Santhana Yoga 2024: గురువు అనుకూలం.. ఆ రాశుల వారికి సంతాన యోగం పట్టనుండి..!
జ్యోతిషశాస్త్రం ప్రకారం గురువు సంతాన కారకుడు కూడా. జాతక చక్రంలో గురు గ్రహం అనుకూలంగా ఉన్నవారికి సత్సంతానం కలుగుతుంది. గురువు అనుగ్రహం లేనప్పుడు తప్పకుండా సంతానానికి సంబంధించిన సమస్యలతో సతమతం కావడం జరుగుతుంది. ప్రస్తుతం వృషభ రాశిలో సంచారం చేస్తున్న గురు గ్రహం వల్ల కొన్ని రాశుల వారికి సంతానపరంగా యోగాలు పట్టే అవకాశం ఉంటుంది.
జ్యోతిషశాస్త్రం ప్రకారం గురువు సంతాన కారకుడు కూడా. జాతక చక్రంలో గురు గ్రహం అనుకూలంగా ఉన్నవారికి సత్సంతానం కలుగుతుంది. గురువు అనుగ్రహం లేనప్పుడు తప్పకుండా సంతానానికి సంబంధించిన సమస్యలతో సతమతం కావడం జరుగుతుంది. ప్రస్తుతం వృషభ రాశిలో సంచారం చేస్తున్న గురు గ్రహం వల్ల కొన్ని రాశుల వారికి సంతానపరంగా యోగాలు పట్టే అవకాశం ఉంటుంది. సంతానం కలగడం, పిల్లలు వృద్ధిలోకి రావడం, వారు ఆరోగ్యవంతులుగా ఉండడం వంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. మొత్తానికి గురు గ్రహం రాశి మార్పుతో సంతానానికి సంబంధించిన అంశాలన్నీ ప్రాధాన్యం సంతరించుకుంటాయి. గురువు వృషభ రాశి ప్రవేశం వల్ల మేషం, వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారు సంతానపరంగా సుఖ సంతోషాలను అనుభవించడం జరుగుతుంది. గురువు ఈ రాశిలో 2025 మే వరకు కొనసాగుతాడు.
- మేషం: ఈ రాశివారికి కుటుంబ స్థానంలో గురు గ్రహ సంచారం వల్ల సంతాన యోగం పట్టే అవకాశం ఉంది. ఇంతవరకూ సంతానం కలగని దంపతులు తప్పకుండా సంతానానికి సంబంధించిన శుభ వార్త వినే అవకాశముంది. చదువుకుంటున్న పిల్లలున్న పక్షంలో వారు పోటీ పరీక్షల్లో, ఇంటర్వ్యూలలో విజయాలు సాధించడం జరుగుతుంది. ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బందీ ఉండదు. అనారోగ్యాల నుంచి పూర్తిగా కోలుకునే అవకాశం ఉంది. పిల్లల సుఖ సంతోషాలు అనుభవిస్తారు.
- వృషభం: ఈ రాశిలో గురు సంచారం వల్ల ఈ రాశివారికి తప్పకుండా సంతాన యోగం పడుతుంది. అతి త్వరలో ఈ రాశివారు ఇందుకు సంబంధించిన శుభ వార్తను రెండు మూడు నెలల్లో వినడం జరుగుతుంది. పిల్లలు చదువులు, పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. ఎటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నా కోలుకునే అవకాశముంది. పిల్లలు ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్లడం, విదేశాల్లో ఉద్యోగాలను ఆశిస్తున్న పిల్లలకు శుభవార్తలు అందడం వంటివి జరుగుతాయి.
- కర్కాటకం: ఈ రాశివారికి లాభ స్థానంలో గురు సంచారం వల్ల సంతాన యోగానికి అవకాశం ఉంది. ఇదివరకే పిల్లలున్నవారు కూడా సంతానానికి సంబంధించిన శుభ వార్త వినడానికి అవకాశం ఉంది. పిల్లల వల్ల తల్లితండ్రులకు అదృష్టం పడుతుంది. ఇంట్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పిల్లలు విద్యా విషయాల్లో ఘన విజయాలు సాధిస్తారు. మంచి పేరు తెచ్చుకుంటారు. ఉన్నత విద్యావకాశాలున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న పిల్లలు ఆశించిన సమాచారం అందుకుంటారు.
- కన్య: ఈ రాశివారికి నవమ కోణంలో గురు సంచారం వల్ల తప్పకుండా సంతానం కలిగే అవకాశం ఉంది. ఈ ఏడాదిలోనే శుభ వార్త వినే సూచనలున్నాయి. చదువులు, ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన సమాచారం అందుకుంటారు. విదేశాల్లో ఉన్నత విద్యావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పిల్లలకు సంబంధించి కొన్ని కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎటువంటి పోటీ పరీ క్షలు, ఇంటర్వ్యూల్లోనైనా ఘన విజయాలు సాధిస్తారు. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండే అవకాశం లేదు.
- వృశ్చికం: సప్తమ కేంద్రంలో ఉన్న గురువు ఈ రాశిని పూర్ణ దృష్టితో వీక్షిస్తున్నందువల్ల ఈ రాశివారికి అతి త్వరలో సంతాన యోగం కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యవంతమైన సంతానం కలుగుతుంది. పిల్లలు చదువుల్లో మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా విజయాలు సాధిస్తారు. ఈ సమయంలో పిల్లలు కలిగే పక్షంలో కుటుంబంలో అనేక శుభ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. పిల్లల కారణంగా విదేశాలు వెళ్లే అవకాశం కూడా ఉంది.
- మకరం: ఈ రాశికి పంచమ కోణంలో గురు సంచారం వల్ల సంతానానికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ శుభ వార్తలు వినడం జరుగుతుంది. ఇంత వరకూ సంతానం కలగని దంపతులకు ఒకటి రెండు నెలల్లో సంతాన యోగానికి సంబంధించిన శుభవార్త అందుతుంది. చదువుల్లో అంచనాలకు మించి పురోగతి చెందుతారు. పిల్లల పరంగా కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.