AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shani Vakri 2024: శని వక్రగతి.. ఆ రాశుల వారికి కలలో కూడా ఊహించని శుభ ఫలితాలు..!

ప్రస్తుతం కుంభ రాశిలో స్వస్థానంలో సంచారం చేస్తున్న శనీశ్వరుడు ఈ నెల 29 నుంచి నవంబర్ 15 వరకూ వక్రించడం జరుగుతోంది. వక్రించడమంటే సాంకేతికంగా రవి గ్రహానికి దూరం కావడమన్న మాట. శని వక్రించినప్పుడు సాధారణంగా తన వెనుక రాశి మీద ప్రభావం చూపిస్తాడు. అంటే, కుంభ రాశిలో వక్రించిన శని మకర రాశిలో సంచారం చేస్తున్న ఫలితాలనిస్తాడు.

Shani Vakri 2024: శని వక్రగతి.. ఆ రాశుల వారికి కలలో కూడా ఊహించని శుభ ఫలితాలు..!
Shani Vakri 2024
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 22, 2024 | 5:29 PM

Share

Lord Shani Dev: ప్రస్తుతం కుంభ రాశిలో స్వస్థానంలో సంచారం చేస్తున్న శనీశ్వరుడు ఈ నెల 29 నుంచి నవంబర్ 15 వరకూ వక్రించడం జరుగుతోంది. వక్రించడమంటే సాంకేతికంగా రవి గ్రహానికి దూరం కావడమన్న మాట. శని వక్రించినప్పుడు సాధారణంగా తన వెనుక రాశి మీద ప్రభావం చూపిస్తాడు. అంటే, కుంభ రాశిలో వక్రించిన శని మకర రాశిలో సంచారం చేస్తున్న ఫలితాలనిస్తాడు. వక్రించినప్పుడు శని మహా బలవంతుడవుతాడు. దీనివల్ల మేషం, వృషభం, సింహం, వృశ్చికం, మకరం, మీన రాశులకు కలలో కూడా ఊహించని శుభ ఫలితాలు అనుభవానికి వచ్చే అవకాశం ఉంది.

  1. మేషం: ఈ రాశికి దశమ స్థానమైన మకరం మీద శని ప్రభావం పడుతున్నందువల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగపరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా జయప్రదం అవు తుంది. విదేశాల్లో ఉద్యోగం లభించడం గానీ, ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లడం గానీ జరుగుతుంది. వీటివల్ల ఊహించని విధంగా ఆర్థిక లాభం కూడా కలుగుతుంది. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరు గుతుంది. హోదాపెరగడానికి అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది.
  2. వృషభం: ఈ రాశికి ఆధిపత్యరీత్యా శనీశ్వరుడు పూర్ణ శుభుడు. ఈ రాశికి భాగ్య స్థానమైన మకర రాశి మీద శని ప్రభావం పడడం వల్ల విదేశీ యోగాలు పట్టే అవకాశం ఉంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు అంది వస్తాయి. పిత్రార్జితం గానీ, వారసత్వ సంపద గానీ లభిస్తుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది.
  3. సింహం: ఈ రాశికి ఆరు, ఏడు స్థానాలకు అధిపతి అయిన శనీశ్వరుడు ఆరవ స్థానాన్ని ప్రభావితం చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరగడం, స్థిరత్వం లభించడం వంటివి జరు గుతాయి. అనారోగ్యం నుంచి చాలావరకు కోలుకోవడం జరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగానికి ఆఫర్ అందడం జరుగుతుంది.
  4. వృశ్చికం: ఈ రాశికి ఇంత కాలంగా చతుర్థంలో ఉండి, అర్ధాష్టమ ఫలితాలనిస్తూ మనశ్శాంతి లేకుండా చేస్తున్న శనీశ్వరుడు జూన్ 29 నుంచి ఆదాయ వృద్ధికి అవకాశాలు కల్పిస్తాడు. ఏ ప్రయత్నం చేప ట్టినా సత్ఫలితాలు అందుతాయి. పెండింగ్ పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగి, ముఖ్యమైన అవసరాలన్నీ తీరిపోతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ధైర్యసాహసాలు, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
  5. మకరం: ఈ రాశికి అధిపతి అయిన శనీశ్వరుడు ధన స్థానంలో ఉండి ఈ రాశిని ప్రభావితం చేస్తున్నందు వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా ధన లాభం కలుగుతుంది. రావలసిన డబ్బు ఊహించని విధంగా చేతికి అందుతుంది. ఆర్థిక లావాదేవీలు, ఆస్తి ఒప్పందాలు బాగా లాభిస్తాయి. కొద్దిగా కష్టపడినప్పటికీ ఆదాయ మార్గాలన్నీ ఆశించిన ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం అవుతుంది.
  6. మీనం: ప్రస్తుతం ఈ రాశికి వ్యయ స్థానంలో సంచారం చేస్తూ ఏలిన్నాటి శని ఫలితాలనిస్తున్న శనీశ్వరుడు వక్రించి, లాభ స్థానాన్ని ప్రభావితం చేస్తున్నందువల్ల దాదాపు 135 రోజుల పాటు వీరికి అనేక కష్ట నష్టాల నుంచి ఎంతో ఉపశమనం లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదాయ ప్రయత్నాలన్నీ విజయవంతం అయి, ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లు చాలావరకు పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది. శత్రు, రోగ, రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.