Horoscope Today: ఆ రాశి ఉద్యోగులు ఒత్తిడి ఎదుర్కొంటారు.. 12 రాశుల వారికి మంగళవారం రాశిఫలాలు

దిన ఫలాలు (ఏప్రిల్ 23, 2024): మేష రాశి వారు నూతన వస్తు లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి అన్ని విధాలుగానూ మెరుగ్గా ఉంటుంది. వృషభ రాశి వారు ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. నిరుద్యోగులకు శుభ వార్తలు అందుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులు ఒత్తిడి ఎదుర్కొంటారు.. 12 రాశుల వారికి మంగళవారం రాశిఫలాలు
Horoscope Today 23 April 2024
Follow us

|

Updated on: Apr 23, 2024 | 5:01 AM

దిన ఫలాలు (ఏప్రిల్ 23, 2024): మేష రాశి వారు నూతన వస్తు లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి అన్ని విధాలుగానూ మెరుగ్గా ఉంటుంది. వృషభ రాశి వారు ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. నిరుద్యోగులకు శుభ వార్తలు అందుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

చిన్ననాటి మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పనులు, వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. నూతన వస్తు లాభాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అన్ని విధాలుగానూ మెరుగ్గా ఉంటుంది. ఒకరిద్దరు మిత్రులకు సహాయం చేస్తారు. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. నిరుద్యోగులకు శుభ వార్తలు అందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కొద్దిపాటి అనారోగ్యంతో ఇబ్బంది పడతారు. విద్యార్థులకు శ్రమ కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో అనుకోకుండా అపార్థాలు తలెత్తుతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆర్థిక పరిస్థితి బాగానే అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా ఏ పని తలపెట్టినా విజయవంతం అవుతుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. కొందరు దూరపు బంధువులు బాగా దగ్గరవుతారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలందుతాయి. ఉద్యోగ జీవితం బాగా అనుకూలంగా సాగిపోతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఇంటా బయటా మానసిక ఒత్తిడి ఉంటుంది. కొద్దిగా అనారోగ్య సమస్యలు కూడా బాధిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థిక సహాయం చేయడంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. చేపట్టిన పనులు, వ్యవహా రాలు చురుకుగా పూర్తవుతాయి. ఉద్యోగంలో చిన్నపాటి సమస్యలుంటాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగి పోతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

అనుకున్న పనుల్ని అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యో గం లభించే అవకాశముంది. ప్రయాణాల వల్ల ఆర్థిక లాభాలుంటాయి. మంచి పరిచయాలు కలుగుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. మొత్తం మీద ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల అండదండలుంటాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆరోగ్యం విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. పెండింగు పనులు మళ్లీ వాయిదా పడతాయి. ఆర్థిక వ్యవహారాలు పరవాలేదనిపిస్తాయి. వృథా ఖర్చులు అదుపు తప్పుతాయి. వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలు తీసు కోవడానికి ఇది సమయం కాదు. వృత్తి జీవితం ఆశాజనకంగా సాగిపోతుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. విద్యార్థులకు శ్రమ తప్పదు. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయాలు సాధిస్తారు. కుటుంబ సభ్యు లతో శుభకార్యంలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా, ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం లభి స్తుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఉత్సాహం పెరుగుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది కానీ, ఆర్థిక లావాదేవీలు ఇబ్బందులు పెడతాయి. డబ్బు మోసపోయే అవకాశం కూడా ఉంది. వ్యత్తి, వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. ఉద్యోగాల్లో అధికా రులను పనితీరుతో ఆకట్టుకుంటారు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. బంధుమిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. విద్యార్థులకు శ్రమ ఎక్కు వవుతుంది. ప్రేమ వ్యవహారాల్లో చికాకులు తలెత్తుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

సమయం బాగా అనుకూలంగా ఉంది. చేపట్టిన పనుల్లో ఘన విజయాలు సాధిస్తారు. ఇష్టమైన బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ తేలికగా పూర్తవుతాయి. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు పెరుగుతాయి. వాహన యోగం పడు తుంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా దూసుకుపోతాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో అప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది. బంధువులు, కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. సోదరులతో వివాదాలు పరి ష్కార మవుతాయి. శ్రమాధిక్యత ఉన్నా వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ఉద్యోగంలో ప్రాధా న్యం పెరుగుతుంది. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. బాగా ఆలోచించి వ్యాపారపరంగా కొత్త నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలుంటాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశముంది. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులు శ్రమపడాల్సి వస్తుంది. ప్రేమ వ్యవహారాలు నిరుత్సాహంగా సాగుతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

నిరుద్యోగులకు శుభ వార్తలు అందుతాయి. ఉద్యోగులు ఉత్సాహంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. వృత్తి జీవితంలో రాబడి బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాల పంట పండుతుంది. సమా జంలో పలుకుబడి విస్తరిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగత సమస్యల్ని చాలావరకు తగ్గించుకుం టారు. విద్యార్థులకు బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహం కలిగిస్తాయి.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?