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ఇంటా బయటా కొద్దిగా బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఆదాయానికి ఢోకా ఉండదు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ప్రణాళికా బద్ధంగా వ్యవహరించి ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేసుకోవడంతో పాటు, వ్యక్తిగత సమస్యలను కూడా పరిష్కరించుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు లాభదాయకంగా పూర్తవుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు. అధికారులతో సామరస్యం పెరుగుతుంది. ఏ పని తలపెట్టినా సంతృప్తికరంగా పూర్తవుతుంది. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఆస్తి వివాదాలను తెలివితేటలతో పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, ఉద్యోగాలలో అనుకున్నది సాధిస్తారు. మీ మాట బాగా చెల్లుబాటవుతుంది. వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. విద్యార్థులకు పరీక్షా ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. స్వల్ప అనా రోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధువులతో ఆనందంగా గడుపుతారు. శుభ కార్యంలో పాల్గొం టారు. ప్రయాణాలు చాలావరకు లాభిస్తాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. సతీ మణికి ఉద్యోగపరంగా మంచి అదృష్టం పడుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
సమాజంలో ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సమస్యలను అధిగమిస్తారు. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొం టారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. చేపట్టిన వ్యవహారాల్లో విజయాలు చవి చూస్తారు. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఒకటి రెండు శుభ వార్తలు అందుతాయి. సతీమణికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఏ పని తలపెట్టినా, ఏ ప్రయత్నం చేపట్టినా తప్పకుండా విజయం సాధిస్తారు. సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగా లలో మీ మాటకు విలువ పెరుగుతుంది. అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. సతీ మణితో కలిసి షాపింగ్ చేసి, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి బేరసారాలు సాగిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఇంటా బయటా బాగా శ్రమ, ఒత్తిడి ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలున్నా అధిగమిస్తారు. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. సతీమణికి మంచి గుర్తింపు లభిస్తుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేస్తారు. సమయం అనుకూలంగా ఉంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు. సతీమణికి ఊహించని అదృష్టం పడుతుంది. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో కొత్త వ్యూహాలు ప్రవేశపెడతారు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.
వృశ్చికం (విఖాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. పనిభారం బాగా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆదాయం పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. అయినప్పటికీ ఇతరులకు సహాయం చేయడం జరుగుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగి పోతుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటారు. దైవ కార్యాల మీద ఎక్కువగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. కొత్త ప్రయత్నాలు, కొత్త ఆలోచనలు సత్ఫలితాలనిస్తాయి. సతీమణికి వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. ఈ రాశివారికి ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగిపోతాయి. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. కొందరు బంధువులకు సహాయం చేయడం జరుగుతుంది. మిత్రుల సహాయ సహకారాలతో పెండింగు పనులన్నీ పూర్తి చేస్తారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. తండ్రి సహాయంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాలు లాభదాయకంగా సాగి పోతాయి. కుటుంబపరంగా కాస్తంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు తప్పకపోవచ్చు. వ్యయ ప్రయాసలు, తిప్పట కొద్దిగా ఎక్కు వగా ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆదాయంలో పెద్దగా పెరుగుదల కనిపించదు. తల్లి తండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు ఎక్కువగా ఉపయోగించుకుంటారు. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. ఇరుగు పొరుగు నుంచి ఇబ్బందులు తలెత్తుతాయి. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. ఎవరికీ హామీలు ఇవ్వవద్దు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు ఒక పద్ధతి ప్రకారం పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు పెరు గుతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. సతీమణికి పురోగతి ఉంటుంది. ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయడం, హామీలు ఇవ్వడం పెట్టుకోవద్దు. దైవ కార్యాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఇష్టమైన ఆలయాలు సందర్శి స్తారు.