Moon Astrology: చంద్ర బలంతో ఆ రాశుల వారికి సుఖ సంతోషాలు.. అందులో మీ రాశి కూడా ఉందా..?
ఈ నెల 23, 24, 25 తేదీల్లో చంద్రుడికి విపరీతంగా బలం పెరగబోతోంది. ఈ మూడు రోజుల్లో గురు, రవులకు చంద్రుడు సప్తమంలో, తులా రాశిలో సంచారం చేస్తున్నందువల్ల ఈ గ్రహానికి బాగా బలం పెరిగే అవకాశముంది. రవికి సప్తమంలో చంద్ర సంచారం వల్ల పౌర్ణమి ఏర్పడడంతో పాటు, గురువుకు సప్తమంలో చంద్ర సంచారం వల్ల గజకేసరి యోగం కూడా ఏర్పడడం ఒక పెద్ద విశేషం. పైగా తులా రాశిలో చంద్ర సంచారం జరుగుతుండడం కూడా విశేషమే.
ఈ నెల 23, 24, 25 తేదీల్లో చంద్రుడికి విపరీతంగా బలం పెరగబోతోంది. ఈ మూడు రోజుల్లో గురు, రవులకు చంద్రుడు సప్తమంలో, తులా రాశిలో సంచారం చేస్తున్నందువల్ల ఈ గ్రహానికి బాగా బలం పెరిగే అవకాశముంది. రవికి సప్తమంలో చంద్ర సంచారం వల్ల పౌర్ణమి ఏర్పడడంతో పాటు, గురువుకు సప్తమంలో చంద్ర సంచారం వల్ల గజకేసరి యోగం కూడా ఏర్పడడం ఒక పెద్ద విశేషం. పైగా తులా రాశిలో చంద్ర సంచారం జరుగుతుండడం కూడా విశేషమే. మొత్తానికి చంద్రుడి తులా రాశి సంచారం, పౌర్ణమి, గజకేసరి యోగం వల్ల కొన్ని రాశుల వారి మనసులోని కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ఎటువంటి వివాదమైనా అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ఎటువంటి నిర్ణయమైనా, ఎటువంటి ప్రయత్నమైనా ఫలిస్తుంది. ఆర్థిక నిర్ణయాలు మరింతగా నెరవేరుతాయి. ఈ చంద్ర బలం వల్ల మేషం, మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, మీన రాశుల వారికి ఆర్థికంగా, వృత్తి, ఉద్యోగాలపరంగా ప్రాభవం పెరుగుతుంది.
- మేషం: ఈ రాశిలో ఉన్న గురువు, ఉచ్ఛ రవితో చంద్రుడికి గజకేసరి యోగం ఏర్పడుతున్నందువల్ల ఎటు వంటి వివాదమైనా అనుకూలంగా పరిష్కారమవుతుంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. వివా దాలు, విభేదాలున్నవారితో సఖ్యత, సయోధ్య ఏర్పడతాయి. అనేక విధాలుగా డబ్బు సమ కూరు తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు బాగా రాణిస్తాయి. ఏ రంగంలోని వారికైనా స్థిరత్వం లభిస్తుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. పోటీదార్ల మీద విజయం సాధిస్తారు.
- మిథునం: ఈ రాశికి లాభ స్థానంలో గజకేసరి యోగం ఏర్పడుతున్నందువల్ల అనుకోని విధంగా ఆదాయ వృద్ది ఉంటుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. ఆర్థిక సమస్యలు దాదాపు పూర్తిగా తగ్గి పోతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యక్తిగత జీవితంలో సుఖ సంతో షాలు వృద్ధి చెందుతాయి. ఆశించిన శుభవార్తలు వింటారు. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ఆదాయ వృద్ధికి మార్గాలు అంది వస్తాయి.
- కర్కాటకం: ఈ రాశికి దశమ స్థానంలో గజకేసరి యోగం చోటు చేసుకోవడం వల్ల వృత్తి, ఉద్యోగాలకు సంబంధించిన ప్రతి ప్రయత్నమూ విజయవంతం అవుతుంది. ఉద్యోగంలో సహోద్యోగుల కంటే ఒక మెట్టు పైకి వెడతారు. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. గృహ, వాహన యోగాలకు వేసే ప్రణాళికలు తప్పకుండా సఫలం అవుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశముంది.
- తుల: ఈ రాశిలో ఉన్న చంద్రుడితో గజకేసరి యోగం ఏర్పడడం వల్ల ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, ఆర్థికంగా కూడా పట్టపగ్గాలుండవు. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలకు వెడతారు. వ్యాపారాలు అభివృద్ధి బాటపడతాయి. దాదాపు పట్టిందల్లా బంగారం అవు తుంది. అనేక విధాలుగా ప్రాభవం, పలుకుబడి పెరుగుతాయి. మాటకు, చేతకు విలువ ఉంటుంది.
- ధనుస్సు: ఈ రాశికి పంచమ స్థానంలో చంద్రుడికి సంబంధించిన యోగాలు పట్టడం వల్ల, ఈ రాశివారి మనసులోని ప్రధానమైన కోరికలన్నీ నెరవేరే అవకాశముంటుంది. శత్రు, రోగ, రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. పిల్లలకు సంబంధించి ఎక్కువగా శుభవార్తలే వింటారు. సంతాన యోగం కలిగే అవకాశముంది. వృత్తి, ఉద్యోగాల్లో ఒక వెలుగు వెలుగుతారు. ఊహించని విధంగా ఆదాయ వృద్ది ఉంది. అనారోగ్యం నుంచి కోలుకుంటారు.
- మీనం: ఈ రాశికి ధన స్థానంలో ఉన్న గురు, రవులతో చంద్రుడికి సమ సప్తక దృష్టి ఏర్పడడం వల్ల ఆదా యానికి, ఆర్థిక పరిస్థితికి సంబంధించిన ఏ ఆకాంక్ష అయినా, ఆశయమైనా నెరవేరుతుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. అదాయ వృద్ధితో పాటు అధికార యోగం కూడా పడుతుంది. మాటకు విలువ పెరుగుతుంది. మీ సలహాలు, సూచనలతో అధికారులు లాభ పడతారు. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఆధ్యాత్మిక చింతన వృద్ధి చెందుతుంది.