Rashi Parivartan Yoga: ఆ రాశుల వారికి జీవితాన్ని మలుపుతిప్పే శుభ యోగాలు పక్కా..!
గురువుకు చెందిన ధనూ రాశిలో కుజుడు, కుజుడికి చెందిన మేష రాశిలో గురువు సంచారం చేస్తున్నందువల్ల ఈ రెండు గ్రహాల మధ్య పరివర్తన యోగం ఏర్పడింది. అద్భుతమైన ఫలితాలనిచ్చే ఈ పరివర్తన యోగం ఫిబ్రవరి 5వ తేదీ వరకూ కొనసాగుతుంది. కుజుడి మీద గురువు దృష్టి కూడా పడడం ఈ పరివర్తన యోగానికి మరింత బలం తెచ్చిపెడుతోంది.
గురువుకు చెందిన ధనూ రాశిలో కుజుడు, కుజుడికి చెందిన మేష రాశిలో గురువు సంచారం చేస్తున్నందువల్ల ఈ రెండు గ్రహాల మధ్య పరివర్తన యోగం ఏర్పడింది. అద్భుతమైన ఫలితాలనిచ్చే ఈ పరివర్తన యోగం ఫిబ్రవరి 5వ తేదీ వరకూ కొనసాగుతుంది. కుజుడి మీద గురువు దృష్టి కూడా పడడం ఈ పరివర్తన యోగానికి మరింత బలం తెచ్చిపెడుతోంది. ఈ పరివర్తన యోగం వల్ల మేషం, మిథునం, సింహం, ధనుస్సు, మీన రాశులవారికి జీవితాన్ని మలుపు తిప్పే శుభయోగాలు ఏర్పడుతున్నాయి.
- మేషం: ఈ రాశివారికి ఎక్కువగా శుభవార్తలే అందుతుంటాయి. అనేక శుభ పరిణామాలు చోటు చేసు కుంటాయి. జీవితం సానుకూలమైన, ఆశించిన మలుపులు తీసుకుంటుంది. ఆకస్మిక ధన లాభంతో పాటు, ఆర్థిక ప్రయత్నాలన్నీ విజయం సాధిస్తాయి. దాంపత్యంలో అన్యోన్యత పెరుగు తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఇబ్బందులు, ఆటంకాలు తొలగిపోయి, అవి లాభసాటిగా సాగిపో తాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి.
- మిథునం: ఈ రాశివారికి ఎటు చూసినా లాభాలే తప్ప నష్టాలకు అవకాశం ఉండదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపా రాల్లో రాబడి ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. లాభసాటి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఎక్కువగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగా ల్లోనే కాకుండా ఆర్థికంగా కూడా స్థిరత్వం లభిస్తుంది. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు.
- సింహం: ఈ రాశివారికి అయిదు, తొమ్మిది రాశుల మధ్య శుభ పరివర్తన జరిగినందువల్ల ఎక్కువగా శుభ వార్తలే వినడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుం టాయి. దాంపత్య సమస్యలు పరిష్కారం అయి, దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. విదేశాల నుంచి ఆశించిన శుభ వార్తలు అందుతాయి. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. ఎటువంటి ప్రయత్నమైనా సానుకూల ఫలితాలనిస్తుంది. ఇష్టమైన పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.
- ధనుస్సు: ఈ రాశినాథుడైన గురువుతో కుజుడికి పరివర్తన ఏర్పడినందువల్ల మనసులోని కోరికలు చాలా వరకు నెరవేరే అవకాశం ఉంటుంది. ఎటువంటి ప్రయత్నం అయినా విజయవంతం అవుతుంది. సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది. పిల్లలు విశేషంగా వృద్ధిలోకి వస్తారు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. విదేశీయాన యోగం పడుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి, ముఖ్యమైన దేవాలయాలు సందర్శిస్తారు.
- మీనం: ఈ రాశికి ధన, దశమాధిపతుల మధ్య పరివర్తన జరిగినందువల్ల వృత్తి, ఉద్యోగాలపరంగా కొన్ని ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో అరుదైన మార్పులు జరుగుతాయి. ఉద్యోగ సంబంధమైన ఎటువంటి ప్రయత్నమైనా సత్ఫలితాలనిస్తుంది. కుటుం బంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఆర్థిక పరిస్థితి మున్నెన్నడూ లేనంతగా మెరుగుపడు తుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అయి మనశ్శాంతి ఏర్పడుతుంది.