AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parivartan Yoga: శుక్ర, రవి గ్రహాల పరివర్తన.. ఆ రాశుల వారికి అదృష్ట యోగం పట్టడం పక్కా.. !

Parivartan Yoga: గ్రహ సంచారం ప్రకారం ప్రస్తుతం శుక్ర, రవి గ్రహాలు పరివర్తన చెంది ఉన్నాయి. అంటే, శుక్రుడి రాశి అయిన తులలో రవి, రవి రాశి అయిన సింహంలో శుక్రుడు సంచారం చేస్తున్నాయి. ఈ పరివర్తన వల్ల ఆరు రాశుల వారికి ఒక విధమైన అదృష్టం పట్టడం జరుగుతుంది. మిగిలిన ఆరు రాశుల వారికి సాధారణ ఫలితాలు మాత్రమే ఉంటాయి.

Parivartan Yoga: శుక్ర, రవి గ్రహాల పరివర్తన.. ఆ రాశుల వారికి అదృష్ట యోగం పట్టడం పక్కా.. !
Parivartan Yoga
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 21, 2023 | 6:36 PM

Share

గ్రహ సంచారం ప్రకారం ప్రస్తుతం శుక్ర, రవి గ్రహాలు పరివర్తన చెంది ఉన్నాయి. అంటే, శుక్రుడి రాశి అయిన తులలో రవి, రవి రాశి అయిన సింహంలో శుక్రుడు సంచారం చేస్తున్నాయి. ఈ పరివర్తన వల్ల ఆరు రాశుల వారికి ఒక విధమైన అదృష్టం పట్టడం జరుగుతుంది. మిగిలిన ఆరు రాశుల వారికి సాధారణ ఫలితాలు మాత్రమే ఉంటాయి. అదృష్టం పట్టే రాశులుః మేషం, కర్కాటకం, తుల, ధనుస్సు, మకరం, కుంభం. ఈ రెండు గ్రహాల మధ్య రాశి పరివర్తన జరగడం వల్ల సాధారణంగా పెళ్లి, ప్రేమ, కుటుంబ, దాంపత్య వ్యవహారాలలో సానుకూల మార్పులు, శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వీటికి సంబంధించిన శుభవార్తలు వినడం జరుగుతుంది.

  1. మేషం: ఈ రాశివారికి అయిదవ స్థానాధిపతి అయిన రవికి, ఏడవ స్థానాధిపతి అయిన శుక్రుడికి మధ్య పరివర్తన చోటు చేసుకోవడం వల్ల ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధించడం జరుగుతుంది. కొత్తగా ప్రేమలో పడే అవకాశం కూడా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు తప్పకుండా పెళ్లికి దారితీస్తాయి. వైవాహిక జీవితంలో ఉన్నవారికి సతీమణితో (లేక భర్తతో) వివాదాలు, విభేదాలు పరిష్కారమై, అన్యోన్య దాంపత్యం చోటు చేసుకునే అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.
  2. కర్కాటకం: ఈ రాశివారికి ద్వితీయ, చతుర్థ స్థానాధిపతుల మధ్య పరివర్తన జరిగినందువల్ల దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. సతీమణి మనసులోని కోరికలు నెరవేరుతాయి. ముఖ్యంగా గృహ, వాహన సౌకర్యాలు అమరే అవకాశం ఉంటుంది. సొంత ఇంటిలోకి మారడం జరుగుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఇష్టమైన ప్రాంతాలకు విహార యాత్రలకు వెళ్లే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో భార్యాభర్తలిద్దరికీ హోదా, గౌరవమర్యాదలు పెరుగుతాయి.
  3. తుల: ఈ రాశివారికి లాభ స్థానాధిపతితో రాశ్యధిపతి పరివర్తన చెందడం వల్ల ప్రేమ, పెళ్లి, అన్యోన్యతలకు సంబంధించి ఏ ప్రయత్నం తలపెట్టినా నెరవేరడం, సానుకూల పరిస్థితులు ఏర్పడడం జరుగు తుంది. భార్యాభర్తలకు సామాజికంగా ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ఇద్దరికీ ఆదాయ వృద్ధి, వ్యక్తిగత పురోగతి ఉంటాయి. ప్రేమ వ్యవహారాలలో సాన్నిహిత్యం పెరిగి, పెళ్లికి దారితీసే అవకాశం ఉంది. కుటుంబపరంగా ఆర్థికాభివృద్ధి ఉంటుంది. పెద్దల నుంచి అనుకూలతలు పెరుగుతాయి.
  4. ధనుస్సు: ఈ రాశికి భాగ్య, లాభాధిపతుల పరివర్తన గరిష్ఠంగా శుభ ఫలితాలనిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమలకు సంబంధించి ఎటువంటి కార్యక్రమం లేదా ప్రయత్నం తల పెట్టినా అది తప్పకుండా సఫలం అవుతుంది. ఎక్కువగా విహార యాత్రలు చేయడం జరుగు తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలకు కొదవ ఉండదు. దాంపత్య జీవితంలో ఎటువంటి వివాదాలు, విభేదాలు ఉన్నప్పటికీ సానుకూలంగా సమసిపోయి, అన్యోన్యత బాగా పెరుగుతుంది.
  5. మకరం: ఈ రాశివారికి అష్టమ, దశమాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల జీవిత భాగస్వామి తప్పకుండా వృత్తి, ఉద్యోగాలపరంగా శుభవార్తలు వినడం జరుగుతుంది. అధికార యోగం పట్టే అవకాశం కూడా ఉంది. కొద్దిపాటి ప్రయత్నంతో జీవిత భాగస్వామికి మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. ప్రేమ వ్యవహారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. కొత్తగా ప్రేమ వ్యవ హారాల్లో ప్రవేశిస్తున్నవారు విజయాలు సాధిస్తారు. దాంపత్య జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది.
  6. కుంభం: ఈ రాశివారికి సప్తమ, భాగ్య స్థానాల మధ్య పరివర్తన జరగడం వల్ల జీవిత భాగస్వామికి ఉద్యోగ సంబంధమైన యోగం పడుతుంది. సతీమణికి నిరుద్యోగ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. భార్యాభర్తలకు విదేశీయాన యోగం కూడా ఉంటుంది. దాంపత్య జీవితం బాగా అను కూలం అవు తుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోవడం జరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారి తీస్తాయి. జీవిత భాగస్వాములు లేదా ప్రేమ భాగస్వాములు ఎక్కువగా విహార యాత్రలు చేస్తారు.

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?