Maha Yoga: మీన రాశిలోకి శుక్రుడు.. ఆ రాశులకు చెందిన మహిళలకు మహా యోగాలు పక్కా..!
ప్రస్తుతం తన మిత్ర క్షేత్రమైన కుంభ రాశిలో సంచారం చేస్తుండడమే కాక, మిత్రుడైన శనీశ్వరుడితో యుతి చెందిన శుక్రుడు ఈ నెలాఖరు నుంచి తనకు ఉచ్ఛ క్షేత్రమైన మీనంలోకి ప్రవేశించడం కూడా జరుగుతుంది. అందువల్ల రెండున్నర నెలల పాటు శుక్రుడు కొన్ని రాశులకు బాగా అనుకూలంగా మారి, యోగ దాయక జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. శుక్రుడు స్త్రీ గ్రహం. పైగా మహిళా పక్షపాతి.
ప్రస్తుతం తన మిత్ర క్షేత్రమైన కుంభ రాశిలో సంచారం చేస్తుండడమే కాక, మిత్రుడైన శనీశ్వరుడితో యుతి చెందిన శుక్రుడు ఈ నెలాఖరు నుంచి తనకు ఉచ్ఛ క్షేత్రమైన మీనంలోకి ప్రవేశించడం కూడా జరుగుతుంది. అందువల్ల రెండున్నర నెలల పాటు శుక్రుడు కొన్ని రాశులకు బాగా అనుకూలంగా మారి, యోగ దాయక జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. శుక్రుడు స్త్రీ గ్రహం. పైగా మహిళా పక్షపాతి. మహిళలు అత్యున్నత స్థానాలకు చేరుకోవడానికి శుక్ర గ్రహ అనుగ్రహం చాలా అవసరం. ఈ రెండున్నర నెలల కాలంలో మహిళల వ్యక్తిగత, కుటుంబ, ఆర్థిక సమస్యలు పరిష్కారం కావడమే కాకుండా, వృత్తి, ఉద్యోగాల్లో కూడా అంచనాలకు మించి రాణించడం జరుగుతుంది. ముఖ్యంగా వృషభం, మిథునం, కన్య, తుల, మకర, కుంభ రాశులకు చెందిన మహిళలను శుక్రుడు అపారంగా కరుణించబోతున్నాడు.
- వృషభం: ఈ రాశ్యధిపతి అయిన శుక్రుడు బాగా అనుకూల రాశుల్లో సంచారం చేస్తున్నందువల్ల మహిళ లకు తమ జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలతలు ఏర్పడతాయి. సంపన్న వ్యక్తులతో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. జీవితంలో అనేక సాను కూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. నిరు ద్యోగులు మంచి ఉద్యోగంలో చేరతారు. మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడగలుగుతారు.
- మిథునం: ఈ రాశివారికి భాగ్య, దశమ స్థానాల్లో శుక్ర సంచారం వల్ల ఈ రెండున్నర నెలల కాలం బాగా యోగదాయకమవుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడి, సంపన్నులుగా గుర్తింపు పొందు తారు. కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు కూడా అంది వస్తాయి. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. వృత్తి, ఉద్యో గాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. పని ఒత్తిడి బాగా తగ్గుతుంది. మంచి మిత్రులు ఏర్పడతారు.
- కన్య: ఈ రాశికి అత్యంత శుభ గ్రహమైన శుక్రుడు బాగా అనుకూల సంచారం చేస్తున్నందువల్ల, ఈ రాశివారు అనేక విధాలుగా జీవితంలో స్థిరపడడం జరుగుతుంది. ఆస్తి వివాదం పరిష్కారం కావడం, ఆస్తి విలువ పెరగడం, గృహ, వాహన యోగాలు ఏర్పడడం, ఇంట్లో సౌకర్యాలను మెరుగు పరచుకోవడం వంటివి తప్పకుండా జరుగుతాయి. ఇంట్లో శుభ కార్యాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అంది వస్తాయి. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది.
- తుల: ఈ రాశ్యధిపతి శుక్రుడు అనుకూల సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశికి చెందిన మహిళలు తప్పకుండా ఉద్యోగపరంగా, ఆర్థికంగా స్థిరపడడం జరుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా సర్వత్రా ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. సహాయ, సేవా కార్య క్రమాల్లో విరివిగా పాల్గొంటారు. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతుంది. అనారోగ్యాల నుంచి బయటపడడం జరుగుతుంది. కుటుంబ, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
- మకరం: ఈ రాశికి పంచమ, దశమాధిపతిగా అత్యంత శుభుడైన శుక్రుడు మిత్ర, ఉచ్ఛ క్షేత్రాల్లో సంచారం చేయడం వల్ల ఈ రాశికి చెందిన మహిళలు వృత్తి, ఉద్యోగాల్లో విశేషంగా రాణిస్తారు. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు వస్తాయి. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. సర్వత్రా మాట చెలామణీ అవుతుంది. తప్పకుండా అధికార యోగం పడుతుంది. శుక్రుడు వీరిని అన్ని విధాలుగానూ సంపన్నుల్ని చేస్తాడు.. దాంపత్య జీవితం ఎంతో అన్యోన్యంగా సాగిపోతుంది.
- కుంభం: ఈ రాశికి శుభుడైన శుక్రుడు ప్రస్తుతానికి ఇదే రాశిలోనూ, నెలాఖరు నుంచి ధన స్థానంలోనూ సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశికి చెందిన మహిళలకు సర్వత్రా ప్రాధాన్యం, ప్రాభవం పెరుగు తాయి. బంధుమిత్రుల్లో వీరి మాటకు విలువ పెరుగుతుంది. ధన ధాన్యాలకు ఏమాత్రం లోటుం డదు. ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..